iDreamPost
android-app
ios-app

Anant Ambani: పెళ్లిలో అందరి కళ్లు అనంత్‌ అంబానీ వాచ్‌ పైనే.. ఖరీదు అన్ని కోట్లా?

  • Published Jul 14, 2024 | 6:12 PM Updated Updated Jul 14, 2024 | 6:12 PM

Anant Ambani Wedding-Rs 54 Crore Watch: అనంత్‌ అంబానీ పెళ్లి వేళ.. ఆయన ధరించిన వాచ్‌ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఇక దాని కాస్ట్‌ తెలిస్తే.. షాక్‌తో మీ కళ్లు బయటకు వస్తాయి. ఇంతకు ఆ వాచ్‌ ధర ఎంతంటే..

Anant Ambani Wedding-Rs 54 Crore Watch: అనంత్‌ అంబానీ పెళ్లి వేళ.. ఆయన ధరించిన వాచ్‌ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఇక దాని కాస్ట్‌ తెలిస్తే.. షాక్‌తో మీ కళ్లు బయటకు వస్తాయి. ఇంతకు ఆ వాచ్‌ ధర ఎంతంటే..

  • Published Jul 14, 2024 | 6:12 PMUpdated Jul 14, 2024 | 6:12 PM
Anant Ambani: పెళ్లిలో అందరి కళ్లు అనంత్‌ అంబానీ వాచ్‌ పైనే.. ఖరీదు అన్ని కోట్లా?

ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రెండు రోజుల క్రితం అనగా జూలై 12, శుక్రవారం నాడు.. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుక ప్రతి ఒక్కరిని అబ్బురపరిచింది. ఇక ఈ వివాహ వేడుకకు హాజరు కావడం కోసం.. మన దేశం నుంచే కాక.. విదేశాల నుంచి సైతం భారీ ఎత్తున సెలబ్రిటీలు తరలి వచ్చారు. ఇక పెళ్లి మండపం చుట్టూ అద్భుతమైన పూల మాలలు, మెరిసే లైట్లతో అలంకరించారు. ఇక ఈ పెళ్లి వేడుకకు మన దగ్గర నుంచే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు తరలి వచ్చారు. వీరందరికి ముంబైలోని టాప్‌ మోస్ట్‌ హోటల్స్‌లో అంబానీ కుటుంబం విడిది ఏర్పాట్లు చేసింది.

అనంత్‌ అంబానీ వివాహం వేళ.. ముకేశ్ అంబానీ కుటుంబసభ్యులు ధరించిన దుస్తులు, ఆభరణాలు, వాటి ఖరీదు చూసి జనాలు ఆశ్యర్యపోతున్నారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం కోసం ముకేశ్ అంబానీ దాదాపు రూ.5000 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక తన పెళ్లికి వచ్చిన స్నేహితులకు అనంత్‌ అంబానీ ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు.. వివాహం వేళ.. అనంత్‌ అంబానీ చేతికి పెట్టుకున్న వాచ్‌.. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఆరెంజ్‌ కలర్‌ బెల్ట్‌తో ఉన్న ఈ వాచ్‌ లుక్‌ ఎంత ప్రెట్టీగా ఉందో.. దాని ఖరీదు మాత్రం.. అందుకు భిన్నంగా కోట్ల రూపాయల్లో ఉంది. తన పెళ్లి వేడుకలో అనంత్ అంబానీ రిచర్డ్ మిల్లే ఆర్‌ఎం 52-05 టూర్ బిల్లాన్ ఫారెల్ విలియమ్స్ వాచ్ ధరించాడు.

ఇది చాలా లగ్జరీ టైమ్ పీస్. ఈ వాచ్ ధర సుమారు రూ.54 కోట్లు అని తెలుస్తోంది. జస్ట్‌ వాచ్‌ ఖరీదు 54 కోట్లా అని నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ఇక అదలా ఉంచితే.. పెళ్లికి వచ్చిన అతిథుల కోసం అంబానీ కుటుంబం అద్భుతమైన విందు ఏర్పాటు చేయించింది. ప్రపంచ స్థాయి చెఫ్‌లు తయారుచేసిన వంటకాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల రుచికరమైన వంటకాలతో అతిథులకు విందును ఏర్పాటు చేశారు.

ఇక జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‏లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకకు విదేశీ నటీనటులు, సెలబ్రెటీలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. అలాగే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా స్టార్స్ అందరూ అంబానీ వివాహ వేడుకలో సందడి చేశారు. గత వారం రోజుల నుంచి అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

నిన్న జరిగిన శుభ్ ఆశీర్వాద్ వేడుకలో పీఎం నరేంద్రమోదీ, పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొని.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక అనంత్, రాధికల పెళ్లి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss