Tirupathi Rao
Reasons Behind Bezawada Bebakka Elmination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తొలి ఎలిమినేషన్ జరిగిపోయింది. బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆవిడ ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అనే ప్రశ్న అయితే వినిపిస్తోంది. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి.
Reasons Behind Bezawada Bebakka Elmination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తొలి ఎలిమినేషన్ జరిగిపోయింది. బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆవిడ ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అనే ప్రశ్న అయితే వినిపిస్తోంది. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి.
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి దిగ్విజయంగా తొలి వారాన్ని పూర్తి చేసుకుంది. ఒక వారం పూర్తి అయ్యింది అంటే.. ఒకరు హౌస్ నుంచి బయటకు వచ్చేశారు అని అర్థం. తొలివారమే హౌస్ నుంచి బయటకు వచ్చేసిన బేబక్క గురించి చాలానే డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆవిడ ఎందుకు అప్పుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది? అనే ప్రశ్న అడుగుతున్న వాళ్లు కూడా లేకపోలేదు. అందుకు సింపుల్ గా స్యవంకృతాపరాధం అని సమాధానం చెప్పలేం. అది వాస్తవమే అయినా కూడా.. బేబక్క ఎలిమినేషన్ కు చాలానే కారణాలు ఉన్నాయి. వాటిలో మరీ ముఖ్యంగా ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ హౌస్ లో బేబక్కను ఎంటర్ టైనర్ కోటాలోనే తీసుకెళ్లారు. అయితే అదే ఆవిడ దగ్గరి నుంచి కొరవడింది. అప్పటికప్పుడు ఏదో సిట్చువేషన్ ని బట్టి రెండు డైలాగులు చెప్తోంది తప్పితే.. దానిని ఒక బాధ్యతలా తీసుకున్నట్లు కనిపించలేదు. స్వతహాగా ఇన్ ఫ్లుఎన్సర్, యాంకర్, సింగర్, ఎంటర్ టైనర్.. కానీ హౌస్ లో మాత్రం బేబక్క వంటలక్కలా మారిపోయింది. అక్కడ కూడా సరైన మార్కులు సొంతం చేలుకోలేక పోయింది. అక్కడ కూడా శత్రువులే వచ్చారు. మొదటి వారమే మన టాలెంట్ బయట పెట్టడం ఎందుకు అనుకుని ఊర్కొందో.. ఏమో గానీ మొదటి వారమే బయటకు వచ్చేసింది.
ఇప్పుడు ఎవరైనా బేబక్క నువ్వు తప్పు అంటే.. అవునా ఓకే అంటోది తప్పితే.. నేను ఎందుకు తప్పు? నేను అలాంటి తప్పు చేయలేదు అనే మాట ఆవిడ నోటి నుంచి రావడం లేదు. ఎందుకు అలా ఎవరు ఏం చెప్పినా కూడా సరే అని తలఊపి వెళ్లిపోయిందో.. ఎవరికీ అర్థం కాలేదు. మంచిగా ఉండాలి.. మంచిగానే మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యిందో ఏమో గానీ.. స్వయంకృతాపరాధంతోనే బయటకు వచ్చేసింది. తన మాటలకు కాస్త పదును పెట్టి ఉంటే కచ్చితంగా హౌస్ లో సర్వైవ్ అయ్యి ఉండేది.
హౌస్ లో నుంచి బేబక్క బయటకు రావడానికి బిగ్గెస్ట్ రీజన్ ఆవిడ కొందరిని గుడ్డిగా నమ్మడం అనే చెప్పాలి. ఎందుకంటే ఊరికే అందరినీ నమ్మేయడం అంత మంచిది కాదు. ఇక్కడ అందరూ ఎవరి ఆట వాళ్లు అడటానికి వచ్చారు. కానీ, బేబక్క తన మనసు చెప్పింది కాకుండా.. ఎవరో చెప్పిన మాటలు వింటున్నట్లు కనిపించింది. నిఖిల్ ని గుడ్డిగా ఫాలో అయ్యాను అని ఆవిడే ఒప్పుకుంది కూడా. అలా నిఖిల్ ని నమ్మడమే ఆవిడ ఇక్కడ ఉండటానికి ప్రధాన కారణాల్లో ఒకటి. కూరలో కారం ఎక్కువ అవ్వడానికి నిఖిల్ కారణం. ఎవరి వంట వాళ్లు చేసుకోకూడదు అనే మాట రావడానికి నిఖిల్ కారణం. కానీ, ఈ రెండింటి బ్లేమ్ మాత్రం బేబక్క మీదే పడింది. వాటిని ఆవిడ స్వీకరించినట్లే కనిపించింది. ఫలితంగా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.
బేబక్క నామినేషన్స్ లోకి రావడానికి, ఎలిమినేట్ కావడానికి సోనియా ప్రధాన కారణం అనే చెప్పాలి. ఎందుకంటే సరదాగా స్టార్ట్ అయిన డిస్కషన్ వెంటనే పెద్ద రచ్చగా మారిపోయింది. మా ఆకలి అంటే నీకు లెక్కలేదు అని సోనియా అనడం.. ఆ మాట అందరి మైండ్ లో నాటుకుపోవడం చూశాం. నామినేషన్స్ లో కూడా అదే పాయింట్ మీద ఎక్కువ ఓట్లు పడ్డాయి. కాబట్టి బేబక్క ఎలిమినేట్ కావడానికి సోనియా కూడా ప్రధాన కారణం. నాగ మణికంఠ సేవ్ అయ్యి హౌస్ లోకి రాగానే.. సోనియా అతడిని గట్టిగా పట్టుకుని చాలా అభిమానం, ఆనందం చూపించింది. నిజానికి అవి బేబక్క ఎలిమినేట్ అయ్యిందని అంత ఆనందంగా ఉన్నట్లు అనిపించింది. మొత్తానికి బేబక్క అయితే హౌస్ నుంచి తొలివారమే ఎలిమినేట్ అయ్యి.. బయటకు వచ్చేసింది. బేబక్క ఎలిమినేట్ కావడానికి కారణం ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.