iDreamPost
android-app
ios-app

Shekar Basha: RJ శేఖర్ బాషా ఎలిమినేషన్..5 ప్రధాన కారణాలు ఇవే!

Shekar Basha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రెండో వారం ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది. ఆర్జే శేఖర్ బాషా హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఆయన ఎలిమినేషన్ కి ఐదు ప్రధాన కారణాలు వినిపిస్తోన్నాయి.

Shekar Basha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రెండో వారం ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది. ఆర్జే శేఖర్ బాషా హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఆయన ఎలిమినేషన్ కి ఐదు ప్రధాన కారణాలు వినిపిస్తోన్నాయి.

Shekar Basha: RJ శేఖర్ బాషా ఎలిమినేషన్..5 ప్రధాన కారణాలు ఇవే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేకపోతున్నరు. గత సీజన్లకు భిన్నంగా..అనేక ట్విస్టులతో  బిగ్ బాస్ షో సాగుతోంది. మన ఊహలకు అందినట్లే అంది.. సడెన్ గా బిగ్ బాస్ ట్విస్టులు ఇస్తున్నాడు. తొలివారం బేజవాడ బేబక్క ఎలిమినేట్ అవుతుందనే చాలా మంది భావించారు. అందుకు తగ్గట్లే  ఫస్ట్ వీక్ లో ఆమె ఎలిమినేట్ అయ్యింది. కానీ రెండో వారంలో ఆర్జే శేఖర్ బాషా ఎలిమినేట్ అవుతారని ఎవ్వరూ ఊహించలేదు. అయితే అదే జరిగింది. అయితే ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా శేఖర్ బాషా ఎలిమినేట్ అవ్వడం అందరినీ షాకి గురి చేసింది. అయితే శేఖర్ బాషా ఎలిమినేట్ కావడాని ఐదు ప్రధాన కారణాలు వినిపిస్తోన్నాయి. మరి..ఆ కారణాలు ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

1.ఫోకస్ లేకపోవడం:

బిగ్ బాస్ తెలుగు సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఆర్జే శేఖర్ బాషా హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే అందరికి అంచనాలకు తగ్గట్లు ఆయన  జర్నీ సాగాలేదని చాలా మంది అభిప్రాయపడుతున్నరు.  హౌస్ లో శేఖర్ బాషా ఫోకస్ గా కనిపించలేదని అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి. అందుకు కారణంగా కూడా అతడు హౌస్ లోకి వచ్చే సమయానికి ఆయన భార్యా ప్రెగ్నెంట్ గా ఉండటం. ఆమె, ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించాడం వంటి కారణాలతో హౌస్ లో  ఫోకస్ లేడని పలువురు చెబుతున్నారు. తొలివారం నుంచి శేఖర్ బాషా ఆట చూస్తే.. ఫోకస్ గా లేడనే విషయం అర్థమవుతుంది. శేఖర్ బాషా ఎలిమినేషన్ కి ఇది ఒక కారణమనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి.

2. ఇన్వాల్మెంట్:

ఇక శేఖర్ ఎలిమినేట్ అవ్వడానికి రెండో కారణం ఇన్వాల్మెంట్. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శేఖర్ బాషా రెండు వారాలు ఎందులోనూ ఎక్కువగా ఇన్వాల్ కాలేదు. కేవలం తనకు ఇచ్చిన పనులను మాత్రమే చేస్తూ ఉన్నాడు. ఇతర విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోలేదు. తోటి కంటెస్టెంట్స్ సంబంధించిన పలు విషయాల్లో ఎక్కడా ఇన్వాల్వ్  కాలేదు. హౌస్ మెట్స్ నామినేషన్ చేసే సమయంలో ఇదే విషయాన్ని ఎక్కువ మంది ప్రస్తావించారు. అలా శేఖర్ బాషా ఎలిమినేషన్ కి ఇది కూడా ఓ  ప్రధాన కారణం.

3.రూల్స్ బ్రేక్ చేయడం:

హౌస్ లో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో  శేఖర్ భాషా పెట్టిన పలు రూల్స్ ను బ్రేక్ చేశాడు. అది టాస్క్ ల విషయంలోనూ, పుడ్ వంటి ఇతర విషయాల్లోనూ బాషా రూల్స్ ను బ్రేక్ చేశాడు. ఇలా హౌస్ లోకి వచ్చిన తొలి వారంలోనే చేశాడు. హౌస్ లో నామినేషన్ సందర్భంలో ఆదిత్య ఓం..శేఖర్ బాషా పై ఇదే పాయింట్ ను ప్రస్తావించారు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రెండు వారాలు శేఖర్ బాషా నిబంధనలు అతిక్రమించాడు. ఇలా రూల్స్ బ్రేక్ చేయడం కూడా ఆయన ఎలిమినేషన్ కి ప్రధాన కారణాల్లో ఒకటిని పలువురు అభిప్రాయా పడుతున్నరు.

4. ఫిజికల్ టాస్క్:

ఇక బిగ్ బాస్ ఇచ్చే ఫిజికల్ టాస్క్ లో శేఖర్ బాషా ఆశించి స్థాయిలో ప్రదర్శనలు చేయలేదనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి. మరి..శారీరకంగా ఫిట్ గా లేడో, లేదా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయో తెలియదు. కానీ ఫిజికల్ టాస్క్ లో ఎక్కడ అగ్రెసీవ్ గా శేఖర్ బాషా ఫర్మమెన్స్ ఇవ్వలేదు. ఇలా ఫిజికల్ టాస్క్ లో యాక్టీవ్ గాలేకపోవడం కూడా ఆయన ఎలిమినేషన్ కి మరో కారణమనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి.

5.వారసుడు రావడం:

ఇక శేఖర్ బాషా ఎలిమినేట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఆయనకు వారసుడు రావడం. రెండు రోజుల క్రితం శేఖర్ బాషా భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని నాగార్జున మొన్న శేఖర్ బాషాకు తెలిపారు. ఇక ఆదివారం జరిగిన నామినేషన్స్ లో తోటి హౌస్ మెంట్స్ అందరూ ఇదే రీజన్ తో శేఖర్ బాషాను బయటకు పంపారు. అయితే అది అఫిషియల్ రీజన్ కాదు. బయటి కారణాలతో పంపవద్దు అని నాగార్జున కండిషన్ పెట్టాడు. దీంతో బాబు పుట్టాడు అనే రీజన్ చెప్పకుండా.. వివిధ కారణాలు చెప్పి..శేఖర్ బాషాను ఎక్కువ మంది బయటకు పంపేందుకు నామినేట్ చేశారు. శేఖర్ బాషా ఎలిమినేషన్ కి అసలు కారణం ఇదే అనే చాలా మంది అభిప్రాయా పడుతున్నారు.  మరి.. శేఖర్ బాషా ఎలిమినేట్ కావడానకి..ఇవి కాకుండే మరేమైనా కారణాలు ఉన్నాయా?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.