iDreamPost

ఇదొక్కటీ కిచెన్‌లో ఉంటే లేడీస్ ఈజీగా తొక్క తీయగలరు! ధర 146 రూపాయలే!

Best Kitchen Gadget Under Rs.150: వంటగదిలో కూరగాయల తొక్క తీసే లేడీస్ కి ఇది చాలా అవసరం. ఇదొక్కటి మీ వంటగదిలో ఉంటే మీ సమయం ఆదా అవుతుంది. మీ శ్రమ వృధా అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్రాడెక్ట్ ని ఖచ్చితంగా ట్రై చేయండి.

Best Kitchen Gadget Under Rs.150: వంటగదిలో కూరగాయల తొక్క తీసే లేడీస్ కి ఇది చాలా అవసరం. ఇదొక్కటి మీ వంటగదిలో ఉంటే మీ సమయం ఆదా అవుతుంది. మీ శ్రమ వృధా అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్రాడెక్ట్ ని ఖచ్చితంగా ట్రై చేయండి.

ఇదొక్కటీ కిచెన్‌లో ఉంటే లేడీస్ ఈజీగా తొక్క తీయగలరు! ధర 146 రూపాయలే!

కొంతమంది లేడీస్ తమ భర్తల తొక్క తీయాలంటే ఈజీగా తీసేస్తాం అంటారు కానీ కూరగాయల తొక్క మాత్రం తీయడం మా వల్ల కాదు బాబోయ్ అని అంటారు. తొక్క తీయడం అంత కష్టమా? అంటే తీసేవారికి తెలుస్తుంది. చిన్న పనే అని అనుకుంటాం గానీ చాలా సమయం తినేస్తుంది. బంగాళదుంపలు, క్యారెట్ వంటి కూరగాయల తొక్కలు.. యాపిల్, దానిమ్మ వంటి పండ్ల తొక్కలు తీయాలంటే చాలా సమయం పడుతుంది. వీటి తొక్కలు తీయడానికి వేరే పీలర్లు ఉంటాయి. కానీ వీటితో పోలిస్తే ఈ పీలర్ చాలా బెటర్. ఎందుకంటే కూరగాయల తొక్కలు కింద పడిపోకుండా పీలర్ లో స్టోరేజ్ బాక్స్ ఉంటుంది. దీని వల్ల పండ్లు, కూరగాయల తొక్కలు ఈ స్టోరేజ్ బాక్స్ లోకి వెళ్లిపోతాయి.

అదే సాధారణ పీలర్ అయితే తొక్కలు కింద నేల మీద గానీ, వంట గది బల్ల మీద గానీ పడతాయి. మళ్ళీ ఆ చెత్తను చేత్తో పట్టుకుని డస్ట్ బిన్ లో పడేయాలి. అదే ఈ పీలర్ ఉంటే చెక్కిన తొక్కలను చేత్తో పట్టుకోకుండానే డస్ట్ బిన్ లో పడేయచ్చు. దీని వల్ల మీ సమయం, శక్తి ఆదా అవుతాయి. ఇది బై డైరెక్షనల్ కటర్ హెడ్ తో వస్తుంది. అంటే మీరు ఈ పీలర్ ని మీ వైపుకి, మీకు వ్యతిరేక దిశలో ఆడిస్తూ తొక్కలు తీయచ్చు. దీని హ్యాండిల్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. స్టెయిన్ లెస్ స్టీల్ తో, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ తో దీన్ని తయారు చేశారు. ఇది బీపీఏ ఫ్రీ పీలర్ గా వస్తుంది. బీపీఏ అంటే బిస్ ఫినాల్ ఎ కెమికల్. కొన్ని ప్లాస్టిక్ వస్తువులను ఈ కెమికల్ యూజ్ చేసి చేస్తారు. దీని వల్ల సంతానలోపం, ఒబెసిటీ, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

అయితే ఈ అడ్వాన్స్డ్ కూరగాయలు, పండ్ల పీలర్ ని మంచి ప్లాస్టిక్ తో చేయడం వల్ల మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. దీంతో తొక్క గట్టిగా ఉండే కూరగాయలను, పండ్లను ఈజీగా వలుచుకోవచ్చు. బంగాళదుంప, యాపిల్, టమాటా, క్యారెట్, దోసకాయ వంటి కూరగాయలకు, పండ్లకు ఇది చాలా బెటర్. ఇది స్టోరేజ్ బాక్స్, దాని మీద మూతతో వస్తుండడం, తక్కువ ధరకు వస్తుండడం వల్ల సాధారణ పీలర్స్ తో పోలిస్తే ఇది చాలా ఉత్తమం. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 899 కాగా ఆఫర్ లో కేవలం రూ. 146కే పొందవచ్చు. 84 శాతం డిస్కౌంట్ ఉంది. ఇది లిమిటెడ్ టైం డీల్. మీకు కావాలి అనుకుంటే కనుక వెంటనే కొనుక్కోండి. ఈ వెజిటేబుల్, ఫ్రూట్ పీలర్ ని కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి