iDreamPost
android-app
ios-app

Soniya Akula: RGV హీరోయిన్ రూటే సెపరేట్.. సోనియా స్ట్రాటజీకి హౌస్ మొత్తం గల్లంతే!

Soniya Akula Strategy And Game Plan: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో సోనియా ఆకుల పేరు బాగా వినిపిస్తోంది. ఈమె గేమ్ చూసి చాలా మంది షాకవుతున్నారు కూడా. గొడవలు అంటే ఒంటి కాలుతో వెళ్లిపోతోంది. అసలు ఆమె గేమ్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం.

Soniya Akula Strategy And Game Plan: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో సోనియా ఆకుల పేరు బాగా వినిపిస్తోంది. ఈమె గేమ్ చూసి చాలా మంది షాకవుతున్నారు కూడా. గొడవలు అంటే ఒంటి కాలుతో వెళ్లిపోతోంది. అసలు ఆమె గేమ్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం.

Soniya Akula: RGV హీరోయిన్ రూటే సెపరేట్.. సోనియా స్ట్రాటజీకి హౌస్ మొత్తం గల్లంతే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే జోరుగా హుషారుగా సాగుతోంది. కంటెస్టెంట్స్ అంతా తమ తమ బెస్ట్ ఇచ్చేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా ఒక కెప్టెన్ ఉండేవాడు. కానీ, ఇప్పుడు ముగ్గురు చీఫ్ లను చేశారు. వారికి ఇమ్యూనిటీ కూడా లభిస్తోంది. ఒకరిని సేవ్ చేసేది.. ఇప్పుడు ముగ్గురిని సేవ్ చేస్తున్నారు. అలాగే గొడవలు కూడా గట్టిగానే జరుగుతున్నాయి. అయితే అందరితో పోలిస్తే.. ఒకరి పేరు మాత్రం బాగా వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు.. ఆర్జీవీ హీరోయిన్ సోనియా ఆకుల. ఈమె షో స్టార్టింగ్ నుంచి ఈ మూడ్రోజుల్లోనే ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. చాలామంది ఆమె గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. ఇప్పుడు అంతా ఈమె స్ట్రాటజీ గురించే మాట్లాడుకుంటున్నారు.

బిగ్ బాస్ హౌస్ లోకి హీరోయిన్ కేటగిరీలో సోనియా ఆకలు ఎంటర్ అయ్యింది. స్టేజ్ మీద ఈమె కోసం ఆర్జీవీ వీడియో సందేశాన్ని కూడా పంపారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. అప్పుడే సోనియా గురించి అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఆర్జీవీ సపోర్ట్ చేస్తున్నాడు అంటే కచ్చితంగా విషయం ఉంది అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. వాళ్ల నమ్మకం నిజమే అయ్యింది. ఆమె హౌస్ లోకి వచ్చింది మొదలు.. అల్లాడించేస్తోంది. ఎక్కడ చూసినా ఈమే కనిపిస్తోంది. ఎలాంటి డిస్కషన్ అయినా కూడా ఈమె గొంతు వినపడాల్సిందే. ప్రతి విషయంలో తన అభిప్రాయాలను పంచుకుంటూ వస్తోంది. కొన్నిసార్లు కాంట్రవర్సీ కూడా అవుతున్నాయి.

గొడవలతోనే ఎక్కువ వైరల్:

సోనియా పేరు ఎక్కువ గొడవలతోనే వైరల్ అవుతూ వస్తోంది. ఆర్జే శేఖర్ బాషాతో మొదలు పెడితే.. నామినేషన్స్ లో చీఫ్ నిఖిల్ ని దులిపేయడం వరకు అన్నీ ఒక స్ట్రాటజీ ప్రకారమే జరిగింది అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకు ఏం మాట్లాడితే తను కవర్ అవుతుందో తెలిసు అనిపిస్తోంది. అందుకే ఎక్కడ ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతోంది. మొదట శేఖర్ బాషాని విదిలించేసింది.. పశువు అన్నట్లుగా ఇన్ డైరెక్ట్ కామెంట్స్ కూడా చేసింది. వెంటనే అలా అనేయాల్సి వచ్చింది.. ఏం అనుకోవద్దు అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. అక్కడ ఉన్న వాళ్లకే కాదు.. ఆడియన్స్ కి కూడా ఆమె ఏం చేస్తోందో అర్థం కాలేదు. ఆ తర్వాత బేబక్క మీద కూడా మంచి పాయింట్ తో ఆర్గుమెంట్ చేసింది. ఆ విషయం ఆమెకు చాలా పాజిటివ్ కూడా అయ్యింది.

నామినేషన్స్ లో:

ఇంక నామినేషన్స్ లో అయితే నెక్ట్స్ లెవల్ అంతే. ఎందుకంటే నా నామినేషన్ లో మీరు ఎవరు మాట్లాడటానికి అంటూ ముగ్గురు చీఫ్స్ ని విదిలించి పారేసింది. తన పాయింట్స్ చెప్పేసి.. కేకలు వేస్తూ వాదనకు దిగింది. అయితే ఇక్కడే కాస్త నెగిటివిటీ వచ్చింది. ఆమె అవతలి వారికి అసలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదు. నామినేట్ చేస్తూ డిఫెండ్ చేసుకునేందుకు ఛాన్స్ ఇవ్వకుండా అరిచేస్తోంది. నామినేషన్స్ లో మాత్రం ఆమెకు నెగిటివ్ అయ్యింది. అలాగే ప్రతి విషయాన్ని సీరియస్ గా ఇష్యూ చేయడం కూడా ఆమెకు నెగిటివ్ అవుతోంది. అందరికి విసుగు వస్తోంది. అయితే ఏం చేస్తే మనకు ప్రియారిటీ ఇస్తారు అనే విషయం మాత్రం సోనియాకి క్లారిటీ ఉంది. అందుకే అవతలి వారిని ట్రిగర్ చేసి వదిలేస్తోంది. అప్పటి వరకు కూల్ గా కనిపించిన ప్రేరణను ఒక్క మాటతో కేకలు వేసేలా చేసింది. ఆమె టెంపర్ ని లూజ్ అయ్యేలా చేసి.. సోనియా మాత్రం చాలా కూల్ గా మాట్లాడింది. ఇలా కెమెరా స్పేస్ కోసం ప్రతి విషయాన్ని గొడవగా చేస్తే సోనియాకి నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి అటెన్షన్ గ్రాబ్ చేయడంలో సక్సెస్ అవుతోంది. తాను చెప్పాలి అనుకున్నది బాగా చెప్తోంది. కానీ, కాస్త ల్యాగ్, అనవసరపు ప్రస్తావనలు తగ్గించుకుంటే బాగుంటుంది. మరి.. సోనియా గేమ్ మీకు ఎలా అనిపిస్తోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.