iDreamPost
android-app
ios-app

ఎయిర్ ఇండియా ఆఫర్.. బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం.. పూర్తి వివరాలివే!

  • Published Jan 10, 2024 | 1:06 PM Updated Updated Jan 10, 2024 | 3:21 PM

ప్రతి ఒక్కరికీ తన జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది.. కానీ అది నేరవేరని కలగానే మిగిలిపోతుంది. అలాంటి వారి కోసం కొన్ని ప్రైవేట్ విమాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి.

ప్రతి ఒక్కరికీ తన జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది.. కానీ అది నేరవేరని కలగానే మిగిలిపోతుంది. అలాంటి వారి కోసం కొన్ని ప్రైవేట్ విమాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి.

  • Published Jan 10, 2024 | 1:06 PMUpdated Jan 10, 2024 | 3:21 PM
ఎయిర్ ఇండియా ఆఫర్.. బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం.. పూర్తి వివరాలివే!

జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. ఎప్పటికైనా విమాన ప్రయాణం చేయాలని కొంతమంది డబ్బులు కూడబెట్టుకొని తమ కల నెరవేర్చుకుంటారు. వాస్తవానికి ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే సంపన్నులకే పరిమితం అనుకునేవారు.. కానీ కాలం మారింది. ఇప్పుడు ప్రైవేట్ విమానాల్లో తక్కువ ధరకే ప్రయాణించే అవకాశాలు కల్పిస్తున్నాయి. సాధారణంగా విమానం టికెట్ ధర రూ.3 వేల వరకు ఉంటుంది. అలా కాకుండా బస్సు ఛార్జీతో విమానంలో ప్రయాణించే అవకాశం లభిస్తే.. ఏంటీ బస్సు టికెట్ ధరతో ఫ్లైట్ జర్నీనా? అదసలు సాధ్యమా అని మీకు డౌట్ రావొచ్చు. కానీ ఇది నిజమే. ఎయిర్ ఇండియా సంస్థ ఈ ఆఫర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

టాటా గ్రూప్ యాజమాన్యంలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘టైమ్ టూ ట్రావెల్’ పేరుతో గొప్ప ఆఫర్ ని విమాన ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ద్వారా కేవలం రూ.1799 తో దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఇందుకు సంబంధించి ‘ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్’ సంస్థ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ‘1799 రూపాయల ప్రారంభ ధరతో అమేజింగ్ జర్నీలను అన్ లాక్ చేసుకోండి. కంపెనీ వెబ్ సైట్ లో 2024 జనవరి 11 వరకూ టికెట్స్ బుక్ చేసుకుని.. 2024 సెప్టెంబర్ 30 వరకూ ప్రయాణించండి’ అంటూ రాసుకొచ్చింది. ఈ ఆఫర్ ద్వారా ఎంపిక చేసిన రూట్లలో ఢిల్లీ నుంచి జైపూర్, బెంగుళూరు నుంచి చెన్నై, ఢిల్లీ నుంచి గ్వాలియర్, కోల్కతా నుంచి బాగ్ డోగ్రా, బెంగళూరు నుంచి కొచ్చి ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. ప్రయాణికులు ఎయిర్ లైన్స్ నెట్ వర్క్ ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకోవడానికి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. ప్రయాణికులకు డిజిటల్ విధానంతో మీకు నచ్చినట్లు సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తుందని తెలిపింది.

Air travel at the price of a bus ticket

టాటా గ్రూప్ ఎయిర్ లైన్స్ కంపెనీ తన 9వ వార్షికోత్సవం సందర్భంగా తమ కస్టమర్ల కోసం ఈ ప్రత్యేక ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తుంది. ప్రయాణికులు విమానంలో గౌర్ మైర్ హాట్ మీల్స్, రక రకాల స్వీట్లు, ఇన్-ఫ్లేట్ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్ ఎయిర్ ఫ్లిక్ తో పాటు పలు ప్రత్యేక లాయల్టీలు కల్పిస్తుంది. అంతేకాదు న్యూ పాస్ రివార్డ్ ప్రోగ్రామ్ సభ్యులకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. రివార్డు ప్రోగ్రామ్ సభ్యులు 8 శాతం న్యూ కాయిన్స్ పొందుతారు. ఈ స్పెషల్ సభ్యులకు మీల్స్, సీట్స్, బ్యాగేజీలపై ప్రత్యేక రాయితీ, టికెట్ రద్దు చార్జీలపై ప్రత్యేక మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ బంపర్ ఆఫర్ ని వినియోగించుకుంటే బెటర్. ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ యాప్, వెబ్ సైట్ ద్వారా ఈ డిస్కౌంట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.  ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom