iDreamPost
android-app
ios-app

సొంతగా వ్యాపారం చేసుకోవాలా? ఇలా చేస్తే ష్యూరిటీ లేకుండా రూ.10లక్షల లోన్!

  • Published Jan 29, 2024 | 2:35 PM Updated Updated Jan 29, 2024 | 2:35 PM

దేశంలోని యువత కలలను సాకారం చేసి.. వారి అభివృద్ధికి తోడ్పడేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. అది కూడా ఎటువంటి ష్యురీటి లేకుండానే రుణాలు అందచేయనుంది.

దేశంలోని యువత కలలను సాకారం చేసి.. వారి అభివృద్ధికి తోడ్పడేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. అది కూడా ఎటువంటి ష్యురీటి లేకుండానే రుణాలు అందచేయనుంది.

  • Published Jan 29, 2024 | 2:35 PMUpdated Jan 29, 2024 | 2:35 PM
సొంతగా వ్యాపారం చేసుకోవాలా?  ఇలా చేస్తే ష్యూరిటీ లేకుండా రూ.10లక్షల లోన్!

దేశంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ.. ప్రజలకు సహాయం చేస్తూ ఉంటున్నాయి. ఈ క్రమంలో ఎక్కువగా యువతను దృష్టిలో ఉంచుకుని.. కొన్ని ప్రత్యేక పథకాలను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఎందుకంటే యువత దేశానికీ వెన్నుముక లాంటిది. యువతలో ఉండే శక్తి సామర్థ్యాలను గుర్తించి.. వారికీ సరైన ప్రోత్సాహం అందిస్తే.. ఖచ్చితంగా వారు అభివృద్ధి చెందుతారు. వారితో పాటు దేశ భవిష్యత్తు కూడా వృద్ధి చెందుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకోసమే వారికి తోడ్పడేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన పథకాన్ని అమలు చేయనుంది. అదే ప్రధాన మంత్రి ముద్ర యోజన(PMMY). ఇది చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి సుమారు రూ. 10 లక్షల వరకు రుణాలను అందచేయనుంది. మరి, ఈ లోన్ ఎలా ఇస్తారు! ఈ లోన్ తీసుకోడానికి ఎవరు అర్హులు ! దీనికోసం ఎటువంటి పత్రాలను అందచేయాలి! ఇలాంటి వివరాలు అన్ని తెలుసుకుందాం.

“ప్రధాన మంత్రి ముద్ర యోజన(PMMY)” ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.. యువతను వ్యాపారవేత్తలుగా మార్చి.. దేశ అభివృద్ధిలో భాగంగా చేయడమే. ఎవరికైనా మంచి వ్యాపార ఆలోచన ఉండి.. దానిని ప్రారంభించేందుకు పెట్టుబడి లేకపోతే.. అటువంటి వారికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద కార్పొరేట్, వ్యవసాయ, ఇతర ప్రయోజనాల కోసం రుణాలు అందిస్తారు. సుమారు రూ.10 లక్షల వరకు రుణం మంజూరు చేస్తుందని సమాచారం. అది కూడా ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే మంజూరు చేయనున్నారు. సాధారణంగా బ్యాంకులలో లోన్ తీసుకున్నపుడు.. మీ ఆస్తిలో దేనినైనా సెక్యూరిటీగా బ్యాంకులో తనఖా పెట్టాలి, కానీ పీఎం ముద్రా లోన్ స్కీమ్ లో మాత్రం.. అటువంటివేమీ అవసరం లేదు.

అయితే, ఈ లోన్ ను తీసుకోదలిచిన వారు.. వారి వారి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు, చిన్న ఫైనాన్స్ బ్యాంక్, నాన్-ఫైనాన్షియల్ కంపెనీ లాంటి.. ప్రభుత్వ/ప్రైవేట్ బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ లోన్ ను మొత్తం మూడు భాగాలుగా విభజించారు. అవి శిశు రుణం, కిషోర్ లోన్, తరుణ్ లోన్ వీటిలో శిశు రుణం పథకం కింద రూ. 50,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కిషోర్ లోన్ పథకం కింద రూ. 5 లక్షల వరకు రుణం అందుతుంది. తరుణ్ లోన్ పథకం కింద రూ. 10 లక్షల వరకు రుణం లభించే అవకాశం ఉంది. ఈ రుణాలను సొంతంగా వ్యాపారం చేసుకునే వారు, ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారు దానిని విస్తరించుకోవడానికి కూడా.. ఈ రుణాలను తీసుకునేందుకు అర్హులు. కానీ, వీటిని తీసుకోవాలి అనుకునే వారు కొన్ని రూల్స్ ను పాటించాల్సి వస్తుంది.

ఈ కొత్త లోన్ ను తీసుకోవాలి అనుకునే వారు.. తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. గతంలో ఆ వ్యక్తులపై ఎటువంటి ఫాల్స్ కంప్లైంట్స్ ఉండకూడద. అంతేకాకుండా ఈ లోన్ ను తీసుకోదలిచిన ఏ వ్యాపార సంస్థ అయినా.. కార్పొరేట్ సంస్థ కాకూడదు. పైగా ఆ వ్యక్తి ఏదైనా బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. ఇక ఆ వ్యక్తి వయస్సు ఖచ్చింతంగా 18 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి. ఇక ముద్ర లోన్ ప్రయోజనాల విషయానికొస్తే.. ఆ వ్యక్తి అవసరాన్ని బట్టి రూ. 50,000 నుండి రూ. 10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. దానికి ఎటువంటి ప్రాసెసింగ్‌ ఫీజు ఉండదు. తిరిగి ఆ రుణాన్ని చెల్లించాల్సిన వ్యవధి 12 నెలల నుండి 5 సంవత్సరాల కాలం వరకు ఉంటుంది. ఒకవేళ 5 సంవత్సరాలలో చెల్లించలేకపోతే.. ఆ వ్యవధి మరో 5 సంవత్సరాలు పొడిగిస్తారు. అంతేకాకుండా మొత్తం రుణాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా.. ముద్ర కార్డ్ ద్వారా విత్‌డ్రా చేసి ఖర్చు చేసిన వాటికీ మాత్రమే వడ్డీ విధిస్తారు.

ఇక ఈ ముద్రా లోన్ ను ఈ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ముద్రా యోజన అధికారిక వెబ్‌సైట్‌(mudra.org.in)కి వెళ్లండి. దానిలో పైన చెప్పిన శిశు, కిషోర్, తరుణ్ అనే మూడు రకాల రుణాలను చూపుతూ హోమ్ పేజీ ఓపెన్‌ అవుతుంది. వాటిలో ఎవరి అవసరాన్ని బట్టి వారు ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఆ తరువాత అప్లికేషన్ ఫార్మ్ తో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వ్యాపార చిరునామా రుజువు, ఆదాయపు పన్ను రిటర్న్, స్వీయ పన్ను రిటర్న్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇలా అవసరమైన కొన్ని పత్రాల ఫోటో కాపీలను దానికి జత చేయాలి. ఇక ఆ తరువాత ఈ అప్లికేషన్ ఫార్మ్ ను దగ్గరలోని బ్యాంకులో అందచేయాలి. అన్ని ఫార్మాలిటీస్ సరిగ్గా ఉంటే నెల రోజులలోపు.. అవసరమైనంత రుణాన్ని మంజూరు చేస్తారు. మరి, దేశ భవిష్యత్తు కోసం యువతను దృష్టిలో ఉంచుకుని.. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఈ పథకంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.