Dharani
రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడిలో.. ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారం చేయాలని భావస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. ఈ బిజినెస్ ప్రారంభించాలంటే 15 వేలు చాలు. ఇంతకు ఏంటా వ్యాపారం అంటే..
రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడిలో.. ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారం చేయాలని భావస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. ఈ బిజినెస్ ప్రారంభించాలంటే 15 వేలు చాలు. ఇంతకు ఏంటా వ్యాపారం అంటే..
Dharani
ఒకప్పుడు లైఫ్‌లో సెటిల్ అవ్వడం అంటే.. ఉద్యోగంలో చేరినా.. లేదంటే వారసత్వంగా వస్తోన్న పనిలో కుదురుకున్నా సరిపోయేది. మరి నేడో.. కాలంతో పాటు యువత ఆలోచన తీరు కూడా మారుతోంది. ఒకరి కింద పని చేసి.. నెలాఖరులో నాలుగురాళ్ల జీతం తీసుకునే బదులు.. వ్యాపారం చేస్తూ.. తమకు తాము ఉపాధి కల్పించుకోవడంతో పాటు.. మరో నలుగురికి బతుకుదెరువు చూపాలని భావించే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే చాలా మంది యువత వ్యాపారం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే బిజినెస్ చేయడం అంటే మాటలు కాదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. భారీ ఎత్తున నష్టాలు చవి చూడాల్సి వస్తుంది.
కనుక వ్యాపారం ఎంచుకునే ముందే అన్ని ఆలోచించుకోవాలి. తక్కువ పెట్టుబడితో ప్రారంభించే వ్యాపారాలు చేస్తే మేలంటున్నారు నిపుణులు. అలాంటి వాటిల్లో బెస్ట్ చాయిస్ ఇప్పుడు మేం చెప్పబోయే బిజినెస్ ఐడియా. 15 వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభం అయ్యే ఈ బిజినెస్ జాగ్రత్తగా చూసుకుంటే.. నెలకు ఎంత లేదన్న లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇంతకు ఏంటా బిజినెస్ ఐడియా అంటే..
తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి బెస్ట్ ఐడియా గానుగ నూనె బిజినెస్. నేటి కాలంలో అందరికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతోంది. దాంతో రిఫైన్డ్ ఆయిల్ బదులు.. సంప్రాదాయ గానుగ నూనె కొనే వారి సంఖ్య పెరుగుతోంది. రానున్న రోజుల్లో దీనికి మరింత డిమాండ్ ఉండనుంది. ఈ బిజినెస్‌కు పెట్టుబడి తక్కువ.. రిస్క్ శాతం తక్కువ.. ఆదాయం ఎక్కువ. ఇక ఈ వ్యాపారం ప్రాంరభించాలంటే ముందుగా కావాల్సింది ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్. దీనితో మీరు ఇంటి వద్దే బిజినెస్ ప్రారంభించవచ్చు. ఇది తక్కువ స్థలం ఆక్రమిస్తుంది.
దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువ. విజయం సాధిస్తే.. నెలకి లక్ష రూపాయల వరకు పొందవచ్చు. అయితే అసలు ఈ వ్యాపారాన్ని ఎలా మొదలు పెట్టాలో ఇప్పుడు మనం చూద్దాం… ఈ బిజినెస్‌ను మొదలు పెట్టేందుకు 10×10 సైజ్ ఉన్న రూమ్ కావాలి. ఇక మిషన్ ధర విషయానికొస్తే కెపాసిటీ బట్టి 15 వేల నుంచి ప్రారంభమై లక్ష వరకు ఉంటుంది. ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్సు తప్పనిసరిగా ఉండాలి. మీరు తయారు చేసిన ఆయిల్ ప్యాకెట్స్ లేదా సీసాలలో ప్యాక్ చేసి నేరుగా అమ్మకాలు చేయవచ్చు
ఈ మిషన్ ద్వారా చేసిన ఆయిల్‌కు మార్కెట్లో లీటర్ మీద 50 రూపాయలు చొప్పున లాభం వస్తుంది. ఇక ఈ లెక్కన సుమారు మీరు రోజుకి 50 లీటర్ల నూనెను తయారుచేసి అమ్మినట్లయితే రోజుకు 2500 చొప్పున లాభం వస్తుంది. అలా చూసుకుంటే సుమారు నెలకు 60 వేలకి పైగా సంపాదన పొందవచ్చు. డిమాండ్ బాగుంటే.. ఎక్కువ లీటర్ల నూనె అమ్మగలిగితే లాభాలు మరింత పెరుగుతాయి.
అంతేకాక కాకుండా నూనె తీసిన తర్వాత లభించే పిప్పిని కూడా పశువులకు మేతగా వేస్తూ ఉంటారు. దానిని కూడా మీరు సేల్ చేసి దాని నుంచి కూడా లాభాలను పొందుకోవచ్చు. అంటే ఒక్క వ్యాపారంతో రెండు ఆదాయాలు పొందవచ్చు అన్నమాట. అయితే మీరు ఉత్పత్తి చేసిన నూనెను మార్కెటింగ్ చేసుకునే దాని మీద ఈ వ్యాపారం విజయం ఆధారపడి ఉంటుంది అంటున్నారు నిపుణులు.