Tirupathi Rao
Pallavi Prashanth Won Hot And Techy Brezza: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ ప్రశాంత్ గెలిచిన కారు గురించి నెట్టింట గట్టిగానే చర్చ జరుగుతోంది. మరి.. ఆ కారు ధర ఎంత? ప్రత్యేకతలేంటో చూద్దాం.
Pallavi Prashanth Won Hot And Techy Brezza: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ ప్రశాంత్ గెలిచిన కారు గురించి నెట్టింట గట్టిగానే చర్చ జరుగుతోంది. మరి.. ఆ కారు ధర ఎంత? ప్రత్యేకతలేంటో చూద్దాం.
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఒక సామాన్యుడిగా హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ప్రేక్షకుల హృదయాలను మాత్రమే కాకుండా రూ.35 లక్షల ప్రైజ్ మనీ, రూ.15 లక్షల విలువైన డైమండ్ జ్యూవెలరీ కూడా గెలిచాడు. అంతేకాకుండా అతనికి మారుతీ కంపెనీ నుంచి హాట్ అండ్ టెకీ ఫుల్లీ లోడెడ్ బ్రెజా కారుని కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని ట్రోఫీతో వస్తుంటే అభిమానులు అంతా ప్రశాంత్ ని గర్వపడుతున్నారు. ఇంకొందరు మాత్రం అరె.. కారు భలేగా ఉందే. ఏ కంపెనీ కారు? దీని ధర ఎంత? స్పెషాలిటీలు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి అలాంటి వారికోసమే ఈ ఆర్టికల్..
మారుతీ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా మోడల్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని బడ్జెట్ మోడల్స్ కాగా.. మరికొన్ని లగ్జరీ ఫీల్ ని ఇచ్చే ప్రీమియం మోడల్స్ కూడా ఉన్నాయి. అలాంటి కేటగిరీలోకి ఈ కాంపాక్ట్ ఎస్యూవీ హాట్ అండ్ టెకీ బ్రెజా కూడా వస్తుంది. ఇంక ఈ కారు ధర, స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఈ బ్రెజా కారు బేస్ వేరియంట్ LXI మాన్యూవల్ ట్రాన్స్ మిషన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.99 లక్షలుగా ఉంది. దీని హై ఎండ్ మోడల్ ZXI+ డ్యూయల్ టోన్ ఆటోమేటిక్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.13.96 లక్షలు, మాన్యూవల్ ట్రాన్స్ మిషన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.12.46 లక్షలుగా ఉంది. ఇంక ఈ హాట్ అండ్ టెకీ ఆల్ న్యూ బ్రెజా కారు స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే.
మీరు మారుతీ కార్లలో ఈ ధరతో ఇంత లగ్జరీ ఫీల్, సేఫ్టీ ఫీచర్స్ పొందలేరనే చెప్పాలి. ఈ బ్రెజా కారు ఎనర్జిటికి డిజైన్, యూత్ ఫుల్ ఇంటీరియర్, ఇంటెలిజెంట్ టెక్నాలజీతో వస్తోంది. న్యూ స్మార్ట్ హైబ్రిడ్ కే సిరీస్ ఇంజిన్ తో ఈ బ్రెజా కారు వస్తోంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బ్రెజా కారు స్పోర్టివ్, స్టైలిష్ లుక్స్ తో ఉంటుంది. దీనిలో ఫ్రంట్ లుక్, గ్రిల్, బంపర్, హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, ఫ్లోటింగ్ రూఫ్, షార్క్ ఫిన్ ఆంటీనా ఉన్నాయి. అలాగే ఈ బ్రెజా కారులో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా ఉంది. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో బ్రెజా ఫీచర్స్ ఎంతో అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఈ ఆల్ న్యూ బ్రెజాలో వాయిస్ అసిస్టెంట్ సహా 40 అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. డాష్ బోర్డు కూడా ఎంతో స్టైలిష్ గా డిజైన్ చేశారు. ఇందులో 9 ఇంచెస్ ఫ్రీ స్టాండింద్ టచ్ స్క్రీన్ తో ఇన్ఫోటైమ్నెంట్ సిస్టమ్ కూడా ఉంది. బోటమ్ ఫ్లాట్ స్టీరింగ్ వీల్ ఆకట్టుకుంటుంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే.. హాట్ అండ్ టెకీ బ్రెజా కారులో రియల్ టైమ్ ట్రాకింగ్, జియో ఫన్సింగ్, ఫైండ్ యువర్ కార్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. వైర్ లెస్ ఛార్జింగ్, పెడల్ షిఫ్ట్స్, వైర్ లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాకుండా సేఫ్టీ విషయంలో కూడా ఈ బ్రెజా కారు టాప్ క్లాస్ అని చెప్పుకోవాల్సిందే. గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో ఈ బ్రెజా కారుకి 4 స్టార్ రేటింగ్ వచ్చింది. 6 ఎయిర్ బ్యాగ్స్ సహా 20 సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 360 డిగ్రీ కెమెరా, పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి ఇవన్నీ కలిపి కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్ లో ఈ హాట్ అండ్ టెకీ బ్రెజాని అద్భుతమైన మోడల్ గా నిలబెడుతున్నాయి. మరి.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న ఈ హాట్ అండ్ టెకీ ఆల్ న్యూ బ్రెజా కారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.