iDreamPost
android-app
ios-app

గంటల ముందే షాకింగ్ లీక్.. బిగ్ బాస్-7 విన్నర్ గా శివాజీ!

  • Published Dec 16, 2023 | 1:24 PM Updated Updated Dec 16, 2023 | 1:24 PM

బిగ్ బాస్ సీజన్ 7కి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. డిసెంబర్ 17న టైటిల్ విజేత ఎవరో హోస్ట్ నాగార్జున ప్రకటించనున్నారు. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 7కి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. డిసెంబర్ 17న టైటిల్ విజేత ఎవరో హోస్ట్ నాగార్జున ప్రకటించనున్నారు. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.

  • Published Dec 16, 2023 | 1:24 PMUpdated Dec 16, 2023 | 1:24 PM
గంటల ముందే షాకింగ్ లీక్.. బిగ్ బాస్-7 విన్నర్ గా శివాజీ!

తెలుగు బుల్లితెరపై తిరుగులేని విధంగా దూసుకెళుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ 7 చివరి దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు టైటిల్ రేసులో పోటీ పడుతున్నారు. కానీ తీవ్ర పోటీ మాత్రం ముగ్గురి మధ్యే ఉంది. వాళ్లే నటుడు శివాజీ, మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, సీరియల్ నటుడు అమర్ దీప్. ఈ ముగ్గురి పేర్లే బలంగా వినిపించాయి. ఈ ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే‌లో హోస్ట్ నాగార్జున చేతులు పైకెత్తే విన్నర్ ఖరారు అయిపోయింది. గత సీజన్లలో కొన్ని ఎపిసోడ్లు ముగిశాక విన్నర్ ఎవ్వరో అనేది దాదాపుగా ఆడియెన్స్ ఊహాకు అందేసేది.

కానీ ఈ సీజన్ వచ్చే సరికి టైటిల్ రేసులో ఎవరికి వారే గట్టిపోటీ ఇస్తున్నారు, నిలుస్తున్నారు. ఉల్టా పల్టా అంటూ కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చింది బిగ్ బాస్ టీం. అనుకున్నట్లుగా వెరైటీగానే డిజైన్ చేశారు. ఐదుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయాక.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదుగుర్ని హౌస్‌లోకి తీసుకువచ్చారు. డబుల్ ఎలిమినేషన్.. అలాగే రతికా రీ ఎంట్రీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇక నామినేషన్లు, కెప్టెన్సీ టాస్కులో ఎవ్వరికీ వారే చెలరేగి ఆడారు. స్పా బ్యాచ్, స్పై బ్యాచ్‌గా రెండు టీమ్స్.. అసలైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాయి. ఇక గతవారం శోభా శెట్టి ఎలిమినేషన్‌తో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు మిగిలారు. పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి, శివాజీ, యావర్, అమర్ దీప్ మిగిలారు.

మధ్యలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకున్నారంతా. కానీ అవేమీ లేనట్లు తెలుస్తోంది. ఇక ఫైనల్ విన్నర్ కూడా దాదాపుగా ఖరారు అయ్యింది. అందరి ఊహాలకు అంది అందనట్లు ఉన్నా ఈ టైటిల్ విన్నర్ కొట్టింది మరెవ్వరో కాదూ బిగ్ బాస్ ఫిలాసఫర్ శివాజీనే అని తెలుస్తోంది. ఎలిమినేషన్ అయిన ప్రతిసారి ఇది స్క్రిప్డెడ్ షో అని విమర్శలు వచ్చినప్పటికీ.. టాప్ రేటింగ్‌లో దూసుకెళ్లిన ఈ షో ఈనెల 17వ తేదీతో ముగియనుంది. ఈ ఆదివారం నాగార్జున ప్రకటించే విన్నర్ మరోవ్వరో కాదూ నటుడు శివానీనే అని సమాచారం. తొలి నుండి ఆట కంటే మాటలతోనే ఎంటర్ టైన్ చేస్తున్న శివాజీకి ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తవ్వగా,  లీకు వీరులు ఈ వార్తను బయటకు ఊదేశారు. అయితే ఇప్పటి వరకు చాలా మంది పల్లవి ప్రశాంత్ టైటిల్ విజేత అవుతాడని భావించారు. కానీ అనూహ్యంగా బిగ్ బాస్ 7 టైటిల్ శివాజీని వరించిందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.  రైతు బిడ్డను అంటూ సామాన్యుడిగా ఇంట్లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ సీజన్ లో మంచి కంటెంట్ ఇచ్చాడు. టాస్కులు కానీ, నామినేషన్లలో కానీ తన ఫైర్  కనబర్చాడు. దీంతో అతడే  విజేత అవుతాడని ఊహించారు. కానీ  నటుడు శివాజీకి ఓట్లు ఎక్కువ పడ్డాయని, ఆ కారణంగా అతడే టైటిల్ విన్నర్ అని తెలుస్తోంది. మరీ ఈ ఎపిసోడ్ కోసం కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. మరీ బిగ్ బాస్ విన్నర్ శివాజీ అర్హుడని భావిస్తున్నారా.. మీరైతే టైటిల్ గెలిచేది ఎవరనుకున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom