Ambani-Adani: తొలిసారి చేతులు కలిపిన అంబానీ-అదానీ.. ఏ ప్రాజెక్ట్ కోసం అంటే..!

అపర కుబేరులు, పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ ఫస్ట్ టైమ్ చేతులు కలిపారు. ఏ ప్రాజెక్ట్ కోసం వాళ్లు ఒక్కటయ్యారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

అపర కుబేరులు, పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ ఫస్ట్ టైమ్ చేతులు కలిపారు. ఏ ప్రాజెక్ట్ కోసం వాళ్లు ఒక్కటయ్యారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వాళ్లిద్దరూ అపర కుబేరులు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితాలో టాప్​లో ఉన్నారు. వ్యాపారంలో వాళ్ల మధ్య కనిపించని పోటీ ఉంటుంది. అలాంటిది ఒక ప్రాజెక్ట్ కోసం ఇద్దరూ చేతులు కలిపారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు.. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అపర కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ. వీళ్లు తొలిసారి వ్యాపార భాగస్వాములు అయ్యారు. గుజరాత్​కు చెందిన వీళ్ల మధ్య కనిపించని పోటీ ఉంటుందనేది తెలిసిందే. అయితే వీళ్లు వ్యాపార రంగంలో చేతులు కలిపారు. అదానీ పవర్ లిమిటెడ్​కు అనుబంధ సంస్థ అయిన పవర్ ప్రాజెక్ట్​లో ముకేశ్​కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థ 26 శాతం వాటాను కొనుగోలు చేసింది.

అదానీకి చెందిన మహాన్ ఎనర్జెన్​లో రూ.10 విలువ కలిగిన మొత్తం రూ.5 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. అలాగే మధ్యప్రదేశ్​లోని ఈ ప్లాంట్​కు చెందిన 500 మెగావాట్ల యూనిట్​లో ఉత్పత్తి అయ్యే విద్యుత్​ను ఆర్ఐఎల్ తమ అవసరాలకు 20 ఏళ్ల పాటు వాడుకునేందుకు రెండు సంస్థలూ కరెంటు కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ మేరకు రిలయన్స్-మహాన్ సంస్థల మధ్య అగ్రిమెంట్ జరిగింది. రిలయన్స్​తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు అదానీ పవర్ వెల్లడించింది. 2,800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యంతో ఏర్పాటు అవుతోందని.. ఈ ప్లాంటులో 600 మెగావాట్ల కరెంటును సొంత అవసరాలకు వినియోగించనున్నట్లు పేర్కొంది.

కాగా, అంబానీ-అదానీ ఫస్ట్ టైమ్ చేతులు కలపడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్లలో ఏనాడూ వీళ్లు ఒకరికొకరు తారసపడింది లేదు. చమురు, గ్యాస్ నుంచి టెలికం వరకు అంబానీ భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. బొగ్గు తవ్వకం నుంచి విమానాశ్రయాల దాకా అదానీ కూడా వ్యాపారాన్ని భారీగా విస్తరింపజేశారు. అయితే ఇన్నేళ్లలో వీళ్లిద్దరూ స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో మినహా ఎన్నడూ ఒక్కటైంది లేదు. 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలుకు అదానీ దరఖాస్తు చేసుకున్నారు. కానీ పబ్లిక్ నెట్​వర్క్ కోసం దాన్ని ఇప్పటిదాకా యూజ్ చేయలేదు. ఇదిలా ఉంటే.. మార్చి నెల ఆరంభంలో ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ సెర్మనీ గ్రాండ్​గా జరిగింది. ఈ వేడుకలకు అదానీ కూడా అటెండ్ అయ్యారు. మరి.. అంబానీ-అదానీ చేతులు కలపడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పబ్‌లో తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి!

Show comments