Dharani
Sovereign Gold Bond: బంగారం కొనాలనుకుని.. భారీగా పెరుగుతున్న ధరలు చూసి ఆగిపోతున్నారా.. అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. తక్కువ ధరకే పసిడి కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఆ వివారలు..
Sovereign Gold Bond: బంగారం కొనాలనుకుని.. భారీగా పెరుగుతున్న ధరలు చూసి ఆగిపోతున్నారా.. అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. తక్కువ ధరకే పసిడి కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఆ వివారలు..
Dharani
బంగారం అంటే ఇష్టపడని భారతీయులు లేరంటే అతిశయోక్తి కాదు. పండగ, శుభకార్యాలు ఇలా సందర్భం దొరికిన ప్రతి సారి పసిడి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇక నేటి కాలంలో గోల్డ్ మీద పెట్టుబడి పెట్టేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఇక వివాహాది శుభకార్యాల సందర్భంగా మన దగ్గర భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేస్తారు. అయితే ఇండియాలో పుత్తడికి డిమాండ్ భారీగా ఉండటంతో.. ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. పెరుగుతున్న పసిడి ధర చూసి.. కొనుగోలు చేయడానికి భయపడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే గోల్డ్ కొనే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్రం బంపరాఫర్ ప్రకటించింది. తక్కువ ధరకే సావరిన్ గోల్డ్ బాండ్ల రూపంలో పసిడి కొనుగోలుకు మరోసారి అవకాశం కల్పించింది. ఇప్పటికే మూడు సార్లు సావరిన్ గోల్డ్ బాండ్ల కొనుగోలుకు అవకాశం కల్పించిన కేంద్రం మరోసారి వీటిని తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. 2024, ఫిబ్రవరి 12వ తేదీని సబ్‌స్క్రిప్షన్‌కు తీసుకురానుండగా.. ఫిబ్రవరి 16 వరకు కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించింది. సావరిన్ గోల్డ్ బాండ్ల మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఇన్వెస్టర్లు సంవత్సరానికి 2.50 శాతం చొప్పున స్థిర వడ్డీ పొందొచ్చు. ఫిజికల్ గోల్డ్ డిమాండ్‌ను తగ్గించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ బాండ్స్ తీసుకొచ్చింది.
ఈ గోల్డ్ బాండ్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే గ్రాము మీద రూ. 50 చొప్పున డిస్కౌంట్ పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ సావరిన్ గోల్డ్ బాండ్లును విక్రయిస్తుంటోంది. ఇక దరఖాస్తు చేసుకునేందుకు నిర్ణయించిన తేదీలకు.. ముందు వారంలోని.. చివరి 3 రోజుల సగటు బంగారం ధరను ఈ బాండ్ గోల్డ్ రేటును నిర్ణయించేందుకు పరిగణనలోకి తీసుకుంటారు. ఇండియా బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీఏజే) లిమిటెడ్ నిర్ణయించిన ధరలే ఈ గోల్డ్ బాండ్ రేటుకు ప్రామాణికం.
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్స్, నిర్దేశిత పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా ఈ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ పద్దతిలో కొనే ఒక్కో బాండ్ ఒక గ్రాము బంగారంతో సమానం. దీని ద్వారా కనిష్టంగా గ్రాము నుంచి.. గరిష్టంగా 4 కిలోల వరకు పసిడి కొనుగోలు చేయొచ్చు. ఇక ట్రస్టులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, యూనివర్సిటీలు వంటివి అయితే 20 కిలోల వరకు బంగారం కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఈ గోల్డ్ బాండ్ల టెన్యూర్ 8 సంవత్సరాలుగా ఉంటుంది. అంటే వీటిని కొనుగోలు చేసిన 8 ఏళ్ల తర్వాతే మీ చేతికి మొత్తం డబ్బులొస్తాయి. అయితే ఈ ఎనిమిదేళ్ల కాలంలో.. బంగారం ధర పెరిగితే.. రిటర్న్స్ కూడా పెరుగుతాయి. పైగా వడ్డీ అదనంగా వస్తుంది. అయితే ఐదేళ్లు ముగిసిన తర్వాత పాక్షికంగా ముందస్తుగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాక ఈ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రస్తుత రేటు ప్రకారం పసిడి కొనుగోలు చేస్తే.. విత్‌డ్రా చేసే సమయంలో అప్పటి బంగారం ధరను బట్టి మనకు నగదు తిరిగి చెల్లిస్తారు.
సాధారణంగా బంగారం అమ్మితే.. తరుగు వంటివి పోతాయి. కానీ గోల్డ్ బాండ్స్‌లో ఈ ఇబ్బంది ఉండదు. పైగా మనం కొనుగోలు చేసిన బాండ్ల మీద వడ్డీ లాభం వస్తుంది. బంగారం పొతుందున్న ఆలోచన లేదు.. కాలపరిమితి ముగిసే వరకు ఎదురు చూస్తే.. పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. పైగా బంగారం మాదిరిగానే.. గోల్డ్ బాండ్లను కూడా తనఖా పెట్టి లోన్ పొందవచ్చు. కనుక ఎక్కువ మొత్తంలో బంగారం కొనగోలు చేయాలనుకునేవారు, పెట్టుబడి దృష్టా పుత్తడి కొనుగోలు చేయాలనుకునే వారు.. గోల్డ్‌బాండ్లను కొనడం మంచిది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.