iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: అభయ్ కి రెడ్ కార్డ్.. ఆదివారం కాదు- శనివారమే గెంటేస్తున్నారు!

  • Published Sep 21, 2024 | 5:18 PM Updated Updated Sep 21, 2024 | 5:29 PM

Bigg Boss 8 Telugu- Red Card To Abhay: అభయ్ విషయంలో నాగార్జున ఎలా రియాక్ట్ అవుతాడు అనే ప్రశ్న అందరిలో ఉంది. అలాగే ఏం అంటాడు అనే ఆసక్తి కూడా ఉంది. అందరూ ఊహించిన విధంగానే అభయ్ విషయంలో హోస్ట్ నాగార్జున నిప్పులు చెరిగేశాడు.

Bigg Boss 8 Telugu- Red Card To Abhay: అభయ్ విషయంలో నాగార్జున ఎలా రియాక్ట్ అవుతాడు అనే ప్రశ్న అందరిలో ఉంది. అలాగే ఏం అంటాడు అనే ఆసక్తి కూడా ఉంది. అందరూ ఊహించిన విధంగానే అభయ్ విషయంలో హోస్ట్ నాగార్జున నిప్పులు చెరిగేశాడు.

  • Published Sep 21, 2024 | 5:18 PMUpdated Sep 21, 2024 | 5:29 PM
Bigg Boss 8: అభయ్ కి రెడ్ కార్డ్.. ఆదివారం కాదు- శనివారమే గెంటేస్తున్నారు!

బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన శనివారం ప్రోమో కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఎవ్రీ వీక్ వేరు.. ఈ వీక్ వేరు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున ఏం ప్రశ్నలు అడుగుతారు? ఎవరిని ఎలా ట్రీట్ చేస్తారు అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అభయ్ విషయంలో ఆడియన్స్ లో ఆసక్తి రెట్టింపు అయ్యింది. అందుకు కారణం.. బిగ్ బాస్ మీద అభయ్ చేసిన సీరియస్ కామెంట్సే. వాటిపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతాడు అనే దానిపై అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. బిగ్ బాస్ ప్రోమో కూడా వచ్చింది. ఆ ప్రోమోలో అందరూ అనుకున్నట్లుగానే హోస్ట్ అభయ్ కి గట్టి క్లాస్ పీకాడు. అంతేకాకుండా.. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి ఆదేశాలు కూడా జారీ చేశాడు.

హౌస్ లో ఎవరు బిగ్ బాస్ గురించి తప్పుగా మాట్లాడినా అస్సలు ఊరుకోరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది అభయ్ అదే పనిగా బిగ్ బాస్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. ఆడియన్స్ కి కూడా కాస్త లిమిట్ దాటుతున్నాడు అనే భావన కలిగింది. ముఖ్యంగా గత రెండ్రోజులుగా ఆ మాటలు హద్దులు దాటేశాయి. లఫంగి గేమ్ అని.. బిగ్ బాస్ బయాస్డ్ అంటూ చాలానే మాటలు అన్నాడు. అంతేకాకుండా.. ఆ మాటలు తనవి పెట్టి ఇంకొకరి ముఖం పెట్టద్దు అంటూ బిగ్ బాస్ కి సజీషన్ కూడా ఇస్తున్నాడు. లఫంగి ఎడిట్స్ చేయద్దు అంటూ సలహా ఇచ్చాడు. వీటికి సంబంధించి ఇప్పటికే బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అలాగే అభయ్ కి రెడ్ కార్డు కూడా ఇస్తున్నట్లు వెల్లడించాడు.

హోస్ట్ నాగార్జున రావడమే ఎంతో సీరియస్ గా వచ్చాడు. బలూన్స్ టాస్క్ లో వాడిన స్టిక్ ని తీసుకుని వచ్చాడు. రావడం రావడమే అభయ్ మీద సీరియస్ అయినట్లు కనిపించింది. అతను అన్న మాటలు మొత్తం ఒక వీడియోగా తయారు చేసి ప్లే చేసినట్లు చూపించారు. అంతేకాకుండా.. నీ ముఖమే పెట్టారు. నువ్వు చెప్పిన లఫంగీ మాటలే అంటూ నాగార్జున ఫైర్ అయిపోయాడు. దెబ్బకు అభయ్ మోకాళ్ల మీదకు వచ్చేశాడు. ఈ ఒక్కసారికి తప్పు అయిపోయింది.. క్షమించండి అంటూ వేడుకున్నాడు. ఆ మాటలు తప్పితే తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పాడు. అయితే నాగార్జున మాత్రం తన డెసిషన్ ఫైనల్ అంటూ చెప్పుకొచ్చాడు.

అభయ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపో అంటూ సీరియస్ అయ్యాడు. అయితే కచ్చితంగా హౌస్ నుంచి పంపిస్తారా అంటే శనివారం పంపరు అనే చెప్పాలి. కానీ, ఆదివారం మాత్రం అభయ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తే మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఈ వీక్ అభయ్ డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. మరి.. అభయ్ విషయంలో రెడ్ కార్డ్ ఇవ్వడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom