iDreamPost
android-app
ios-app

Amazon ప్రైమ్‌ డే సేల్‌.. కళ్లు చెదిరే ఆఫర్స్.. ఎప్పటినుంచంటే?

  • Published Jul 02, 2024 | 5:09 PM Updated Updated Jul 02, 2024 | 5:09 PM

Amazon Prime Day Sale 2024: భారత్ లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ను ప్రకటించింది. ఆ తేదీల్లో ఈ సేల్ ను నిర్వహించనున్నది. ఫోన్లు, ట్యాబ్ లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై కళ్లు చెదిరే ఆఫర్లు ఉండనున్నాయి.

Amazon Prime Day Sale 2024: భారత్ లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ను ప్రకటించింది. ఆ తేదీల్లో ఈ సేల్ ను నిర్వహించనున్నది. ఫోన్లు, ట్యాబ్ లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై కళ్లు చెదిరే ఆఫర్లు ఉండనున్నాయి.

  • Published Jul 02, 2024 | 5:09 PMUpdated Jul 02, 2024 | 5:09 PM
Amazon ప్రైమ్‌ డే సేల్‌.. కళ్లు చెదిరే ఆఫర్స్.. ఎప్పటినుంచంటే?

ప్రస్తుత రోజుల్లో ఏదైనా వస్తువు కావాలంటే ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. ఆన్ లైన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాక కొనుగోలు ప్రక్రియ మరింత ఈజీగా మారిపోయింది. కూర్చున్న చోటు నుంచి బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే వస్తువులు వస్తుండడంతో ఆన్ లైన్ సర్వీసులకు డిమాండ్ పెరిగింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు ఆన్ లైన్ సేవలను అందిస్తున్నాయి. ఈ సంస్థలు కస్టమర్లను ఆకర్షించి సేల్ ను పెంచుకునేందుకు కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ను ప్రకటించింది. ఆ తేదీల్లో ప్రైమ్ డే సేల్ ను నిర్వహించనున్నది.

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ను జులై 20, 21 తేదీల్లో నిర్వహించనుంది. అయితే ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉండనున్నది. ప్రైమ్ మెంబర్స్ కు భారీ డిస్కౌంట్స్ అందించనున్నది. ఈ సేల్‌లో మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్‌ వంటి ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులతో పాటు ఇతర ప్రొడక్టులపైనా డిస్కౌంట్లు లభించనున్నాయి. ఈ సేల్ లో పాల్గొన్న వారికి వేలల్లో లాభం కలుగనున్నది. ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా ఇంటెల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, హానర్‌, ఐకూ, బజాజ్‌, ఆగ్రో, క్రాంప్టన్‌, సోనీ, ఐటీసీ, ఫాజిల్‌, పుమా, మోటోరొలా, బోట్‌ వంటి బ్రాండ్లపై ఆఫర్లు ఉండనున్నాయి. సుమారు 450కి పైగా బ్రాండ్లు వేలాది కొత్త ప్రొడక్టులను లాంచ్‌ చేయనున్నట్లు అమెజాన్‌ పేర్కొంది. ఆఫర్లకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నది.

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో ఐసీఐసీఐ, ఎస్‌బీఐ డెబిట్‌/ క్రెడిట్‌ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ అందుకోవచ్చు. ఐసీఐసీఐ, అమెజాన్‌ పే క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. కొత్తగా ఈ కార్డు తీసుకునే వారికి ప్రైమ్‌ మెంబర్లకు వెల్‌కమ్‌ రివార్డుల కింద రూ.2,500 వరకు ప్రయోజనాలు కలుగనున్నాయి. నాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు రూ.2 వేల వరకు ప్రయోజనాలతో పాటు 3 నెలల పాటు ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ ఇస్తోంది. ఇతర సేల్స్‌ సమయంలో ప్రైమ్‌ మెంబర్లకు ఒక రోజు ముందే కొనుగోలుకు అవకాశం ఉంటుంది. ఎక్కువ లాభాం పొందాలనుకునే వారు అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో పాల్గొనొచ్చు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş