iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Pallavi Prasanth: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు హరీష్ రావు అభినందనలు

  • Published Dec 18, 2023 | 1:06 PM Updated Updated Dec 18, 2023 | 1:06 PM

సామాన్య రైతు కుటుంబం నుంచి బిగ్ బాస్ హౌజ్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడమే కాక విన్నర్ గా నిలిచి.. రికార్డు క్రియేట్ చేశాడు పల్లవి ప్రశాంత్. ఈ క్రమంలో ఎమ్మెల్యే హరీశ్ రావు తనకి అభినందనలు తెలిపారు. ఆ వివరాలు..

సామాన్య రైతు కుటుంబం నుంచి బిగ్ బాస్ హౌజ్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడమే కాక విన్నర్ గా నిలిచి.. రికార్డు క్రియేట్ చేశాడు పల్లవి ప్రశాంత్. ఈ క్రమంలో ఎమ్మెల్యే హరీశ్ రావు తనకి అభినందనలు తెలిపారు. ఆ వివరాలు..

  • Published Dec 18, 2023 | 1:06 PMUpdated Dec 18, 2023 | 1:06 PM
Bigg Boss 7 Pallavi Prasanth: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు హరీష్ రావు అభినందనలు

బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు రైతుబిడ్డ పల్లివి ప్రశాంత్. సామాన్య రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి.. సెలబ్రిటీలతో పోటీ పడుతూ.. టాస్క్ ల్లో మిగతా అందరికి గట్టి పోటీ ఇస్తూ.. విన్నర్ గా నిలిచాడు పల్లవి ప్రశాంత్. అసలు కామన్ మ్యాన్ కు బిగ్ బాస్ అవకాశం రావడమే గొప్ప.. వచ్చినా ఇన్నాళ్లు హౌజ్లో కొనసాగడం.. ఆఖరికి టైటిల్ విజేతగా నిలవడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచి పల్లవి ప్రశాంత్ సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మీద తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే బిగ్ బాస్ అవకాశం సంపాదించడమే కాక.. విన్నర్ గా నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ కి.. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అభినందనలు తెలిపారు. ఆ వివరాలు..

బిగ్ బాస్ – 7 విజేతగా నిలిచిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభినందనలు తెలిపారు. సిద్ధిపేటకు చెందిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేతగా నిలిచినందుకు గర్వంగా ఉందన్నారు. ‘పల్లవి ప్రశాంత్ అనే పేరు రైతు ఇంటిపేరుగా మారింది. ఈ సీజన్ లో ఈ పేరు.. సామాన్యుల ధృడత్వానికి ప్రతీకగా నిలిచింది. పొలాల నుంచి బిగ్ బాస్ హౌస్ వరకూ అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. వైవిధ్యానికి ప్రతీకగా నిలిచాడు’ అంటూ పల్లవి ప్రశాంత్ కు అభినందనలు తెలిపారు హరీశ్ రావు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.

Harish Rao congratulates Pallavi Prashanth

బిగ్ బాస్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ స్వస్థలం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామం. అతడి తండ్రి రైతు. డిగ్రీ వరకూ చదువుకున్న ప్రశాంత్ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించి తన రోటిన్ లైఫ్, చేసే పనుల గురించి వీడియోలు తీస్తూ దానిలో అప్లోడ్ చేసేవాడు. అలా మెల్లగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయ్యాడు. అప్పటివరకు తనకు ఉన్న యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్ అందరూ తన ఫాలోవర్స్‌గా మారారు. దీంతో 555కే ఫాలోవర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిపోయాడు. ‘అన్నా.. రైతుబిడ్డని అన్నా.. మళ్లొచ్చినా’ అంటూ వీడియో మొదలవ్వగానే తన ఫాలోవర్స్‌ను పలకరించేవాడు ప్రశాంత్. ఇదే డైలాగ్ తో ఫేమస్ అయిన రైతు బిడ్డ.. బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చినప్పుడల్లా ఈ డైలాగ్‌ను ఉపయోగించేవాడు.

బిగ్ బాస్‌పై రివ్యూలు ఇస్తూ.. వీడియోలు చేయడం మొదలుపెట్టిన పల్లవి ప్రశాంత్.. ఈ షోలో పాల్గొనడం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకు కూడా చాలాసార్లు వచ్చివెళ్లేవాడు. కానీ అవకాశం రాలేదు. బిగ్ బాస్ లోకి వెళ్లడం తన కల అంటూ.. అనేక సందర్బాల్లో వీడియోలో చెప్తూ.. కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. చివరకు బిగ్ బాస్ నిర్వహాకుల నుంచి తనకు ఫోన్ వచ్చింది. రైతు కుటుంబం నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్, సోషల్ మీడియాలో ‘రైతు బిడ్డ’గా ట్రెండ్ సృష్టించి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, బిగ్ బాస్ హౌస్ లో ప్రతి టాస్క్ లో బాగా ఆడుతూ.. అందరి మనసులు నిలిచి గెలిచాడు. రైతు బిడ్డ గా ఎంట్రీ ఇచ్చి..  బిగ్ బాస్ 7 విన్నర్ గా బయటకు వచ్చాడు.