iDreamPost
android-app
ios-app

అనంత్‌ అంబానీ పెళ్లి.. అతిథుల కోసం అరుదైన కానుకలు

  • Published Feb 28, 2024 | 4:42 PM Updated Updated Feb 28, 2024 | 4:42 PM

Anant Ambani Marriage: ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లికి తరలి రాబోయే అతిథుల కోసం ప్రత్యేక బహుమతలు ఇవ్వనున్నారట. ఆ వివారలు..

Anant Ambani Marriage: ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లికి తరలి రాబోయే అతిథుల కోసం ప్రత్యేక బహుమతలు ఇవ్వనున్నారట. ఆ వివారలు..

  • Published Feb 28, 2024 | 4:42 PMUpdated Feb 28, 2024 | 4:42 PM
అనంత్‌ అంబానీ పెళ్లి.. అతిథుల కోసం అరుదైన కానుకలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ  పెళ్లికి ముహుర్తం ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది, జూలై 12న అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం జరగనుంది. అయితే పెళ్లికి ముందు మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ నిర్వహించనున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ముందస్తు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఇందు కోసం సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులతో పాటు విదేశాల నుంచి కూడా అతిరథ మహరథులు హాజరు కానున్నారు. ఇక ఈ వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం ముకేశ్ అంబానీ దంపతులు భారీ ఎత్తున్న ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే గెస్ట్స్‌ కోసం ప్రత్యేకమైన కానుకలు ఇవ్వనున్నారట. ఆవివరాలు..

అంబానీ ఇంట పెళ్లి అంటే ప్రపంచ నలుమూలల నుంచి అతిరథ మహారథులు హాజరవుతారు. ఈక్రమంలో అనంత్, రాధికల పెళ్లికి తరలి రానున్న గెస్టుల కోసం స్పెషల్ వంటకాలను సిద్ధం చేస్తున్నారని.. వివాహం కోసం వచ్చే వారికి ఏకంగా 2500 రకాల వంటకాలను వడ్డించనున్నారంటూ ప్రచారం సాగుతోంది. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకలో అతిథుల కోసం అద్భుతమైన 2,500 విభిన్న వంటకాలతో మెను రెడీ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అలానే అతిథుల కోసం అంబానీ కుటుంబం ప్రత్యేకమైన బహుమతులను రెడీ చేయింస్తోందట. అవి ఏంటంటే.. కొవ్వత్తులు. వీటి ప్రత్యేకత ఏంటి అంటే.. ఈ క్యాండిల్స్‌ని మహాబలేశ్వర్‌లోని దృష్టి లోపం ఉన్న కళాకారులు రూపొందిస్తున్నారు. వాటిని అతిథులకు బహుకరించనున్నారు.

ఇక అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌ వేడుక జరిగే జామ్‌నగర్‌లో 5 స్టార్ హోటళ్లు లేకపోవడంతో వాటికి ఏ మాత్రం తగ్గకుండా అతిథులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు ముఖేష్‌ అంబానీ దంపతులు. ముందస్తు పెళ్లి వేడుకలు, వివాహానికి హాజరయ్యే అతిథులు ఉండేందుకు గాను వారి కోసం 5 స్టార్ హోటళ్లను తలదన్నే విధంగా అల్ట్రా- లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. అతిథుల కోసం ఏర్పాటు చేసే ఈ టెంట్లలో టైల్డ్ బాత్‌రూమ్‌లు సహా సకల సౌకర్యాలు ఉంటాయి.

ఇక ముఖేష్‌-నీతా అంబానీలకు ముగ్గురు సంతానం. వారిలో చిన్న వాడు అనంత్ అంబానీ. ఎన్‌కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ చిన్న కుమార్తె రాధికా మర్చంట్‌తో అనంత్ అంబానీ పెళ్లి జరుగుతోంది. కొడుకు పెళ్లి కోసం ముఖేష్‌ అంబానీ చేస్తోన్న ఏర్పాట్లు చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetador girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom