iDreamPost
android-app
ios-app

రాత్రుళ్ళు మనుషుల్ని త్వరగా నిద్రపుచ్చే యాప్‌లు! మీరు ట్రై చేయాల్సిందే!

  • Published Jul 31, 2024 | 10:25 PM Updated Updated Jul 31, 2024 | 10:25 PM

Best Sleeping Apps: రాత్రుళ్ళు అంత త్వరగా నిద్రపట్టదు. సిటీల్లో అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. బెడ్ మీద వాలినా, కళ్ళు మూసినా గానీ నిద్ర పట్టని పరిస్థితి. అలాంటి వారి కోసమే కొన్ని ప్రత్యేక యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ త్వరగా నిద్రలోకి జారుకునేలా చేస్తాయి.

Best Sleeping Apps: రాత్రుళ్ళు అంత త్వరగా నిద్రపట్టదు. సిటీల్లో అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. బెడ్ మీద వాలినా, కళ్ళు మూసినా గానీ నిద్ర పట్టని పరిస్థితి. అలాంటి వారి కోసమే కొన్ని ప్రత్యేక యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ త్వరగా నిద్రలోకి జారుకునేలా చేస్తాయి.

  • Published Jul 31, 2024 | 10:25 PMUpdated Jul 31, 2024 | 10:25 PM
రాత్రుళ్ళు మనుషుల్ని త్వరగా నిద్రపుచ్చే యాప్‌లు! మీరు ట్రై చేయాల్సిందే!

చిన్న పిల్లల్ని నిద్రపోకపోతే పెద్దలు ఎత్తుకుని జోలపాట పాడి నిద్రపుచ్చేవారు. కానీ పాతిక, ముప్పై ఏళ్ల వయసున్న వారికి నిద్ర పట్టకపోతే ఎవరు నిద్రపుచ్చుతారు? అంటే దీనికి సమాధానంగా కొన్ని స్లీపింగ్ యాప్స్ ఉన్నాయి. రాత్రుళ్ళు మనుషుల్ని త్వరగా నిద్రలోకి జారుకునేలా చేసే యాప్స్ ఇవి. ఇవి ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా త్వరగా నిద్రలోకి జారుకుంటారు. టెక్నాలజీ పెరిగిపోవడం, పని ఒత్తిడి, డ్యూటీ సమయాలు, ప్రయాణ భారాలు ఇలా అనేక కారణాల వల్ల మనిషి నుంచి నిద్ర అనేది దూరమైపోయింది. ఒకప్పుడు 9 దాటినాక మెలకువగా ఉంటే పెద్దలు తిట్టేవారు. ఇప్పుడు 12, ఒంటి గంట అయినా నిద్రపోవడం లేదు. కొంతమంది అయితే తెల్లవారుజామున రెండు, మూడు గంటల వరకూ కూడా నిద్రపోవడం లేదు. దీని వల్ల మరుసటి రోజు ఉదయం పని సరిగా చేయలేకపోతున్నారు. లక్ష్యాలను చేధించలేకపోతున్నారు. నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. దీన్ని ఇన్సోమ్నియా అంటారు. దీని వల్ల భవిష్యత్తులో చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కాబట్టి నిద్ర త్వరగా పట్టని వారి కోసమే కొన్ని ప్రత్యేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా మందికి ఫోన్ చూసే అలవాటు ఉంటుంది కాబట్టి ఫోన్ లోనే కొన్ని యాప్స్ తో త్వరగా నిద్రలోకి జారుకోవచ్చు. 2024లో బెస్ట్ స్లీపింగ్ యాప్స్ ని నిపుణులు పరిశోధన చేసి మరీ రికమండ్ చేస్తున్నారు. వాటిలో కామ్, స్లీప్ సౌండ్స్, స్లీప్ స్కోర్, స్లంబర్, పిల్లో, బెడ్ టైం స్టోరీస్, స్లీప్ సైకిల్, స్లీప్ సౌండ్స్ బై స్లీప్ పిల్లో ఇలా అనేక రకాల యాప్స్ ఉన్నాయి. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్లి స్లీపింగ్ యాప్స్ అని కొడితే మీకు చాలా యాప్స్ కనబడతాయి. వాటిలో ఎక్కువ రేటింగ్ ఉన్న యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ లో మంచి మంచి కథలు వినచ్చు. ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినచ్చు. ప్రకృతి శబ్దాలు, సముద్ర కెరటాల శబ్దాలు, అడవి తల్లి శబ్దాలు, వీచే గాలి శబ్దాలు ఇలా మనకి నచ్చినవి ఎంపిక చేసుకోవచ్చు. కథలతో మిమ్మల్ని నిద్రపుచ్చడానికి ఆడ, మగ వారి వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్ వింటే నిమిషాల్లోనే నిద్రలోకి జారుకోవచ్చు.

అయితే మీ కోసం ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఆ యాప్స్ ని నెల నెలా డబ్బు చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుంది. కొన్ని ఉచిత యాప్స్ ఉంటాయి. కానీ అవి అంత ఫీల్ ని ఇవ్వవు. మూడు రోజులు, ఏడు రోజుల పాటు ఉచితంగా వాడుకునే యాప్స్ ఉంటాయి. వాడిన తర్వాత నచ్చితే కొనసాగించవచ్చు. ఇవి నిపుణులు సూచించిన యాప్స్. నెల నెలా ఈ యాప్స్ కొనడాలు, వాడడాలు మనవల్ల కాదేహే అని అనుకుంటే పుస్తకాలు చదవచ్చు. పుస్తకాలైనా చదివిందే ఎన్ని సార్లు చదువుతాం. వాటికైనా డబ్బులు అయిపోతాయి అని అనుకుంటే కనుక వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ వస్తువులు ఉన్నాయి. వాటిని ఒకసారి కొంటే చాలు. నిద్రపోవడానికి కళ్ళకు మాస్క్ ఉంటుంది. ఇది పెట్టుకుంటే లైటింగ్ అనేది ఉండదు. త్వరగా నిద్రలోకి జారుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. దీని అసలు ధర రూ. 499 కాగా ఆఫర్ లో రూ. 199కే అందుబాటులో ఉంది. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

లేదు పై యాప్స్ లానే మంచి మ్యూజిక్ ప్లే చేసే గాడ్జెట్ కావాలంటే కనుక పోర్టబుల్ వైట్ నాయిస్ ప్లేయర్ ఉంది. ఇందులో 20 రకాల సౌండ్స్ ఉంటాయి. ఇవి వింటే ఒత్తిడి పోయి మైండ్ రిలాక్స్ అయిపోతుంది. దీనికి ఆటో టైమర్ ఆఫ్ ఆప్షన్ ఉంది. అంటే 15 నిమిషాలు, 30 నిమిషాలు, గంట తరువాత దానికదే ఆగిపోయేలా సెట్ చేసుకోవచ్చు. చిన్న సైజులో ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా ఈజీగా పట్టుకెళ్లవచు. దీని అసలు ధర రూ. 1990 కాగా ఆఫర్ లో రూ. 1190కే అందుబాటులో ఉంది. దీన్ని నెల నెలా కొనే పని లేదు.. జస్ట్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.