iDreamPost
android-app
ios-app

మంచి ఛాన్స్.. ఈ కార్లపై రూ.5 లక్షల వరకు తగ్గింపు!

  • Published Nov 25, 2023 | 12:51 PM Updated Updated Nov 25, 2023 | 12:51 PM

పండగలకు, ప్రత్యేక సందర్భాల్లో కార్ల కంపెనీలు, వాటి డీలర్లు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటారు. తాజాగా కొన్ని కార్లపై రూ.5 లక్షల వరకు తగ్గింపు వచ్చేలా ఆఫర్ల ఉన్నాయి. కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుత అవకాశం.

పండగలకు, ప్రత్యేక సందర్భాల్లో కార్ల కంపెనీలు, వాటి డీలర్లు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటారు. తాజాగా కొన్ని కార్లపై రూ.5 లక్షల వరకు తగ్గింపు వచ్చేలా ఆఫర్ల ఉన్నాయి. కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుత అవకాశం.

  • Published Nov 25, 2023 | 12:51 PMUpdated Nov 25, 2023 | 12:51 PM
మంచి ఛాన్స్.. ఈ కార్లపై రూ.5 లక్షల వరకు తగ్గింపు!

చాలా మందికి  సొంత ఇళ్లు, కారు ఉండాలని ఆశ పడుతుంటారు. ముఖ్యంగా సొంతకారులో ప్రయాణించాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే కొందరు తమ కలను సాకారం చేసుకుంటారు. మరికొందరు.. ఏదైనా మంచి  ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంటారు. అలా కొత్త కారు కొనుగోలు చేయాన్ని భావిస్తున్నట్లయితే మీకు ఇదే మంచి అవకాశంగాచెప్పవచ్చు. అద్భుతమైన ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రీమియ కార్లపై ఏకంగా రూ.5 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు.  కంపెనీలు ఇతర ఉపయోగాలు సైతం అందిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడే తెలుసుకుందాం..

కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. వివిధ కంపెనీలు పండగలకు, ఇతర ప్రత్యేక దినాల్లో  ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలానే తాజాగా కారు కొనుగోలు చేసే వారికి ఓ అదిరే ఆఫర్ అందుబాటులోఉంది. పలు టాప్ బ్రాండ్లు, డీలర్లు మిడ్ సైజ్ ఎస్యూవీలపై ఆఫర్లు ప్రకటించాయి. కార్ల రుణాలపై  పలు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ప్రకటిస్తున్నాయి.

కొత్తకార్ల కొనుగోలు పై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు కూడా చేస్తున్నాయి. అంతేకాక ఈఎంఐలపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఎక్స్‌ చేంజ్‌ బోనస్‌లు, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్‌ డిస్కౌంట్లు అంటూ లాభాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు ఒక కారుపై ఏకంగా రూ.5 లక్షల వరకూ తగ్గింపు పొందే అవకాశం ఉంది. అయితే ఈ ఆఫర్స్ నవంబర్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయంట. ఈ డీల్స్‌ను మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ కారు కొనాలనుకునే వారు మిస్ చేసుకోవద్దు.

టయోటా హిలక్స్ కారుపై ఏకంగా రూ.5 లక్షల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ తో పాటు బ్యాంకు ఆఫర్లు, ఎక్సైంజీ బోనస్, క్యాష్ బ్యాక్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే మహీంద్ర కంపెనీ నుంచి మార్కెట్లోకి వ్చిచన  ఎస్ యూవీ 400 ఎలక్ట్రిక్ కారుపై గరిష్టంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అదే విధంగా అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

హ్యూండాయ్ కోనా ఈవీ  కారుపై  రూ.2 లక్షల వరకు తగ్గింపు  లభిస్తుంది. అదనపు ప్రయోజనాలు కూడా కొంత మంది డీలర్లు అందిస్తున్నారు. అదే విధంగా ఎంజీజెడ్ఎస్ ఈవీ కారును కొనుగోలు చేసినట్లయితే రూ.2.3 లక్షల వరకు డిస్కౌంట్  పొందవచ్చు.  సిట్రోయెన్ సీ-5 ఎయిర్ క్రాస్ కారు ను.. కొన్ని ఎంపిక చేసిన సిట్రోయోన్ డీలర్లు మాత్రమే డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇక్కడ దాదాపు రూ.2.5 లక్షల వరకు వివిధ రకాల ప్రయోజనాలు పొందవచ్చు.

జీప్ మెరిడియన్ కారు కొనుగోలు చేస్తే..  దీనిపై రూ.1.9 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాక ఇతర ప్రయోజనాలు పొందొచ్చు.  ఇందులో రూ.1.15 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ.50వేల ఎక్సైంజ్ బోనస్, రూ.20 వేల కార్పొరేట్ బోనస్ లు లభిస్తాయి. వీడబ్ల్యూ టిగువాన్ కారుపై  రూ.1.85 లక్షల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. జీప్ కంపాస్ కారును కొనుగోలు  చేస్తే.. రూ.85 వేల నగదు డిస్కౌంట్, రూ.50 వేల ఎక్సైచేంజ్ బోనస్, రూ.15 వేల కార్పొరేట్ బోనస్ పొందవచ్చు.

ఎంజీ ఆస్టర్ కారుపై రూ.1.5 లక్షల వరకూ నగదు తగ్గింపు పొందవచ్చు. ఇందులో రూ.1 లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 50,000 వరకూ ఎక్స్చేంజ్‌ బోనస్‌ అందుతుంది. స్కోడా కుషాక్ కంపెనీకి చెందిన కారును కొనుగోలు చేయాలనుకునే వారు రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. రూ. 40 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్‌, రూ. 25 వేలు కార్పొరేట్ బోనస్ లభిస్తుంది.

టాటా సఫారి అండ్‌ హారియర్ ప్రీ ఫేస్‌లిఫ్ట్ కార్లపై లక్షన్నర వరకు ప్రయోజనాలు లభిస్తాయి. సిట్రోయెన్ సి-3 ఎయిర్‌క్రాస్ కారుపై రూ. 99 వేల వరకు ప్రయోజనాలు ఉంటాయి. 5 సంవత్సరాల వరకూ ఏఎంసీ, వారంటీ వంటి మెయింటెనెన్స్‌ మద్దతు ఉంటుంది. ఇక పూర్తి వివరాలకు ఆయ కార్ల కంపెనీల డీలర్లను సంప్రదిస్తే మేలు. మరి… ఇలా ఈ కార్లపై రూ.5 లక్షల వరకు తగ్గింపు  ఇస్తుండటం మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş