iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యే ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే..?

  • Published Sep 08, 2024 | 1:14 PM Updated Updated Sep 08, 2024 | 9:32 PM

Big Boss 8: ఇక్కడ కమిటైతే లిమిటే లేదు అంటూ స్టార్టైంది బిగ్ బాస్ 8. సెప్టెంబర్ 1 నుండి మొదలైన ఈ రియాలిటీ షోలో తొలి వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఈ వారం హౌస్ నుండి వెళ్లిపోయేది ఎవరంటే..?

Big Boss 8: ఇక్కడ కమిటైతే లిమిటే లేదు అంటూ స్టార్టైంది బిగ్ బాస్ 8. సెప్టెంబర్ 1 నుండి మొదలైన ఈ రియాలిటీ షోలో తొలి వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఈ వారం హౌస్ నుండి వెళ్లిపోయేది ఎవరంటే..?

  • Published Sep 08, 2024 | 1:14 PMUpdated Sep 08, 2024 | 9:32 PM
బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యే ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే..?

బుల్లితెరపై ఎంటర్ టైన్ చేస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటి వరకు ఏడు సీజన్ల పూర్తి చేసుకున్న ఈ షో.. సీజన్ 8 సెప్టెంబర్ 1న అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 14 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి వచ్చారు. ఈ సీజన్లలో కంటెస్టెంట్లను చూసి ఎవర్రా వీరంతా అంటున్నారు నెటిజన్లు. విష్ణు ప్రియ, శేఖర్ భాష( ఈ మధ్య రాజ్ తరుణ్ వివాదంలో కనిపించడంతో బాగా రిజిస్టర్ అయ్యాడు), ఆదిత్య ఓం (ఇప్పటి తరానికి తెలియని నటుడు) మిగిలిన వారంతా కొత్త మొహల్లాగే కనిపిస్తున్నాయి. వంద రోజుల పాటు సాగిపోయే ఈ ఆటలో అప్పుడే గొడవలు మొదలయ్యాయి.

టాస్కులు, గొడవలతో, ఏడుపులు, పెడ బొబ్బులతో ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరీ స్కెచ్ వాళ్లు గీసుకుని హౌస్‌లోకి అడుగుపెట్టినట్లు కనిపిస్తున్నారు కంటెస్టెంట్స్. ఒకసారి కమిటైతే.. లిమిటే లేదు అంటూ తీసుకు వచ్చిన సీజన్ తొలి వారం గడిచిపోయింది. గతంలా ఒక కెప్టెన్స్ కాకుండా ముగ్గురు చీఫ్స్‌ను తీసుకు వచ్చారు. వీరికి క్లాన్స్ (గ్రూప్)ను ఏర్పాటు చేసి ఇంటి సభ్యులకు ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చారు. నైనిక, యశ్మీకి సమానంగా సభ్యులు రావడంతో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. చివరకు గెలిచిన యశ్మీ టీం తక్కువ క్లాన్ ఉన్న నిఖిల్ నుండి ఓ సభ్యురాలు సోనియాను తీసుకుంది. అలాగే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా హాట్ హాట్‌గా కొనసాగింది.

మొదటి వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. శేఖర్ భాషా, సోనియా,  నాగ మణికంఠ, విష్ణు ప్రియ, బెజవాడ బేబక్క, పృథ్వీశెట్టి నామినేట్ అయ్యారు. నామినేషన్స్ ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యాయి. ఇక శనివారం హోస్ట్ నాగార్జున వచ్చి ఓ టాస్క్ ఇచ్చాడు. కొన్ని కత్తులు పెట్టి.. ఎవరు ఎలాంటి కత్తో చెప్పండి అంటూ టాస్క్ ఇచ్చారు. అలాగే ఈ వారంలో ప్లాప్ అయిన కంటెస్టెంట్స్ ఎవరో కూడా ప్రస్తావించి.. ఇలా ఉండొద్దని హితవు పలికారు. ఇదిలా ఉంటే.. ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లలతో సోనియా ఆకుల ఎలిమినేషన్ నుండి తప్పించుకుని సేఫ్ అయ్యింది. మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్స్ అన్ సేఫ్ అని ప్రకటించాడు నాగార్జున.

ఇదిలా ఉంటే.. లీకు వీరుల చెబుతున్న ప్రకారం.. తొలి వారంలో ఓ మహిళా కంటెస్టెంట్ బయటకు రాబోతుందని సమాచారం. బెజవాడ బేబక్క ఇంట్లో నుండి వెళ్లిపోతుందని తెలుస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా అడుగుపెట్టిన బేబక్క అలియాస్ మధు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందట. బేబక్కకు ఓట్లు తక్కువ పడినట్లు తెలుస్తోంది. మిగిలిన ఎలిమినేట్ అయిన కాస్తంత ఫెమిలియర్ ఫెసెస్ కావడంతో, ఫ్యాన్ బేసి ఉండటంతో వారంతా సేఫ్ అయినట్లు తెలుస్తుంది. బేబక్క ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గర ఆట కన్నా.. వంట విషయంలో కంప్లయింట్లతోనే ఎక్కువగా ఫోకస్ అయ్యింది. దీంతో ఆమెను తక్కువ ఓట్లు పడ్డట్లు సమాచారం. చూడాలి ఎవరు ఇంట్లో నుండి వచ్చేస్తారో.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio