iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: నిఖిల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా.. పృథ్వీ మాటలకు అర్థం ఏంటి?

Bigg Boss Telugu 8- Prithvi Comments On Nikhil Game: పృథ్వీరాజ్ శెట్టి తన మిత్రుడు నిఖిల్ మలియక్కల్ గేమ్ కి సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతను కావాలనే తన ఫ్రెండ్స్ ని నామినేట్ చేసి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

Bigg Boss Telugu 8- Prithvi Comments On Nikhil Game: పృథ్వీరాజ్ శెట్టి తన మిత్రుడు నిఖిల్ మలియక్కల్ గేమ్ కి సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతను కావాలనే తన ఫ్రెండ్స్ ని నామినేట్ చేసి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

Bigg Boss 8: నిఖిల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా.. పృథ్వీ మాటలకు అర్థం ఏంటి?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఇంకా రెండు వారాలు కూడా గడవలేదు. కానీ, డ్రామా మాత్రం నెక్ట్స్ లెవల్లో జరుగుతోంది. ఆట అయితే ఆసక్తిగానే సాగుతోంది. ముఖ్యంగా హౌస్ లో ఇప్పటికే గ్రూపులు, టీములు ఫామ్ అయిపోయాయి. ఎవరికి నచ్చిన వారితో వాళ్లు మాట్లాడుకుంటున్నారు, స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు. అయితే ఇక్కడ మంచిగా కనిపిస్తూనే ముంచేసే వాళ్లు కూడా ఉంటారు. వాళ్లు చెప్పే మాటలు చాలా సాధారణంగా కనిపించవచ్చు. కానీ, అవి అవతలి కంటెస్టెంట్ పై చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అలాగే ఫ్రెండ్ అనుకున్న పృథ్వీరాజ్ శెట్టి ఇప్పుడు నిఖిల్ పై అలాంటి వ్యాఖ్యలు చేశాడు. నిఖిల్ ఒక సేఫ్ గేమర్ అనే ధోరణిలో అతని మాటలు సాగాయి. నిఖిల్ ఉద్దేశం తెలుసుకోకుండానే అతను అలాంటి కామెంట్స్ చేశాడు. వాటికి సోనియా వంత పాడింది.

నిఖిల్ మలియక్కల్ హౌస్ లో ఉన్న వారిలో చాలా స్ట్రాంగ్ ప్లేయర్. అయితే అతను ఏం చేసినా కూడా దానిని జడ్జ్ చేయడం, అతను చేసిన పనులకు ట్యాగులు ఇవ్వడంతో అతను కాస్త నెమ్మదించాడు. అతను ఏం చెప్పాలి అనుకున్నా.. ఎలా ఆడాలి అనుకున్నా ఆస్కారం లేకుండా చేస్తున్నారు. ఫ్రెండ్స్, సపోర్టర్స్ అనుకున్న వాళ్లే నిఖిల్ ని ముంచేస్తున్నారు. ఇప్పటి వరకు సోనియా ఆకుల ఆ విషయంలో ముందుంది. ఇప్పుడు పృథ్వీ కూడా ఆ దారిలోకే వచ్చినట్లు కనిపించాడు. ఎందుకంటే మంగళవారం జరిగిన నామినేషన్స్ లో నిఖిల్ చేసిన పనిని పృథ్వీ తప్పుగా ప్రొజెక్ట్ అయ్యేలా కామెంట్స్ చేశాడు. నిఖిల్ కావాలనే తన ఫ్రెండ్స్ ని నామినేట్ చేశాడు అనేలా అతని మాటలు ఉన్నాయి.

మంగళవారం జరిగిన నామినేషన్స్ లో నిఖిల్ మలియక్కల్ తన ఇద్దరు ఫ్రెండ్స్ ప్రేరణ- పృథ్వీరాజ్ లను నామినేట్ చేశాడు. అందుకు తగిన కారణాలు కూడా చెప్పాడు. ప్రేరణ తను ఇండివిడ్యూవల్ గా లేదని.. ప్రతి చిన్న విషయానికి వేరే వాళ్లపై ఆధారపడుతోందని.. తనకు క్లారిటీ లేకనే అలా చేస్తోంది అంటూ చెప్పాడు. అందుకు ఉదాహరణగా తనను రెండుసార్లు ఒపీనియన్ అడగటాన్ని కోట్ చేశాడు. అందుకు ప్రేరణ కాస్త సీరియస్ అయ్యింది అలా ఎలా చెప్తావ్ అంటూ అరిచేసింది. ఇంక పృథ్వీరాజ్ విషయంలో ఇన్వాల్వ్ కావడం లేదు. పనులు తప్పించుకుంటున్నావ్ అంటూ నిఖిల్ కామెంట్స్ చేశాడు. అందుకు పృథ్వీ రియాక్ట్ అయ్యాడు. నేను అన్నీ పనులు చేశాను అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.

అక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే సోనియా తెర వెనుక అసలు ఆటను నడిపిస్తూ కనిపించింది. నిఖిల్ కావాలనే మీ ఇద్దరినీ నామినేట్ చేశాడు అని చెప్పింది. నువ్వు ఒకసారి నిఖిల్ తో మాట్లాడు అని కూడా సలహా ఇచ్చింది. తర్వాత రోజు ఉదయం పృథ్వీ- సోనియా కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. మాట్లాడావా నిఖిల్ తో అని సోనియా అంటుంది. అప్పుడు పృథ్వీ మాట్లాడాను. ఫ్లిప్ అయిపోయాను.. పాయింట్స్ ఏం దొరకట్లేదు నాకు.. సారీ అని చెప్పాడు అంటూ పృథ్వీ అంటాడు. అంతేకాకుండా.. తనకు అర్థమైనదాని ప్రకారం నిఖిల్ కావాలనే ఫ్రెండ్స్ ని నామినేట్ చేశాడు అంటూ అభిప్రాయపడ్డాడు. ఫ్రెండ్స్ కాకుండా వేరే వాళ్లని నామినేట్ చేస్తే వాళ్ల ముందు బ్యాడ్ అవుతాడు.. టార్గెట్ అవుతాడు అనే భయంతో ఫ్రెండ్స్ ని నామినేట్ చేశాడు అన్నట్లుగా పృథ్వీ కామెంట్స్ ఉన్నాయి. నిజంగా నిఖిల్ ని వీళ్లు ఫ్రెండ్ లా చూస్తే ఇలాంటి మాటలు అనరు అనే చెప్పాలి. ఎందుకంటే నిఖిల్ కి ఇప్పటికే వీక్ ప్లేయర్ అని ట్యాగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేసి ఆడియన్స్ లో మరింత వీక్ చేయాలి అని చూస్తున్నారు అని అర్థమవుతోంది. మరి.. పృథ్వీ మాటలు మీకు ఎలా అర్థమయ్యాయి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.