iDreamPost
android-app
ios-app

55 వేలకే EV.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ ఇలాంటి ఆఫర్ దొరకదు!

ఎలక్ట్రిక్ టూవీలర్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆలోచిస్తున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. రూ. 55 వేలకే ఈవీని మీ సొంతం చేసుకోవచ్చు. త్వరపడండి.

ఎలక్ట్రిక్ టూవీలర్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆలోచిస్తున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. రూ. 55 వేలకే ఈవీని మీ సొంతం చేసుకోవచ్చు. త్వరపడండి.

55 వేలకే EV.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ ఇలాంటి ఆఫర్ దొరకదు!

ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. బడ్జెట్ ధరల్లోనే ఈవీలు వస్తుండడంతో వాహనదారులు కొనేందుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు. మార్కెట్ లో ఈవీలకు డిమాండ్ పెరగడంతో టూవీలర్ తయారీ కంపెనీలు అధునాతన టెక్నాలజీ, ఫీచర్లు, డిజైన్ తో సరికొత్త మోడల్స్ ను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు, కార్లు వాటి హవా కొనసాగిస్తున్నాయి. మరి మీరు ఈ మధ్యకాలంలో కొత్త ఈవీ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ఇదే మంచి సమయం. అతి తక్కువ ధరకే ఈవీ స్కూటర్ ను దక్కించుకోవచ్చు. రూ. 55 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకోవచ్చు.

మార్కెట్ లోకి కొత్త ఈవీ స్కూటర్లు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అదిరే ఫీచర్లతో మరో ఈ- స్కూటర్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టూవీలర్ తయారీ సంస్థ బౌన్స్ ఇన్‌ఫినిటీ తాజాగా కొత్త ఈ-స్కూటర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. కంపెనీ కొత్తగా మార్కెట్‌లోకి తెచ్చిన మోడల్ పేరు ఈ1ఎక్స్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 55 వేల నుంచి ప్రారంభమవుతోంది. గరిష్ట ధర రూ. 59 వేలుగా ఉంది. ఈ1ఎక్స్ స్కూటర్ అమ్మకాలు జూన్ నెల నుంచి ప్రారంభంకానున్నాయి. బడ్జెట్ ధరలోనే ఈవీ కావాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్. మళ్లీ ఇలాంటి ఆఫర్ రాదు.

ఈ1ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక దాని టాప్ స్పీడ్ గంటకు 55 కిలోమీటర్లు. ఇక రెండో వేరియంట్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. అలాగే కంపెనీ ఇందులో మరో కొత్త మోడల్ తీసుకురానుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 92 కిలోమీటర్లు ఉండనుంది. బౌన్స్ ఇన్‌ఫినిటీ కంపెనీ బ్యాటరీ స్వాపింగ్ ఫీచర్‌తో ఈ మోడల్‌ను తీసుకువచ్చింది. రూ. 55వేలకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకోవచ్చు. ఇతర కంపెనీలకు చెందిన ఈవీలతో పోలిస్తే.. ఈ1ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర చాలా తక్కువ. కాబట్టి సేల్స్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దూసుకుపోనున్నట్లు కంపెనీ తెలిపింది.