Dharani
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో ఏపీ పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఏసీ పేలుడు ఎందుకు జరుగుతుంది.. దాన్ని నివారించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో ఏపీ పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఏసీ పేలుడు ఎందుకు జరుగుతుంది.. దాన్ని నివారించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Dharani
ప్రముఖ జ్యువెలరీ సంస్థ.. కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా జనాలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఏసీ బ్లాస్ట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. దాంతో ఏసీ వాడే వారు కాస్త భయపడుతున్నారు. వేసవి తీవ్రత నుంచి తప్పించుకోవడం కోసం చాలా మంది ఇళ్లలో ఏసీలు వాడుతుంటారు. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండటంతో.. గతంతో పోలిస్తే.. ఈసారి ఏసీలకు డిమాండ్ కాస్త పెరిగింది.
ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు మండిపోతున్నాయి. దాంతో భానుడి ప్రతాపం నుంచి తప్పించుకోవడం కోసం జనాలు ఏసీ, కూలర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఈ వేసవిలో వాటికి డిమాండ్ బాగా పెరిగింది. అయితే ఏసీ వాడకంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. కళ్యాణ్ జ్యువెలర్స్‌లో జరిగినట్లుగానే పేలుడు సంభవించే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏసీ ప్రమాదాలను నివారించాలంటే.. వాటిని ఇన్‌స్టాల్ చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు పెట్టుకోవాలి అంటున్నారు. లేదంటే భారీ నష్టాన్ని చవి చూస్తారని హెచ్చరిస్తున్నారు. కొత్త ఏసీని వాడేటప్పుడు కంటే కూడా.. సెకండ్ హ్యాండ్, పాతది, రెంట్‌కు తీసుకున్న ఏసీని వాడుతున్నప్పున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ అంటున్నారు.