iDreamPost
android-app
ios-app

Jio యూజర్లకు బెస్ట్‌ ప్లాన్స్‌.. ధరలు పెరిగినా.. భార పడకుండా

  • Published Jul 03, 2024 | 3:19 PM Updated Updated Jul 03, 2024 | 3:19 PM

జియో సహా మిగతా టెలికాం సంస్థలన్ని రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలు పెంచాయి. రేట్లు పెరిగిన తర్వాత.. మిగతా కంపెనీలతో పోలిస్తే.. జియోలోనే కొన్ని బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..

జియో సహా మిగతా టెలికాం సంస్థలన్ని రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలు పెంచాయి. రేట్లు పెరిగిన తర్వాత.. మిగతా కంపెనీలతో పోలిస్తే.. జియోలోనే కొన్ని బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..

  • Published Jul 03, 2024 | 3:19 PMUpdated Jul 03, 2024 | 3:19 PM
Jio యూజర్లకు బెస్ట్‌ ప్లాన్స్‌.. ధరలు పెరిగినా.. భార పడకుండా

ఇటీవలే టెలికాం సంస్థలు తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలసిందే. గతంలో ఉన్న ప్లాన్ల మీద ఏకంగా 10-25 శాతం వరకు ధరలను పెంచాయి. దాంతో నెల వారి మొదలు, మూడు, 6 , 12 నెలల రీఛార్జ్‌ ప్లాన్స్‌ రేట్లు భారీగా పెరిగాయి. ఎయిర్‌టెల్‌, వీఐ, జియో ఇలా అన్ని కంపెనీలు రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను పెంచుతూ వినియోగదారులకు భారీ షాక్‌ ఇచ్చాయి. పెంచిన రేట్లు జూలై 4 నుంచి అనగా గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ధరలు పెరిగిన తర్వాత కూడా ప్రముఖ టెలికాం దిగ్గజం జియోలోనే కొన్ని మంచి ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్‌తో పోలిస్తే.. జియో ప్లాన్స్‌ ధరలే తక్కువగా ఉండటం కస్టమర్లకు ఊరట కలిగించే అంశం. మరి ఇంతకు జియోలోని బెస్ట్‌ ప్లాన్స్‌ ఏవి.. వాటి వివరాలు మీకోసం..

రూ.249 ప్లాన్‌..

జియో అందిస్తున్న బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌లో రూ. 249 ఒకటి. ఈ ప్లాన్‌తో రోజుకు 1 జీబీ డేటాతో పాటు అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. అయితే ఇతర సంస్థలతో పోల్చితే జియోలోనే ఈ ప్లాన్‌ తక్కువ ధరకు లభిస్తోంది.

రూ.349 ప్లాన్‌..

ఇక జియో అందిస్తున్న మరో అత్యుత్తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌లో రూ. 349 ఒకటి. ఇది రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌ పొందొచ్చు. ఇదే బెనిఫిట్స్‌తో ఇతర టెలికాం సంస్థల్లో ఈ ప్లాన్‌ రీఛార్జ్‌ చేసుకోవాలంటే.. అదనంగా రూ. 50 చెల్లించాల్సిందే.

రూ. 479 ప్లాన్

ఇక మూడు నెలల కోసం రీఛార్జ్‌ చేసుకోవాలనుకునే వారికి జియోలో ఉన్న బెస్ట్‌ ప్లాన్‌ రూ.479. డేటాతో పని లేకుండా కేవలం అన్‌లిమిటెడ్‌ కాల్స్‌  కోసం చూస్తున్న వారికి రూ. 479 ప్లాన్ అత్యుత్తమం. ఇందులో యూజర్లకు 6 జీబీ డేటా లభిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందవచ్చు. ఇదే బెనిఫిట్స్‌తో ఇతర టెలికాం సంస్థల్లో ఈ ప్లాన్‌ ధర రూ. 509 వరకు ఉంది.

రూ.1899 ప్లాన్‌

ఏడాది వ్యాలిడిటీ ప్లాన్‌ విషయానికొస్తే.. జియలో ఉన్న రూ.1899 ప్లాన్‌ బెస్ట్‌. ఇది రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాది పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. ఇక ఈ ప్లాన్‌లో 24 జీబీ డేటా లభిస్తుంది. ఇదే ప్లాన్‌ ఇతర వాటిల్లో రీఛార్జ్‌ చేసుకోవాలంటే.. జియో ధరపై 5 శాతం ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetVirüsbetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Giriş