Vinay Kola
Good News: మధ్య తరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా ఇంకో నిర్ణయం తీసుకుంది.
Good News: మధ్య తరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా ఇంకో నిర్ణయం తీసుకుంది.
Vinay Kola
ఇటీవల కాలంలో మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది..ఇంతకీ కేంద్రం మధ్యతరగతి ప్రజలకు తాజాగా తీసుకొచ్చిన గుడ్ న్యూస్ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయంలో భాగంగా టాక్స్ రేట్లలో కీలక మార్పులను చేస్తూ వస్తోంది. ముఖ్యంగా పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకుండా.. కొత్త పన్ను విధానాన్ని మధ్య తరగతి ప్రజలకు అనుగుణంగా మారుస్తోంది. రీసెంట్ గా మధ్య తరగతి వర్గం వారికి టాక్స్ రేట్లను తగ్గించింది. ట్యాక్స్ శ్లాబుల్ని సవరణ చేసింది. స్టాండర్డ్ డిడక్షన్ ని పెంచింది. దీంతో త్వరలో పాత పన్ను విధానం ఇక ఉండకపోవచ్చని సమాచారం. అయితే దీన్ని రద్దు చేసేందుకే కేంద్రం ఇందులో ఎలాంటి మార్పులు చేయట్లేదని తెలుస్తుంది. అయితే ఇప్పుడు సంవత్సరానికి రూ. 20 లక్షలు అంతకంటే తక్కువ సంపాదించే మధ్య తరగతి ప్రజలపై పన్ను భారం తగ్గిందట. మరోవైపు ఇదే సమయంలో రూ. 50 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్న వారు చెల్లించే టాక్స్ మాత్రం పెరిగిందని తెలుస్తుంది.
ఇక ఐటీ రిటర్న్స్ చేసిన వారి వివరాల్ని బట్టి తెలిసిన విషయం ఏమిటంటే.. రూ. 50 లక్షలకుపైగా ఆదాయం ఉన్న వారి సంఖ్య 2013-14లో 1.85 లక్షలుగా ఉంది. ఈ సంఖ్య కాస్త 2023-24 నాటికి 5 రెట్లు పెరిగి 9.39 లక్షలకు చేరిందంట. ఇక వీరు చెల్లిస్తున్న ట్యాక్స్ అంతా కూడా 2014లో రూ. 2.52 లక్షల కోట్లుగా ఉంది.. అది 3.2 రెట్లు పెరిగి 2024 కి రూ. 9.62 లక్షల కోట్లు అయ్యింది. ఇక మొత్తం ఆదాయపు పన్నులో 76 శాతం దాకా ఏటా రూ. 50 లక్షలకుపైగా సంపాదిస్తున్న వారి నుంచే వసూలవుతున్నట్లు తెలుస్తుంది. అందుకే మధ్యతరగతి ప్రజలపై క్రమంగా పన్ను భారం తగ్గుతున్నట్లు సమాచారం.
ఇక రూ. 2.5 లక్షల నుంచి 7 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారు కట్టాల్సిన ఇన్‌కం టాక్స్ 2023-24 లో సగటున రూ. 43 వేలుగా ఉంది. అంటే ఇది వారి ఆదాయంలో కేవలం 4-5 శాతం వరకే ఉంటుంది. పది సంవత్సరాలలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేశాక.. రూ. 10-20 లక్షల రేంజిలో సంపాదిస్తున్న వారి మీద పన్ను భారం దాదాపుగా 60 శాతం తగ్గినట్లు తెలుస్తుంది. ఇక మొత్తం ఐటీ రిటర్న్స్ సంఖ్య పదేళ్ల కిందట 3.60 కోట్లు ఉండేది.. ఇప్పుడు అది ఏకంగా 7.97 కోట్లకు పెరగడం విశేషం. ఇదీ సంగతి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలపై పన్ను భారం తగ్గించింది. ఇక ఈ విషయం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.