iDreamPost
android-app
ios-app

మనీష్ ఎలిమినేషన్ కు అదే కారణమా ! రెమ్యునరేషన్ ఎంతంటే ?

  • Published Sep 22, 2025 | 12:04 PM Updated Updated Sep 22, 2025 | 12:04 PM

BiggBoss 9 Updates : ఈ వారం మొదట్లో అంతా హరీష్ చేసిన హంగామా చూసి అతను కానీ.. ఎలాంటి ఇంటరేక్షన్స్ పెట్టుకోకుండా సర్వైవ్ అవుతున్న ఫ్లోరా కానీ బయటకు వస్తారనుకున్నారు. కానీ ఊహించని విధంగా తానూ చాలా తెలివిగలవాడిని అని చెప్పుకుని.. హౌస్ లోకి వెళ్లిన మర్యాద మనీష్ బయటకు వచ్చేసాడు. ఇది హౌస్ మేట్స్ అందరికి షాక్ ఇచ్చింది.

BiggBoss 9 Updates : ఈ వారం మొదట్లో అంతా హరీష్ చేసిన హంగామా చూసి అతను కానీ.. ఎలాంటి ఇంటరేక్షన్స్ పెట్టుకోకుండా సర్వైవ్ అవుతున్న ఫ్లోరా కానీ బయటకు వస్తారనుకున్నారు. కానీ ఊహించని విధంగా తానూ చాలా తెలివిగలవాడిని అని చెప్పుకుని.. హౌస్ లోకి వెళ్లిన మర్యాద మనీష్ బయటకు వచ్చేసాడు. ఇది హౌస్ మేట్స్ అందరికి షాక్ ఇచ్చింది.

  • Published Sep 22, 2025 | 12:04 PMUpdated Sep 22, 2025 | 12:04 PM
మనీష్ ఎలిమినేషన్ కు అదే కారణమా ! రెమ్యునరేషన్ ఎంతంటే ?

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రోజు రోజుకి సర్ప్రైజ్ లు ఇస్తుంది. ఉన్న కంటెస్టెంట్స్ తో ఆడియన్స్ అయితే మరీ అంత హ్యాపీగా లేరు అన్నది వాస్తవం. ఎప్పుడెప్పుడు హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. గతవారం ఎలాంటి ఒపీనియన్ సంపాదించుకోకుండా స్రష్టి వర్మ బయటకు వచ్చేసింది. ఈ వారం మొదట్లో అంతా హరీష్ చేసిన హంగామా చూసి అతను కానీ.. ఎలాంటి ఇంటరేక్షన్స్ పెట్టుకోకుండా సర్వైవ్ అవుతున్న ఫ్లోరా కానీ బయటకు వస్తారనుకున్నారు. కానీ ఊహించని విధంగా తానూ చాలా తెలివిగలవాడిని అని చెప్పుకుని.. హౌస్ లోకి వెళ్లిన మర్యాద మనీష్ బయటకు వచ్చేసాడు.

ఇది హౌస్ మేట్స్ అందరికి షాక్ ఇచ్చింది.. ముఖ్యంగా కామనర్స్ కు ఇది పెద్ద షాక్. మొదట్లో మనీష్ అగ్నిపరీక్షకు వచ్చినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా, స్మార్ట్ థింకింగ్ వే లో కనిపించినప్పుడు ఇతను కచ్చితంగా హౌస్ లోకి వెళ్తారని అనుకున్నారు. అలాగే వెళ్ళాడు కూడా . కానీ తీరా చూస్తే అదే స్మార్ట్ థింకింగ్ ఓవర్ స్మార్ట్ అయ్యి అతనిని ఎలిమినేట్ చేసేసింది. టెనెంట్స్ తో కాస్త ఓవర్ గా మాట్లాడడం లాంటివి మనీష్ ఇంపాక్ట్ ను తగ్గించేసాయి. అలాగే అతను కూడా మాటలు పడ్డాడు. కానీ తిరిగి నామినేట్ మాత్రం చేయలేదు. వాళ్ళ వలన ఇబ్బంది పడినా వాళ్ళను నామినేట్ చేయకుండా.. సెలబ్రిటీస్ ను నామినేట్ చేయడం ప్రేక్షకులకు నప్పలేదు.

తెలుగు కాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడడం , బిగ్ బాస్ నుంచి వార్నింగ్స్ ఇప్పించుకోవడం ఇలాంటి పొరపాట్లే మనీష్ ను హౌస్ నుంచి బయటకు వచేసేలా చేసాయని టాక్. ఇక్కడ తన గొయ్యి తానె తవ్వుకున్నట్లు అయిందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కామనర్స్ అందరికి వారానికి రూ.70-80 వేలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ లెక్కన మర్యాద మనీష్ రెండు వారాలకు లక్షన్నర సంపాదించాడన్నట్లుగా టాక్. ఇక ముందు ముందు బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.