iDreamPost
android-app
ios-app

Abhay Naveen: ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. అభయ్ బయటకు రావాల్సిందే?

  • Published Sep 21, 2024 | 1:23 PM Updated Updated Sep 21, 2024 | 1:23 PM

Bigg Boss 8 Telugu- Is Abhay Naveen Elimination Possible: బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పటి వరకు చాలానే సార్లు డోర్స్ ఓపెన్ చేసి బయటకు వెళ్లండి అన్నారు. కానీ, ఈసారి మాత్రం బిగ్ బాస్ కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడే వాళ్లు హౌస్ లో ఉండాల్సిన అవసరం లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

Bigg Boss 8 Telugu- Is Abhay Naveen Elimination Possible: బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పటి వరకు చాలానే సార్లు డోర్స్ ఓపెన్ చేసి బయటకు వెళ్లండి అన్నారు. కానీ, ఈసారి మాత్రం బిగ్ బాస్ కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడే వాళ్లు హౌస్ లో ఉండాల్సిన అవసరం లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

  • Published Sep 21, 2024 | 1:23 PMUpdated Sep 21, 2024 | 1:23 PM
Abhay Naveen: ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. అభయ్ బయటకు రావాల్సిందే?

తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏది అనగానే అంతా టక్కున బిగ్ బాస్ అనేస్తారు. అయితే ఈ సీజన్ కి సంబంధించి ఇంకా అంత క్రేజ్ అయితే వచ్చినట్లు కనిపించడం లేదు. కానీ, రాబోయో రోజుల్లో షో కచ్చితంగా ఆసక్తిగా మారుతుంది అని అయితే అర్థమవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ అంటే హౌస్ మేట్స్ కచ్చితంగా పలు సందర్భాల్లో బిగ్ బాస్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే అది చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తుంది. కానీ, ఈ సీజన్ లో అభయ్ నవీన్ మాత్రం బిగ్ బాస్ మీద దారుణమైన ట్రోల్స్ చేస్తూ వచ్చాడు. అతని క్లాన్ కోసం చాలానే మాటలు అనేశాడు. ఒక్కో సందర్భంలో కాస్త లిమిట్ కూడా క్రాస్ అయ్యాడు అనిపించింది. ఇప్పుడు ఇది అభయ్ కి పెద్ద కష్టమే తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.

బిగ్ బాస్ కి సంబంధించి ఏ సీజన్ లో అయినా ఒక్కోసారి బిగ్ బాస్ పై కాస్త కోపం ప్రదర్శిస్తారు. అది సర్వ సాధారణం అని చెప్పాల్సిందే. కానీ, ఎందుకో అభయ్ మాత్రం కాస్త లైన్ క్రాస్ అయ్యాడు అని స్పష్టంగా కనిపించింది. అయితే అతని క్లాన్ సభ్యులు కూడా కాస్త అతడిని రెచ్చగొట్టినట్లు కనిపించింది. అభయ్ మాత్రం పలు సందర్భాల్లో బిగ్ బాస్ గురించి నోటికొచ్చింది మాట్లాడుతూనే ఉన్నాడు. బిగ్ బాస్ కాదు.. బయాస్డ్ బాస్ అని మార్చుకోవాలి అని హితవు కూడా పలికాడు. అలాగే తిండి దగ్గర టాస్కులు ఏంటి? తిండి కూడా తిననివ్వకపోతే ఎలా అంటూ అభయ్ మాటలు ఉన్నాయి. అలాంటి మాటలు కట్ చేస్తారేమో? నేను బయటకు వెళ్లిన తర్వాత కూడా ఇంటర్వ్యూస్ లో అదే మాట చెప్తాను అంటూ చిన్న వార్నింగ్ కూడా ఇచ్చాడు. అందరూ ఈ విషయంపై బిగ్ బాస్ రియాక్ట్ అవుతాడో లేదో.. అని అంతా ఎదురు చూశారు.

హౌస్ లో అభయ్ అంటున్న మాటల మీద బిగ్ బాస్ అయితే రియాక్ట్ అయ్యాడు. అందరినీ బయటకు తీసుకెళ్లి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశాడు. హౌస్ లో ఎవరూ బిగ్ బాస్ కంటే ఎక్కువ కాదు అనే విషయాన్ని స్పష్టం చేశాడు. ఎవరైనా బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే.. కచ్చితంగా హౌస్ నుంచి వెళ్లిపోండి అని డోర్స్ కూడా ఓపెన్ చేశాడు. అయితే ఎవరూ ఆ మాటలకు సంబంధించి రియాక్ట్ అవ్వలేదు. కానీ, సోనియా వెళ్లి సారీ చెప్పు అని అభయ్ కి చెబుతుంది. అంటే కామెంట్స్ చేసింది అభయ్ అని అందరికీ తెలిసేలా చేసింది. ఆ తర్వాత మళ్లీ బిగ్ బాస్ హౌస్ మేట్స్ విషయంలో రియాక్ట్ అయ్యాడు. హౌస్ లో చాలామంది బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నారు. ఏం చేసినా.. ఏ రూల్ పెట్టినా అందులో ఎలాంటి బయాస్ అనేది ఉండదు అని క్లారిటీ ఇచ్చాడు. తక్కువ ఎగ్స్ కలెక్ట్ చేసినందుకు అభయ్ ని చీఫ్ గా తొలగించారు. అలాగే వారి టీమ్ నుంచి ముగ్గురుకి ఛాన్స్ ఇస్తానని చెప్పిన బిగ్ బాస్ అతని మాటలకు సంబంధించి ఆ అవకాశాన్ని తీసేశారు. కాంతారా క్లాన్ నుంచి ఎవరూ కంటెండర్స్ కారు అని క్లారిటీ ఇచ్చారు.

అభయ్ ఎలిమినేషన్?:

ఈ వారానికి సంబంధించి షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుంది అని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అందుకు అదనంగా అభయ్ పేరు బాగా వినిపించింది. ఇప్పుడు అభయ్ చేసిన పని అతనికే చేటు చేసేలా కనిపిస్తోంది. హౌస్ లో నుంచి అభయ్ బయటకు రావడం పక్కా అయిపోయింది అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అసలే డేంజర్ జోన్ లో ఉండటం.. ఆపై అభయ్ బిగ్ బాస్ షో గురించే నెగిటివ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. అభయ్ ని కొనసాగిస్తే.. బిగ్ బాస్ షోకి నెగిటివ్ అవుతుంది అని వాళ్లు భయపడే అవకాశం కూడా లేకపోలేదు. పైగా అభయ్ మొత్తం టీమ్ ని కూడా ధూషించాడు. వాళ్లు నిద్రపోతున్నారు అంటూ కామెంట్ చేశాడు. ఈ విషయంలో నాగార్జున కచ్చితంగా క్లాస్ తీసుకుంటాడు అనడంలో సందేహం లేదు. అంతేకాకుండా.. ఎలిమినేషన్ రూపంలో పనిష్మెంట్ కూడా ఇస్తారు అంటున్నారు. మరి.. అభయ్ నవీన్ ఈ వారం ఎలిమినేట్ అవుతాడు అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio