iDreamPost
android-app
ios-app

BSA గోల్డ్ స్టార్ 650, రాయల్ ఎన్​ఫీల్డ్ ఇంటర్​సెప్టర్ 650 రెండింటిలో ఏది బెస్ట్?

  • Published Aug 18, 2024 | 11:54 AM Updated Updated Aug 18, 2024 | 11:54 AM

BSA Gold Star 650 vs Royal Enfield Interceptor 650: రెండు వాటికవే ప్రత్యేకం అని చెప్పాలి. ఈ రెండు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి బైక్స్ గా సత్తా చాటాయి.

BSA Gold Star 650 vs Royal Enfield Interceptor 650: రెండు వాటికవే ప్రత్యేకం అని చెప్పాలి. ఈ రెండు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి బైక్స్ గా సత్తా చాటాయి.

  • Published Aug 18, 2024 | 11:54 AMUpdated Aug 18, 2024 | 11:54 AM
BSA గోల్డ్ స్టార్ 650, రాయల్ ఎన్​ఫీల్డ్ ఇంటర్​సెప్టర్ 650 రెండింటిలో ఏది బెస్ట్?

లెజెండరీ బైక్ కంపెనీ బీఎస్​ఏ గురించి ఇప్పటి యువతకు తెలీకపోవచ్చు కానీ ఒకప్పుడు దీనికి మామూలు డిమాండ్ ఉండేది కాదు.. 1970 కాలం నాటి ఈ బైక్ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో దుమ్ముదులిపింది. అప్పట్లో ఈ బైక్ యువతని ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. అయితే బీఎస్​ఏ కంపెనీ మళ్ళీ 50 సంవత్సరాల తరువాత తన బ్రాండ్​ను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. తాజాగా కంపెనీ బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​ 650ను మళ్ళీ పరిచయం చేసింది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఈ బైక్ ఎట్టకేలకు మన దేశానికి వచ్చి రాయల్ ఎన్​ఫీల్డ్​ ఇంటర్​సెప్టర్ 650తోనే పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చితో ఏ బైక్ ​బెస్ట్ ? అనే విషయం గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం…

బీఎస్​ఏ గోల్డ్ స్టార్ 650, రాయల్ ఎన్​ఫీల్డ్ ఇంటర్​సెప్టర్ 650 లుక్స్ విషయానికి వస్తే.. రెండు మోటార్ సైకిళ్లు కూడా సూపర్ డిజైన్​ను కలిగి ఉన్నాయి. గోల్డ్ స్టార్ 650 బైక్ అయితే మరింత క్లాసిక్ డిజైన్​ను కలిగి ఉండగా, ఇంటర్​సెప్టర్ 650 మాత్రం రోస్టర్ గా డిజైన్ చేయబడింది. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్​సెప్టర్​లో ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్, అల్లాయ్ వీల్స్ వంటి సూపర్ అప్డేటెడ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.ఇక ఈ రెండు బైక్స్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. గోల్డ్ స్టార్ 650 బైక్​లో లిక్విడ్-కూల్డ్, డీఓహెచ్​సీ, 4 వాల్వ్ కాన్ఫిగరేషన్ కలిగిన 652సీసీ ఇంజిన్ అనేది ఉంది. ఇది 6,000 ఆర్​పీఎమ్ వద్ద 45 హార్స్ పవర్, 4,000 ఆర్​పీఎమ్ వద్ద 55 ఎన్ఎమ్ మాక్సిమం టార్క్​ను ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఈ బైక్ 6-స్పీడ్ గేర్ బాక్స్​కు బదులుగా 5-స్పీడ్ ట్రాన్స్​మిషన్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది.ఇక ఇంటర్​సెప్టర్ 650 బైక్​ విషయానికి వస్తే.. ఇందులో 648 సీసీ ట్విన్, ఫోర్-స్ట్రోక్, సింగిల్ ఓవర్​హెడ్ క్యామ్, ఎయిర్/ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంది. ఇది మాక్సిమం 7,150 ఆర్​పీఎమ్ వద్ద 47బీహెచ్​పీ పవర్.. 5,250 ఆర్​పీఎమ్ వద్ద 52 ఎన్ఎమ్ మాక్సిమం టార్క్​ను ప్రొడ్యూస్ చేస్తుంది.దీని ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్​మిషన్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది.

బీఎస్​ఏ గోల్డ్ స్టార్ దాని సస్పెన్షన్ సిస్టమ్ కోసం 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్లతో, డ్యూయెల్-క్రేడిల్ డిజైన్​తో,ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్​తో వస్తుంది.. బ్రేకింగ్ కోసం, ముందు సింగిల్ 320 ఎంఎం డిస్క్, వెనుక 255 ఎంఎం డిస్క్ లు ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్లు, బరువు 201 కిలోలు ఉంటుంది. రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఇంటర్​సెప్టర్ 650 కూడా ట్యూబ్యులర్ స్టీల్ ఫ్రేమ్​ని ఉపయోగిస్తుంది.ఇది సస్పెన్షన్ సిస్టెమ్ 41 ఎంఎం ఫ్రంట్ ఫోర్క్, 110 ఎంఎం ట్రావెల్, ట్విన్ కాయిల్-ఓవర్ షాక్లతో 88 ఎంఎంని అందిస్తుంది. ఇంటర్​సెప్టర్ 650.. 174 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి 13.7 లీటర్ల ఇంధన సామర్థ్యం, 202 కిలోల బరువు కలిగి ఉంటుంది. గోల్డ్ స్టార్ 650 ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.3.35 లక్షల దాకా ఉంటుంది. ఇది ఇంట్రొడక్టరీ ప్రైజ్​.ఇంటర్​సెప్టర్ 650 ధర రూ.3.03 లక్షల నుంచి రూ.3.31 లక్షల దాకా ఉంటుంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. అయితే రెండింటిలో బెస్ట్ బైక్ ఏదంటే రెండు వాటికవే ప్రత్యేకం అని చెప్పాలి. రెట్రో లుక్స్ కావాలనుకునేవారికి గోల్డ్ స్టార్ బెస్ట్ ఆప్షన్. లేదా అప్డేటెడ్ ఫీచర్స్ కావాలనుకునేవారికి ఇంటర్​సెప్టర్ బెస్ట్ ఆప్షన్. మరి ఈ రెండింటిలో మీకు ఏ బైక్ బెస్ట్ గా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom