iDreamPost
android-app
ios-app

అంబానీ Jio 5G స్మార్ట్ ఫోన్ అదిరింది! మార్కెట్ లోకి చాలా తక్కువ ధరకే!

  • Published May 25, 2024 | 4:21 PM Updated Updated May 25, 2024 | 4:27 PM

Jio 5g Another Offer: భారత్ లో జియో వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. పట్టణాల్లోనే కాదు.. ప్రతి పల్లెకు జియో సేవలు విస్తరించాయి. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు.

Jio 5g Another Offer: భారత్ లో జియో వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. పట్టణాల్లోనే కాదు.. ప్రతి పల్లెకు జియో సేవలు విస్తరించాయి. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు.

అంబానీ Jio 5G స్మార్ట్ ఫోన్ అదిరింది! మార్కెట్ లోకి చాలా తక్కువ ధరకే!

ప్రపంచంలో ఇప్పుడు కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఫోన్ అనేది కేవలం సంభాషించడానికి మాత్రమే ఉండేది.. కానీ ఇప్పుడు అద్భుతమైన టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క స్మార్ట్ ఫోన్ మన వద్ద ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉన్నట్లే అంటారు. స్మార్ట్ ఫోన్ తో ఫోటోలు, వీడియోలు, వీడియో కాల్స్ మాత్రమే కాదు.. సోషల్ మాద్యమాల ద్వారా కమ్యూనికేషట్ చేసుకునే సదుపాయం కల్పించబడింది. దేశంలో జియో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనికేషన్ వ్యవస్థలో జియో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని అంటారు. తాజాగా జియో 5G నుంచి స్మార్ట్ ఫోన్ రాబోతుంది. వివరాల్లోకి వెళితే..

దేశంలో రిలయన్స్ జియో దిగ్గజం ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి అద్భుతమైన ఫీచర్లతో అధునాతన టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జియో 5G స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ తో మార్కెట్ లో కి రాబోతున్నట్లు ప్రకటించింది జియో సంస్థ. ఈ స్మార్ట్ ఫోన్ లో 128GB, 256 GB ఇంటర్ననల్ స్టోరేజ్ ఆప్షన్ రాబోతుంది. 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 6 మోగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుందని తెలిపింది. బ్యాటరీ కెపాసిటి 5000 ఎంఏహెచ్చ.. 33W ఫాస్టెస్ట్ చార్జర్ తో కేవలం 30 నిమిషాల్లోనే 100 పర్సెంట్ చార్జ్ అవుతుంది. ఈ చార్జింగ్ రెండు రోజుల వరకు ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే 5.5 అంగుళాలు హెచ్‌డీ డిస్ ప్లే.. సులభంగా 4K క్వాలిటీ వీడియోలు చూడవొచ్చు. ఇన్ని అద్భుతమైన ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నారన్న విషయం మాత్రం ఇంకా ప్రకటించలేదు. మీడియా నివేదికల ప్రకారం.. జూన్ రెండవ వారం లేదా మూడో వారంలో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ధర త్వరలో ప్రకటించనున్నారు.. ఫోన్ లాంచింగ్ సమయానికి దీని ధర రూ.3000 వరకు ఉండే అవకాశం ఉంటుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ జియో 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు వినియోగదారులు.