Krishna Kowshik
చివరి వరకు రసవత్తరంగా, ఉత్కంఠగా సాగిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 ఈ ఆదివారంతో తెరపడింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అయితే చివరి వరకు ముగ్గురు మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్. వీరిలో ఒకరు కప్ గెలుస్తారని అనుకున్నారు. అయితే..
చివరి వరకు రసవత్తరంగా, ఉత్కంఠగా సాగిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 ఈ ఆదివారంతో తెరపడింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అయితే చివరి వరకు ముగ్గురు మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్. వీరిలో ఒకరు కప్ గెలుస్తారని అనుకున్నారు. అయితే..
Krishna Kowshik
105 రోజులు, 19 మంది కంటెస్టెంట్స్‌తో సాగిపోయిన ది బిగ్గెస్ట్ రియాలిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ షో బిగ్ బాస్ సీజన్ 7 డిసెంబర్ 17తో తెరపడింది. ఉత్కంఠ పోరు మధ్య రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. ఈ సీజన్ ప్రారంభంలోనే ఉల్టా పుల్టా అంటూ, కొత్తగా ఉండబోతోందంటూ ప్రకటించింది బిగ్ బాస్ టీం. తొలుత 14 మంది కంటెస్టెంట్లను హౌజ్‌లోకి ప్రవేశపెట్టి.. ఆ తర్వాత ఐదుగురు ఎలిమినేట్ అయ్యాక.. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఐదుగుర్ని ఇంట్లోకి తీసుకు వచ్చింది. ఆ తర్వాత రతికా రోజ్ ఎలిమినేషన్, రీ ఎంట్రీ ఇలాంటివి చోటుచేసుకున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సారి కంటెస్టెంట్లు ఎవరికి వారే సత్తా చాటారు.
గత సీజన్లలో కొన్ని ఎపిసోడ్లకే విన్నర్ ఎవరన్న క్లారిటీ ఉండేది. కానీ బిగ్ బాస్ సీజన్‌లో చివరి వరకు ఎవరు విన్నర్ అనేది తేలనేలేదు. అలాగే ఈ 7 సీజన్‌లో టాప్ కంటెస్టెంట్లుగా ఆరుగురు మిగిలారు. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ, అర్జున్, ప్రియాంక జైన్, యావర్. అయితే తీవ్రమైన పోటీ ఉంది మాత్రం ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్‌ల మధ్యే. వీరే టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని అనుకున్నారు. కాసేపు శివాజీ అని, మరికాసేపు పల్లవి ప్రశాంత్ విన్నర్ అంటూ వార్తలు వచ్చాయి. చివరకు శివాజీ థర్డ్ ప్లేసులో సరిపెట్టుకున్నారు. అమర్ దీప్ రన్నరప్ కాగా, పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. శివాజీ సెకండ్ ప్లేసులోనైనా ఉంటారని అనుకున్నారు కానీ థర్డ్ ప్లేసుకు పరిమితమయ్యారు.
కాగా, బిగ్ బాస్ బజ్‌లో భాగంగా శివాజీని ఇంటర్వ్యూ చేసింది బిగ్ బాస్ 6 కంటెస్టెంట్, యాంకర్ గీతూ రాయల్. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. అందులో ఈ బిగ్ బాస్ విన్నర్ తానే అంటూ వ్యాఖ్యలు చేసి షాకిచ్చాడు శివాజీ. ద మాస్టర్ మైండ్ ఆఫ్ ద హౌజ్ శివాజీ అంటూ ఇన్వైట్ చేసిన గీతూ.. తన దైన స్టైల్లో ప్రశ్నలు సంధించింది. ఆ ప్రోమోలో ఏముందంటే.. ‘ఎక్స్ పర్ట్ చేశారా.. టాప్ 3 వరకు వస్తాను నేను’ అని శివాజీని ప్రశ్నించింది గీతూ. ‘ టాప్ 3 ఏంటీ. ఈ సీజన్ విన్నర్ నేనే. నాకు తెలుసు.’ అంటూ సమాధానమిచ్చారు. విన్నర్ అని తెలుసు కదా.. టాప్ 3లో ఆగిపోవడానికి కారణాలేమయ్యి ఉంటాయని అడగ్గా.. ’ఓ పల్లెటూరి నుండి వచ్చి ఇక్కడ ఆడుతుంటే.. ఆడనివ్వకుండా చేయాలన్న మొదటి రోజు సంకల్పం నుండి నేను అడ్డంపడ్డా’ అంటూ పల్లవి ప్రశాంత్ గురించి చెప్పారు.
‘సో మీ వల్లే యావర్, పల్లవి ప్రశాంత్ ఇంత దూరం వచ్చారు అని మీరు అనుకుంటున్నారా’ అన్న ప్రశ్నకు.. కాకపోతే వాళ్ల వెనుక ఒక శక్తి ఉందని తెలియజేశా అంటూ శివాజీ సమాధానమిచ్చారు. అమర్‌ను కావాలనే డే 1 నుండి టార్గెట్ చేశారని ఆడియెన్స్ కు అనిపించిందని గీతూ అనగానే.. ‘నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా.. అమర్, నేను వెరీ గుడ్ ఫ్రెండ్’ అంటూ సమాధామనిచ్చారు. అమర్ కెప్టెన్ కాకుండా.. ఎందుకు అడ్డుకున్నారన్న ప్రశ్న కూడా సంధించింది గీతూ. శివాజీ బిగ్ బాస్ హౌస్‌కు ఎందుకు వచ్చారు అన్న ప్రశ్నకు.. తన మార్క్ చూపిద్దామని అంటూ ఆన్సర్ ఇచ్చారు. మధ్యలో గీతూ మీద ఫైర్ కూడా అయ్యారండోయ్. ఆ ప్రోమో ఈ వీడియోలో చూడండి. మీరు కూడా శివాజీ విన్నర్ అని భావించినట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.