iDreamPost
android-app
ios-app

తక్కువ ధరలో మంచి బైక్ కావాలా? అయితే ఒక లుక్కేయండి!

  • Published Aug 16, 2024 | 12:43 PM Updated Updated Aug 16, 2024 | 12:43 PM

Best Budget Bikes: ప్రస్తుతం ఈ బిజీ లైఫ్ లో ప్రతీ పనీ వేగంగా జరిగిపోవాాలని చూస్తున్నారు. దేశంలో జనాభా ఎంత వెగంగా పెరుగుతుందో.. అవసరాలు అలాగే పెరిగిపోతున్నాయి. దీనికి అనుగుణంగా టూవీలర్స్ వినియోగం పెరిగిపోతూ వస్తుంది.

Best Budget Bikes: ప్రస్తుతం ఈ బిజీ లైఫ్ లో ప్రతీ పనీ వేగంగా జరిగిపోవాాలని చూస్తున్నారు. దేశంలో జనాభా ఎంత వెగంగా పెరుగుతుందో.. అవసరాలు అలాగే పెరిగిపోతున్నాయి. దీనికి అనుగుణంగా టూవీలర్స్ వినియోగం పెరిగిపోతూ వస్తుంది.

  • Published Aug 16, 2024 | 12:43 PMUpdated Aug 16, 2024 | 12:43 PM
తక్కువ ధరలో మంచి బైక్ కావాలా? అయితే ఒక లుక్కేయండి!

ప్రస్తుత బిజీ లైఫ్ లో టూ వీలర్ అనేది అందరికి నిత్యావసరంగా మారింది. అందుకే ప్రతీ ఇంట్లో టూ-వీలర్‌ కచ్చితంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా దేశంలో టూ-వీలర్స్‌ని కొనేవారి సంఖ్య ఎక్కువ అవుతుంది. రోజువారీ పనుల కోసం ప్రతి ఒక్కరూ టూ-వీలర్స్‌పై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో వందల సంఖ్యలో టూవీలర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ మోటార్ సైకిల్ తక్కువ ధరలో లభిస్తుంది? మైలేజీ, ఫీచర్ల విషయాల గురించి చాలా మందికి కూడా అంత అవగాహన ఉండదు. అందువల్ల బైక్ కొన్నాక కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే రూ.70,000 (ఎక్స్-షోరూమ్)లకే మంచి మైలేజీ ఇచ్చే బైక్స్‌ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

హోండా షైన్ 100: ఈ బైక్‌ విషయానికి వస్తే .. ఇది 98.98 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీని ఇంజిన్‌ 7.38 ps పవర్ ని ఇంకా 8.05 nm మాక్సిమం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. దీని ఇంజిన్ సౌండ్ కూడా స్మూత్ గా ఉంటుంది. 4-స్పీడ్ గేర్ బాక్స్ ఆప్షన్‌ ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే… ఇది లీటర్‌కి 68 కిలోమీటర్ల రేంజ్ లో మైలేజీని ఇస్తుంది. అంతేగాకా ఈ బైక్‌లో పలు అప్డేటెడ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.అనలాగ్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ స్టార్టర్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 99 కేజీలు ఉంటుంది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. అందువల్ల ఇది హై స్పీడులోనూ క్షణాల్లో ఆగిపోయేలా చేస్తుంది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 65,143 ఉంటుంది.

టీవీఎస్ స్పోర్ట్: ఈ బైక్ విషయానికి వస్తే.. ఈ బైక్ లో 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది మాక్సిమం 8.19 ps శక్తిని ఇంకా 8.7 nm మాక్సిమం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ బైక్ లో 4-స్పీడ్‌గేర్ బాక్స్‌ ఉంటుంది.ఇది లీటరుకు ఏకంగా 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో అనలాగ్ ఇన్‌స్ట్రూమెంట్ ప్యానెల్, బల్బ్ స్టైల్ హెడ్‌లైట్‌, LED DRL ఇంకా అలాగే సెల్ఫ్ స్టార్ట్ వంటి సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్‌ బరువు విషయానికి వస్తే.. 112 కిలోల బరువు ఉంటుంది. ఈ బైక్ 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ కెపాసిటీని కలిగి ఉంది. దీని ధర విషయానికి వస్తే.. రూ.67,720 (ఎక్స్ షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతుంది.

బజాజ్ ప్లాటినా 100: ఇక ఈ బైక్‌ 102 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7.9 ps పవర్ ని మరియు 8.3 nm మాక్సిమం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇది కూడా 4-స్పీడ్‌గేర్ బాక్స్‌తో ఉంటుంది. ఈ సరికొత్త బజాజ్ ప్లాటినా 100 బైక్ మైలేజ్ విషయానికి వస్తే.. ఈ బైక్ కూడా లీటర్‌కి 72 కిలోమీటర్ల రేంజ్ లో మైలేజ్ని అందిస్తుంది. దీని బరువు 117 కేజీల దాకా ఉంటుంది.ఇక ఈ బైక్ 11 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ కెపాసిటీని కలిగి ఉంది. ఇందులో హాలోజెన్ హెడ్‌లైట్, సింగిల్ పీస్ సీట్, అనలాగ్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ ఇంకా అలాగే ఎలక్ట్రిక్‌ స్టార్టర్‌ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్‌ ధర రూ. 66,837(ఎక్స్-షోరూమ్)గా ఉంది.