iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ బజ్ ప్రోమో వచ్చేసింది.. ఈసారి బజ్ ఇంటర్వ్యూలకు జంక్షన్లు జామ్ అవుతాయిగా!

  • Published Aug 27, 2024 | 6:19 PM Updated Updated Aug 27, 2024 | 6:19 PM

Bigg Boss 8 Buzz Promo Out Now: బిగ్ బాస్ నిర్వాహకులు స్పీడు పెంచేశారు. ఇప్పటికే షోకి సంబంధించి అధికారిక ప్రకటన చేయడమే కాకుండా.. ఇప్పుడు బజ్ కి సంబంధించి ప్రోమో కూడా విడుదల చేశారు.

Bigg Boss 8 Buzz Promo Out Now: బిగ్ బాస్ నిర్వాహకులు స్పీడు పెంచేశారు. ఇప్పటికే షోకి సంబంధించి అధికారిక ప్రకటన చేయడమే కాకుండా.. ఇప్పుడు బజ్ కి సంబంధించి ప్రోమో కూడా విడుదల చేశారు.

  • Published Aug 27, 2024 | 6:19 PMUpdated Aug 27, 2024 | 6:19 PM
బిగ్ బాస్ బజ్ ప్రోమో వచ్చేసింది.. ఈసారి బజ్ ఇంటర్వ్యూలకు జంక్షన్లు జామ్ అవుతాయిగా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వచ్చేస్తోంది. సెప్టెంబర్ 1న రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే చాలానే అప్ డేట్స్, గాసిప్స్ వచ్చేశాయి. అయితే ఎప్పటి నుంచో బిగ్ బాస్ బజ్ ని ఎవరు హోస్ట్ చేస్తారు? అనే ప్రశ్న అయితే అందరిలో ఉంది. అందుకు చాలానే పేర్లు కూడా వినిపించాయి. వాటిలో శివాజీ అని కొందరు, శోభాశెట్టి అని ఇంకొందరు చెబుతూ వచ్చారు. అయితే ఈ ఊహాగానాలకు తెర దించుతూ.. బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరో రివీల్ చేశారు. అందుకు సంబంధించి అధికారిక ప్రోమో కూడా విడుదల చేశారు. నిజంగా ఈయన పేరు లిస్ట్ లో కూడా లేదు.. కానీ, అనూహ్యంగా ఈయన వచ్చేశాడు.

బిగ్ బాస్ బజ్ కి సంబంధించి ఈసారి ఎవరు యాంకర్ గా వస్తారు అనే ప్రశ్న చాలామందిలో ఉంది. అయితే అందుకు సమాధానం కూడా వచ్చేసింది. ఈసారి బిగ్ బాస్ బజ్ కి యాంకర్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ అంబటి అర్జున్ ని తీసుకున్నారు. అవును బిగ్ బాస్ ఏడో సీజన్ లో సెకండ్ గ్రాండ్ లాంఛ్ లో అంబటి అర్జున్ హౌస్ లోకి వచ్చాడు. ఆ తర్వాత హౌస్ లో తన ఆటతో ఆకట్టుకున్నాడు. మిత్రుడు అయినా తప్పుచేస్తే ముఖానే చెప్పేసే వ్యక్తితం అర్జున్ సొంతం. అలాంటి ఒక డేరింగ్ అండ్ డ్యాషింగ్ వ్యక్తిని బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా ఎంపిక చేశారు అంటే.. చాలా గట్టిగానే ప్లాన్ చేశారు అని అర్థమైపోతోంది. పైగా అంబటి అర్జున్ ప్రోమోలోనే.. కంటెస్టెంటులకు వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు.

ప్రోమో ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఆ ప్రోమోలో.. “టైమ్ బాగుంటే సంతోషం.. టైమ్ బాగోకపోతే సంకోచం. టైమ్ బాగుంటే మనం ఏం చేసినా ఒప్పు.. అలా టైమ్ బాగున్న కొంతమంది బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నారు. మరి వాళ్ల టైమ్ బ్యాడ్ అయితే? బిగ్ బాస్ బజ్ లోకి వస్తారు. లోపల మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి.. ఈ సీటు యమ హాటు” అంటూ అంబటి అర్జున్ చెప్పిన డైలాగులు బాగానే ఆకట్టుకుంటున్నాయి. చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ బజ్ కి ఒక సరైన హోస్ట్ దొరికాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంబటి అర్జున్ దెబ్బకు ఎవరు బలౌతారో అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. మరి.. బిగ్ బాస్ బజ్ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet