iDreamPost
android-app
ios-app

Amazon: త్వరలో అమెజాన్ బజార్.. అతి తక్కువ ధరలకే బట్టలు, షూస్ !

  • Published Feb 28, 2024 | 10:59 AM Updated Updated Feb 28, 2024 | 10:59 AM

సాధారణంగా అమెజాన్ లో షాపింగ్ చేసే వినియోగదారుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందులోను స్పెషల్ ఆఫర్స్ పెట్టినపుడు మరింత మంది షాపింగ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా అమెజాన్ బజార్ త్వరలో ఇంకా అతి తక్కువ ధరలకు వినియోగదారులకు కావాల్సిన వస్తువులను అందించనుందట.

సాధారణంగా అమెజాన్ లో షాపింగ్ చేసే వినియోగదారుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందులోను స్పెషల్ ఆఫర్స్ పెట్టినపుడు మరింత మంది షాపింగ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా అమెజాన్ బజార్ త్వరలో ఇంకా అతి తక్కువ ధరలకు వినియోగదారులకు కావాల్సిన వస్తువులను అందించనుందట.

  • Published Feb 28, 2024 | 10:59 AMUpdated Feb 28, 2024 | 10:59 AM
Amazon: త్వరలో అమెజాన్ బజార్..  అతి తక్కువ ధరలకే బట్టలు, షూస్ !

ప్రస్తుతం అందరు ఆన్ లైన్ షాపింగ్ నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. నార్మల్ డేస్ లోనే ఎంతో మంది తరచూ ఏవో ఒక వస్తువులను కొంటూ ఉంటారు. ఇక సేల్ , పండుగ స్పెషల్ ఆఫర్స్ పెట్టినపుడైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ కామర్స్ లో ప్రముఖ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం. ఎంతో మంది దీనిని ట్రస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అమెజాన్ ఇండియాలో తమ బిజినెస్ ను మరింత విస్తరింపచేయాలనుకుంటుంది. దానికోసం “అమెజాన్ బజార్” ద్వారా .. చాలా తక్కువ ధరలకు ఫ్యాషన్ , లైఫ్ స్టైల్ కు సంబంధించిన ఉత్పత్తులను అమ్మెందుకు సిద్ధం అవుతోంది. ఇక ఇన్ని ఆఫర్స్ ఇచ్చిన తర్వాత ఎవరు మాత్రం వదులుకుంటారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమెజాన్ లాంచ్ చేయబోతున్న “అమెజాన్ బజార్” కొత్త ప్లాట్ ఫార్మ్ లో .. నాన్ బ్రాండెడ్ వస్తువులను రూ.600 కంటే తక్కువ ధరకు అమ్మెందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో యూత్ , కిడ్స్ ఇలా అందరికి నచ్చే ఫుల్ స్టఫ్ ఉండబోతుందని పేర్కొన్నారు. వీటిన్నంటిని కూడా లిస్ట్ చేసి త్వరగా అమ్మకాలను మొదలు పెట్టాలని.. ఇప్పటికే అమెజాన్ సంస్థ వారి వ్యాపారులకు సూచనలు అందచేసింది. ఇక వినియోగదారులంతా చాలా తక్కువ ధరలకే .. ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. ఇక ఈ ఆర్డర్స్ డెలివరీకి కూడా కేవలం రెండు మూడు రోజుల సమయం మాత్రమే పడుతుంది. అయితే , దాదాపు చాలా మంది బ్రాండ్స్ కంటే కూడా బడ్జెట్ నే ఎక్కువ దృష్టిలో పెట్టుకుని షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అటువంటి వారినే టార్గెట్ చేసుకుని.. ఈ అమెజాన్ బజార్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇప్పటివరకు అందిన కంపెనీ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. అమెజాన్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ కు సంబంధించిన ఉత్పత్తులను.. ఎటువంటి అదనవు ఛార్జెస్ లేకుండా.. ఆన్లైన్ లో అమ్మవచ్చని .. విక్రేతలకు తెలియజేసింది.

ఇక ఇప్పటికే బెన్స్ స్టెయిన్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలో అమెజాన్ వినియోగదారుల వృద్ధి డిసెంబర్ 2022లో.. 13% తక్కువ రేటుతో పెరిగింది. ఇక అదే అమెజాన్ కాంపిటేటర్స్ అయిన ఫ్లిప్‌కార్ట్ అండ్ మిషో.. అదే సమయంలో వరుసగా 21% ఇంకా 32% కొత్త వినియోగదారులను పొందారు. సో ఆ సమయంలో మిగిలిన వాటితో పోల్చితే.. అమెజాన్ ఎక్కువమంది కస్టమర్స్ ను ఆకర్షించడంలో .. ఓ రకంగా ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. కాబట్టి ఇక ఇప్పుడు.. అమెజాన్ బజార్ ద్వారా తిరిగి మార్కెట్ లో తన స్థానాన్ని దక్కించుకోనుంది. ఇక అమెజాన్ బజార్ ఎలా ఉండబోతుందంటే.. సాధారణ అమెజాన్ కు భిన్నంగా.. అధిక ఫీజులు లేకుండా.. జీరో ఫీ తో ఉండనుంది. ఇక అమెజాన్ బజార్ లో ఫాస్ట్ డెలివరీ విషయానికొస్తే.. రోజువారీ వస్తువులను గంటల వ్యవధిలో డెలివరీ చేయడం దీని లక్ష్యం. మరిన్ని సేవలను వినియోగదారులకు అందించాడని అమెజాన్ ముందుకు వస్తుంది.