sai
Anant Ambani Radhika Merchant Pre Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా నీతా అంబానీ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
Anant Ambani Radhika Merchant Pre Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా నీతా అంబానీ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
sai
ఆసియా కుబేరుడు.. ఇండియాలోనే ధనవంతుడైన ముకేష్ అంబానీ ఇంటి వేడుక అంటే.. దేశంలో అందరి ఆసక్తి దాని మీదనే ఉంటుంది. మరీ ముఖ్యంగా వారి ఇంట జరిగే పెళ్లిళ్లలకు మన దేశం నుంచే కాక ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులు అతిథులుగా తరలి వస్తారు. గతంలో పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె నీతా అంబానీల వివాహాలు ఎంతో ఘనంగా జరిపించాడు ముకేశ్ అంబానీ. ఇక ఆయన సంతానంలో చివరి వాడైన అనంత్ అంబానీ వివాహానికి ముహుర్తం ఖారారైంది. ఈ ఏడాది జూలైలో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌లా వివాహం జరగనుండగా.. అందుకు కొన్ని నెలల ముందే అనగా మార్చి1-3 వరకు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుక కోసం సుమారు 1000-1200 కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యందని ఇంగ్లీష్ మీడియా వెల్లడించింది.
ఇక అంబానీ ఇంట ఏ శుభకార్యం జరిగినా.. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా వేడుక నిర్వహిస్తారు. ఆసియా కుబేరుడిగా గుర్తింపు తెచ్చుకున్నా.. ఆచారవ్యవహారాల పాటింపు విషయానికి వస్తే.. భారతీయత ఉట్టిపడేలా ప్రవరిస్తూ.. మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకే బిడ్డల పెళ్లిళ్లను ఎంతో ఘనంగా.. హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. అంబానీ ఇంట వేడుకలు ఆధునిక, సనాతన సంప్రదాయాల కలయికగా ఉంటాయి. ఇక అంబానీ ఇంట్లో ఏ వేడుకైనా నీతా అంబానీ ప్రత్యేకంగా నిలుస్తారు.
నీతా అంబానీ శాస్త్రీయ నృత్యకారిణి అన్న సంగతి తెలిసిందే. కుటుంబంలో ముఖ్యమైన వేడుకల వేళ ఆమె కచ్చితంగా నాట్య ప్రదర్శన చేస్తారు. ఇక తాజాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల సందర్భంగా మరోసారి తన డ్యాన్స్‌తో అందరిని ఆకట్టుకున్నారు నీతా అంబానీ. శాస్త్రీయ నృత్యం చేస్తూ.. కాబోయే కోడలని తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. విశ్వంభరి దేవీ స్తోత్రంపై నృత్యం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 60 ఏళ్ల వయసులోనూ నీతా అంబానీ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని.. కొడుకు పెళ్లి అవుతోన్న వేళ.. ఆ సంతోషం అంతా ఆమె కళ్లలో కనిపిస్తోంది.. అందుకే అంత అద్భుతంగా నృత్యం చేశారని.. ఆమె గ్రేస్ ముందు స్టార్స్ కూడా దిగదుడుపే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.
#WATCH | Founder and chairperson of Reliance Foundation Nita Ambani performed at Anant Ambani-Radhika Merchant’s pre-wedding celebrations in Jamnagar, Gujarat. pic.twitter.com/7XvDzbr7Qa
— ANI (@ANI) March 3, 2024