iDreamPost
android-app
ios-app

Honda: బైక్ కొనాలనుకుంటున్నారా? హొండా నుంచి బంపర్ ఆఫర్!

  • Published Sep 11, 2024 | 2:00 AM Updated Updated Sep 11, 2024 | 2:00 AM

Honda: హొండా టూ వీలర్ లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లు, బైక్‌లలో హొండా టూ వీలర్స్ కూడా ఉన్నాయి

Honda: హొండా టూ వీలర్ లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లు, బైక్‌లలో హొండా టూ వీలర్స్ కూడా ఉన్నాయి

Honda: బైక్ కొనాలనుకుంటున్నారా? హొండా నుంచి బంపర్ ఆఫర్!

హొండా టూ వీలర్ లకు ఇండియన్ మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ఇంకా మంచి డిమాండ్ కూడా ఉంది. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లు, బైక్‌లలో హొండా కంపెనీకి చెందిన టూ వీలర్స్ కూడా ఉన్నాయి. గడిచిన ఆగస్టు నెలలో హొండా  స్థిరమైన వృద్ధి రేటును సాధించింది.  టూ వీలర్ల డిస్పాచ్లు మొత్తం 5,38,852 యూనిట్లకు చేరుకున్నాయి. వీటిలో దేశీయ అమ్మకాలు 4,91,678 యూనిట్లు ఉన్నాయి. ఇక ఎగుమతులు మొత్తం 47,174 యూనిట్లు ఉన్నాయి. ఈ నెలలో దేశీయ అమ్మకాలు 9 శాతం పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఎగుమతులు 79 శాతం పెరిగాయి. ఇక ఏప్రిల్ 2023 నుంచి ఆగస్టు 2024 దాకా దేశీయ అమ్మకాలు 23,45,028 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతులు 2,29,716 యూనిట్లుగా  ఉన్నాయని హొండా కంపెనీ తెలిపింది.

మార్కెట్లో ఉన్న ప్రజాదరణని మరింత మెరుగుపరుచుకునేందుకు హోండా కంపెనీ మరిన్ని ప్రయత్నాలు చేస్తుంది. దానికి  ఈ పండుగ సీజన్ ను బాగా వాడుకుంటుంది.  వినియోగదారులను ఇంకా బాగా ఆకర్షించేందుకు తన హోండా షైన్ 100, హోండా యాక్టివా వాహనాలపై అదిరిపోయే  ఆఫర్లని  ప్రకటించింది. ఇక ఈ ఆఫర్లలో క్యాష్ బ్యాక్, మెయింటెనెన్స్ ప్యాకేజీ, ఎక్స్ టెండెడ్ వారంటీ వంటివి ఇస్తుంది. అయితే  ఈ ఆఫర్లు కేవలం సెప్టెంబర్ నెలాఖరు దాకా  మాత్రమే అందుబాటులో ఉంటాయని హొండా కంపెనీ ప్రకటించింది. ఇక హోండా ప్రకటించిన ఈ ఆఫర్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

హోండా యాక్టివా, హోండా షైన్ 100 టూ వీలర్లు కొనే  వినియోగదారులకు ప్రతి కొనుగోలుపై 5శాతం క్యాష్ బ్యాక్ ఉంటుంది. అంటే రూ. 5000 దాకా క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అలాగే ఒక సంవత్సరం పాటు మెయింటెనెన్స్ ప్యాకేజీని కూడా ఫ్రీగా  అందిస్తోంది. ఇక  యాక్టివా స్కూటర్ పై మూడేళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీ అందిస్తుంది. షైన్ 100 బైక్ పై అయితే ఏడేళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీని అందిస్తుంది. అయితే ఈ ఆఫర్లు కేవలం సెస్టెంబర్ నెలాఖరు దాకా మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ఇక ఈ ఆఫర్ల గురించి పూర్తి వివరాల కోసం హోండా అథరైజ్డ్ డీలర్ ని సంప్రదించాలని హోండా సూచించింది. మరి హోండా కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabettarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet