iDreamPost
android-app
ios-app

ఎలక్ట్రిక్ స్కూటర్ పై బంపరాఫర్.. ఏకంగా రూ. 24 వేల తగ్గింపు.. త్వరపడండి

  • Published Feb 26, 2024 | 3:16 PM Updated Updated Feb 26, 2024 | 5:56 PM

ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థలు తమ ఈవీలపై ఆకర్షనీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఆ కంపెనీకి చెందిన ఈవీపై ఏకంగా రూ. 24 వేలు తగ్గింపు ప్రకటించింది కంపెనీ.

ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థలు తమ ఈవీలపై ఆకర్షనీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఆ కంపెనీకి చెందిన ఈవీపై ఏకంగా రూ. 24 వేలు తగ్గింపు ప్రకటించింది కంపెనీ.

  • Published Feb 26, 2024 | 3:16 PMUpdated Feb 26, 2024 | 5:56 PM
ఎలక్ట్రిక్ స్కూటర్ పై బంపరాఫర్.. ఏకంగా రూ. 24 వేల తగ్గింపు.. త్వరపడండి

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువైపోతోంది. పెట్రోల్ ధరలు పెరగడం, బైక్ ధరలకే ఈవీలు కూడా లభిస్తుండడంతో వాహనదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు అద్భుతమైన ఫీచర్లతో టూవీలర్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఈవీ రంగంలో ఓలా, ఏథర్, ఒకాయ్ ఈవీ, బౌన్స్ ఇన్ఫినిటీ వంటి సంస్థలు సేల్స్ లో దూసుకెళ్తున్నాయి. తమ సేల్స్ ను మరింత పెంచుకునేందుకు బంపరాఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా బౌన్స్ ఇన్ఫినిటీకి చెందిన ఈ-స్కూటర్ పై అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. ఏకంగా రూ.24 వేలు డిస్కౌంట్ ప్రకటించింది.

ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థలు పోటీ పడి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మీరు ఈ మధ్యకాలంలో ఈవీ స్కూటర్ ను కొనుగోలు చేయాలనుకుంటే బౌన్స్ ఇన్ఫినిటీకి చెందిన ఈ1 ప్లస్ స్కూటర్ ను కొనుగోలు చేయొచ్చు. ఈ స్కూటర్ పై 21 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. రూ. 1.13లక్షలు కాగా.. ఆఫర్ లో భాగంగా దీనిని కేవలం రూ. 89,999కే అందిస్తోంది. అంటే మీకు రూ. 24 వేలు ఆదా అవుతుందన్న మాట. అయితే ఈ ఆఫర్ 2024, మార్చి 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ప్లస్ స్కూటర్ పై సింగిల్ ఛార్జ్ తో 85 కి.మీల వరకు ప్రయాణం చేయొచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 8 సెకన్లలో గంటకు 40 కి.మీల వేగాన్ని పుంజుకుంటుంది. గరిష్టంగా గంటకు 65కిమీ వేగంతో ప్రయాణించగలుగుతుంది. 2కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ దాదాపు 4 నుంచి5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1+లో ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రత్యేకమైన డ్రాగ్ మోడ్, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్, అల్లాయ్ వీల్స్, వృత్తాకార ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఇంకా ఇతర స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom