iDreamPost
android-app
ios-app

పోస్టాఫీసులో బెస్ట్ స్కీం.. ఒక్కసారిగా రూ. 7 లక్షలు పొందే ఛాన్స్..!

సంపాదించిన సొమ్ములో.. కొంత దాచుకోవాలని.. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. బంగారం, స్థలం, పొలాలు కొనుగోలు చేస్తుంటారు. అలాగే పాలసీలు, షేర్ మార్కెట్, పోస్టాఫీసుల్లో పలు పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు.

సంపాదించిన సొమ్ములో.. కొంత దాచుకోవాలని.. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. బంగారం, స్థలం, పొలాలు కొనుగోలు చేస్తుంటారు. అలాగే పాలసీలు, షేర్ మార్కెట్, పోస్టాఫీసుల్లో పలు పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు.

పోస్టాఫీసులో బెస్ట్ స్కీం.. ఒక్కసారిగా రూ. 7 లక్షలు పొందే ఛాన్స్..!

సంపాదనలో కొంత సొమ్మును సేవింగ్స్ రూపంలో దాస్తుంటారు ప్రజలు. ఇంటి గృహ అవసరాలకు కొంత తీసి..ఇంకొంత బంగారం, పాలసీలు, షేర్ మార్కెట్, పోస్టాఫీసుల్లో పలు పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఆపద సమయాల్లోనూ అవసరాలకు, తమ రిటైర్ మెంట్ ప్లాన్స్ వేసుకుంటూ నగదును సేవ్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ ప్లాన్స్, రిటర్న్ ఎక్కువ వచ్చే వాటిపై పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు తక్కువ కాలంలో మెచ్యూరిటీ, ఎక్కువ వడ్డీ వచ్చే ప్లాన్స్ ఉంటే చెప్పమని అడుగుతుంటారు. అటువంటి వారికోసమే పోస్టాఫీస్ ఓ అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది. ఆ పథకం వివరాల్లోకి వెళితే..

పోస్టాఫీస్ ఇప్పటికే పలు పథకాలను తీసుకువచ్చింది. తాజాగా తక్కువ కాలంలోనే ఎక్కువ వడ్డీ పొందే పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే టైమ్ డిపాజిట్ పథకం. ఈ పథకం తక్కువ కాల వ్యవధిలోనే.. ఎక్కువగా వడ్డీని అందిస్తుంది. ప్రస్తుతం చిన్న మొత్తాల పొదుపుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో వడ్డీ మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ టైమ్  డిపాజిట్ పథకంలో భాగంగా సేవింగ్స్ పై 7.5 శాతం వడ్డీ పొందొచ్చు. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల పాటు నగదును ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఐదేళ్లు పెట్టుబడి పెడితే.. గరిష్టంగా 7.5 శాతం ఇంట్రెస్ట్ పొందొచ్చు.

ఉదాహరణకు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే.. ఆ మొత్తంపై 7.5 శాతం వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ అనగా ఐదేళ్ల పాటు ఆ డబ్బును కదిలించకుండా ఉంటే.. 2,24,974 వడ్డీని పొందొచ్చు. ఈ ఐదేళ్లలో వడ్డీ రేటు మారితే ఈ ఇంట్రస్ట్ శాతం కూడా మారే అవకాశాలున్నాయి. మొత్తం వడ్డీ కలిపి అతనికి రూ. 7, 24,974 అంటే ఇంచుమించు రూ. 7.25 లక్షలు చేతికి వస్తుంది. ఈ స్కీమ్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ చట్టం 1961లోని 80సీ కింద.. ఆ డబ్బును పొందే వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. వెయ్యి రూపాయలతో ఖాతా తెరిచి.. ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు.