iDreamPost
android-app
ios-app

జొమాటో బంపర్ ఆఫర్.. 6 నెలలు వచ్చే రూ.1700 గోల్డ్ మెంబర్ ఆఫర్.. రూ.30కే!

Zomato Gold Membership For Only Rs.30: జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థ తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ని ప్రకటించింది. 6 నెలల పాటు ఫుడ్ ని ఫ్రీగా డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. కేవలం 30 రూపాయలకే ఎలాంటి డెలివరీ ఛార్జీలు లేకుండా ఫుడ్ ని డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీని కోసం ఒక గోల్డ్ మెంబర్ షిప్ ని లాంఛ్ చేసింది.

Zomato Gold Membership For Only Rs.30: జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థ తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ని ప్రకటించింది. 6 నెలల పాటు ఫుడ్ ని ఫ్రీగా డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. కేవలం 30 రూపాయలకే ఎలాంటి డెలివరీ ఛార్జీలు లేకుండా ఫుడ్ ని డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీని కోసం ఒక గోల్డ్ మెంబర్ షిప్ ని లాంఛ్ చేసింది.

జొమాటో బంపర్ ఆఫర్.. 6 నెలలు వచ్చే రూ.1700  గోల్డ్ మెంబర్ ఆఫర్.. రూ.30కే!

జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఫుడ్ డెలివరీ మీద ప్రతిసారీ ఛార్జీలు ఉంటాయి. ఈ ఫుడ్ డెలివరీ ఛార్జీల భారం ఉండకూడదంటే గోల్డ్ మెంబర్ షిప్ అని ఒకటి ఉంటుంది. ఆ మెంబర్ షిప్ ని కొనుగోలు చేస్తే అసలు డెలివరీ ఛార్జీలు ఉండవు. అయితే ఈ గోల్డ్ మెంబర్ షిప్ ని కొనాలంటే ప్రతి నెలా 279 రూపాయలు చెల్లించాలి. ఆరు నెలల పాటు ఈ ఈ బెనిఫిట్స్ పొందాలంటే దాదాపు 1700 రూపాయలు చెల్లించాలి. అయితే ఈ గోల్డ్ మెంబర్ షిప్ ని ఇప్పుడు కేవలం 30 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. అవును 30 రూపాయలకే ఆరు నెలల పాటు ఎలాంటి డెలివరీ ఛార్జీలు లేకుండా ఫుడ్ ని పొందవచ్చు. 

జొమాటో 16వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఫుడ్ లవర్స్ కోసం జొమాటో భారీ బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. జొమాటో అంతకు ముందే గోల్డ్ మెంబర్ షిప్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త కస్టమర్ల కోసం జొమాటో గోల్డ్ మెంబర్ షిప్ లో రాయితీ కల్పిస్తూ తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. జొమాటో 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ ఫుడ్ లవర్స్ కోసం గోల్డ్ మెంబర్ షిప్ ని తీసుకొచ్చింది. ఈ గోల్డ్ మెంబర్ షిప్ లో భాగంగా కస్టమర్లు 6 నెలల పాటు ఫుడ్ ఆర్డర్ చేస్తే ఉచితంగా డోర్ డెలివరీ పొందవచ్చు. ఈ మెంబర్ షిప్ ధర రూ. కేవలం 30 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.

Zomato gold offer

అయితే ఈ ఆఫర్ కేవలం ఇప్పటి వరకూ గోల్డ్ మెంబర్ షిప్ లేని వారికి మాత్రమే. ఆల్రెడీ గోల్డ్ మెంబర్ షిప్ ఉన్నవారికి ఈ ఆఫర్ వర్తించదు. ఈరోజుతో ఈ ఆఫర్ ఎండ్ అయిపోతుంది. ఈరోజే గోల్డ్ మెంబర్ షిప్ తీసుకుంటే 3+3 మొత్తం 6 నెలల పాటు 30 రూపాయలకే ఫ్రీ డెలివరీ ఆఫర్ ని పొందవచ్చు. ఈ గోల్డ్ మెంబర్ షిప్ ని యాక్టివేట్ చేసుకుంటే ఇండియాలోని అన్ని రెస్టారెంట్స్ నుంచి ఫ్రీగా డెలివరీ చేస్తారు. మీరున్న ఏరియాకి 7 కి.మీ. పరిధిలో ఆ రెస్టారెంట్ ఉంటే.. మీ ఆర్డర్ 199 రూపాయల కంటే ఎక్కువ ఉంటే ఎలాంటి డెలివరీ ఛార్జీలు ఉండవు. దీంతో పాటు 20 వేలకు పైగా రెస్టారెంట్స్ మీద 30 శాతం వరకూ అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు.   

గోల్డ్ మెంబర్ షిప్ ఎలా తీసుకోవాలి?:

  • జొమాటో యాప్ లోకి వెళ్ళాలి. 
  • పైన కుడి వైపున ప్రొఫైల్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి. 
  • ‘జాయిన్ గోల్డ్ నవ్’ మీద క్లిక్ చేసి కొనుక్కోవాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి