Krishna Kowshik
స్మాల్ స్క్రీన్ లో ఎంటర్ టైన్ మెంట్ షో అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది బిగ్ బాస్. ప్రేక్షకులు ఈ రియాలిటీ షో కోసం ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. తాజాగా ఇద్దరు భార్యలతో బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టాడు ఓ కంటెస్టెంట్.
స్మాల్ స్క్రీన్ లో ఎంటర్ టైన్ మెంట్ షో అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది బిగ్ బాస్. ప్రేక్షకులు ఈ రియాలిటీ షో కోసం ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. తాజాగా ఇద్దరు భార్యలతో బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టాడు ఓ కంటెస్టెంట్.
Krishna Kowshik
సీరియల్స్, సినిమాలతో విసిగిపోయిన టీవీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్. విదేశాల నుండి వచ్చిన ఈ షో ఇండియాలో విశేషమైన ఆదరణ చూరగొంటుంది. హిందీతో పాటు పలు భాషల్లో ఈ షో నడుస్తోంది. కన్నడ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ, మలయాళంతో సహా పలు భాషల్లో ఏడు భాషల్లో ప్రసారం అవుతుంది. ఇక హిందీలో ఇప్పటికే 17 సీజన్లు పూర్తవ్వగా.. ఓటీటీలో కూడా సందడి చేస్తుంది. ఇప్పటికే రెండు సీజన్లు ముగిశాయి. ఇప్పుడు మూడో సీజన్ స్టార్ట్ అయ్యింది. అనిల్ కపూర్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఇన్ష్లుయెన్సర్స్‌ను ఈ షోకు తీసుకు వచ్చారు. వారిలో ఒకరు ఆర్మాన్ మాలిక్. ఇతడు రెండు పెళ్లిళ్లు చేసుకుని.. ఆ ఇద్దరితో కలిసి జీవిస్తున్నాడు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.
ఇప్పుడు ఈ ఇద్దరితో కలిసి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు ఆర్మాన్ . దీంతో ఈ ముగ్గురిపై విమర్శలు మొదలయ్యాయి. ఇది బిగ్ బాస్ షోలా లేదని మండిపడుతున్నారు నెటిజన్లు. వీరితో పాటు సెలబ్రిటీ సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్మాన్ తన భార్యలతో బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టడంపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ దేవోలినా భట్టాచార్జీ తీవ్రంగా స్పందించింది. ‘దీన్ని వినోదం అంటారా..? ఇదొక చెత్త. చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఇది రీల్ కాదు.. రియాల్టీ షో. తేలికగా తీసుకుని తప్పు చేయొద్దు. బిగ్ బాస్ మీకు ఏమైంది? బహు భార్యత్వాన్ని ప్రమోట్ చేస్తున్నారా..? ఇలాంటి కంటెస్టెంట్స్ పరిచయం చేసినప్పుడు ఆలోచించలేదా..? ఈ షోను చిన్నారుల నుండి వృద్దుల వరకు వీక్షిస్తున్నారు. మీరు కొత్త తరానికి ఏమీ నేర్పించాలనుకుంటున్నారు? ’ అంటూ సుదీర్ఘంగా ప్రశ్నలు సంధించింది.
‘2,3 లేదా 4 వివాహాలు చేసుకోవచచ్చునని చెబుతున్నారా..? అందరు కలిసి సంతోషంగా జీవించగలరా..? బహు భార్యత్వం కారణంగా దుర్భర జీవితాన్ని గడుపుతున్న వారిని వెళ్లి ప్రశ్నించండి తెలుస్తుంది బాధ. అందుకే ప్రత్యేక వివాహ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్ తప్పని సరి చేయాలని. చట్టం అందరికీ ఒకటే. అప్పుడే ఈ సమాజం ఇలాంటి వాటి నుండి విముక్తి పొందుతుంది. మొదటి భార్య ఉండగా.. రెండో భార్యనా..? ఒక వేళ భార్యకు కూడా ఇద్దరు భర్తలు ఉంటే.. చూస్తూ కాలక్షేపం చేస్తారా..? ఇలాంటి వారిని ఎందుకు ఫాలో అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీ మనస్సు సరిగ్గా ఆలోచిస్తుందా..? లేకపోతే చికిత్స చేయించుకోండి. కొత్త తరానికి బహుళ వివాహాలు చేసుకోవచ్చునని నేర్పిస్తున్నారా..? 2-3 పెళ్లిళ్లు అవసరం అనుకుంటే ఇంట్లోనే ఉండండి. మీ నీచమైన మనస్తత్వాన్ని ప్రపంచానికి చాటకండి. సమాజంగా మనం విధ్వంసం వైపు వెళ్తున్నాం. ప్రజల్ని నిజంగా పిచ్చోళ్లను చేస్తున్నారు. బిగ్ బాస్ మీకేమందీ’ అంటూ ప్రశ్నించింది దేవోలినా.