iDreamPost
android-app
ios-app

BSNL నుంచి మతిపోగొట్టే రీచార్జ్ ప్లాన్‌.. తక్కువ ధరతో 5 నెలల వ్యాలిడిటీ

  • Published Aug 30, 2024 | 8:29 PM Updated Updated Aug 30, 2024 | 8:29 PM

BSNL Prepaid plan: మొబైల్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే ప్లాన్ అందుబాటులో ఉంది. తక్కువ ధరతో రీచార్జ్ చేసుకుంటే 5 నెలల వ్యాలిడిటీ పొందొచ్చు. ఇంకా మరెన్నో బెనిఫిట్స్.

BSNL Prepaid plan: మొబైల్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే ప్లాన్ అందుబాటులో ఉంది. తక్కువ ధరతో రీచార్జ్ చేసుకుంటే 5 నెలల వ్యాలిడిటీ పొందొచ్చు. ఇంకా మరెన్నో బెనిఫిట్స్.

  • Published Aug 30, 2024 | 8:29 PMUpdated Aug 30, 2024 | 8:29 PM
BSNL నుంచి మతిపోగొట్టే రీచార్జ్ ప్లాన్‌.. తక్కువ ధరతో 5 నెలల వ్యాలిడిటీ

మొబైల్ యూజర్లకు అదిరిపోయే ప్లాన్లను తీసుకొస్తున్నది బీఎస్ఎన్ఎల్. ప్రముఖ టెలికాం కంపెనీలైన ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలను పెంచిన తర్వాత మొబైల్ యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కు మారుతున్నారు. 4జీ నెట్ వర్క్ ను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నది. 2026 వరకు 5జీ సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది. ఇక కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే ప్లాన్లను తీసుకొస్తున్నది బీఎస్ఎన్ఎల్. ఇప్పుడు అద్భుతమైన రీచార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. చౌకైన ధరతో 5 నెలల వ్యాలిడీటిని పొందే రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ అందించే చౌక రీచార్జ్ ప్లాన్ తో కళ్లు చెదిరే బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ ప్లాన్ ధర కేవలం రూ. 397. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 5 నెలల వ్యాలిడిటీ పొందొచ్చు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 30 రోజుల పాటు అన్ లిమిటెడ్ ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. 150 రోజుల పాటు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తుంది. మొదటి 30 రోజులు, మీరు రోజువారీ 2 జీబీ ఇంటర్నెట్ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. మీరు మొదటి 30 రోజులపాటు ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ లను కూడా పొందుతారు.

వార్షిక ప్లాన్ కోసం చూసే వారికి 365 డేస్ వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ధర రూ. 2999గా ఉంది. ఈ రీచార్జ్ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే సంవత్సరం పొడవునా అన్ లిమిటెడ్ కాల్స్, ప్రతి రోజు 3 జీబీ హైస్పీడ్ డేటా పొందొచ్చు. ఈ వార్షిక ప్లాన్ లో యూజర్లు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పొందొచ్చు. సినిమాలు, గేమింగ్ కోసం ఎక్కువ డేటాను యూజ్ చేసే వారికి ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetcratosroyalbetcasibomcasibomcasibombetcio giriş