iDreamPost
android-app
ios-app

పబ్‌లో తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి!

  • Published Mar 29, 2024 | 12:02 PM Updated Updated Mar 29, 2024 | 12:02 PM

Pub Accident: ఇటీవల డబ్బు బాగా సంపాదించి తమ కుటుంబాన్ని బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో చాలా మంది ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్తుంటారు.

Pub Accident: ఇటీవల డబ్బు బాగా సంపాదించి తమ కుటుంబాన్ని బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో చాలా మంది ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్తుంటారు.

  • Published Mar 29, 2024 | 12:02 PMUpdated Mar 29, 2024 | 12:02 PM
పబ్‌లో తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి!

ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లి డబ్బు సంపాదిస్తుంటారు. సొంత ఊర్లో సరైన పనులు లేక.. ఉన్నా తగినంత డబ్బు రాక చాలా మంది తమ స్వగ్రాలు వదిలి పట్టణాలు, ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్లడం, ఉపాధి పనుల కోసం వెళ్లడం చూస్తూనే ఉంటాం. ఉపాధి కోసం వెళ్లిన వారు కొన్ని ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నెలకొంటున్నాయి. చెన్నైలో ఓ పబ్ లో విషాద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..

చెన్నై నగరంలోని అల్వార్ పేట లోని సెఖ్‌మెట్ పబ్ ఫస్ట్ ఫ్లోర్ లోని పైకప్పు గురువారం సాయంత్రం హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో బాధితుడిని రక్షించి చికిత్స నిమిత్తం రాయపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది.. దానికి గల కారణాలు పై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మృతి చెందిన వారు దిండిగల్ కు చెందిన సైక్లోన్ రాజ్, మరో ఇద్దరు కార్మికులు మణిపూర్ కి చెందిన మాక్స్, లాలీ గా గుర్తించారు. రాజా అన్నమలై పురం నుంచి ఫైర్ ఇంజన్లు, రిస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మారుతం కాంప్లెక్స్ నుంచి కమాండో ఫోర్స్ సిబ్బంది, అడయార్ నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సెఖ్ మెంట్ పబ్ నుంచి 50 అడుగుల కంటే తక్కువ దూరంలో ఉన్న బోట్ క్లమ్ మెట్రో స్టేషన్ పని కారణంగా పైకప్పు కూలిపోయిందని తెలుస్తుంది. ప్రస్తుతం బోట్ క్లబ్ మెట్రో స్టేషన్ లో మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet