iDreamPost
android-app
ios-app

Bigg Boss 7: వీడియో: హౌస్ లో వెక్కి వెక్కి ఏడ్చేసిన శోభాశెట్టి!

  • Published Sep 21, 2023 | 1:16 PM Updated Updated Sep 21, 2023 | 1:16 PM
  • Published Sep 21, 2023 | 1:16 PMUpdated Sep 21, 2023 | 1:16 PM
Bigg Boss 7: వీడియో: హౌస్ లో వెక్కి వెక్కి ఏడ్చేసిన శోభాశెట్టి!

బిగ్ బాస్ హౌస్ అంటేనే ఎమోషన్స్ ని బయటకు తీసే జాదూ ఘర్. ఎవరు ఎంతలా ప్లాన్ చేసి వచ్చినా.. వారిలో ఉన్న ట్రూ ఎమోషన్స్ ని బయటకు తీస్తారు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు ఈ హౌస్ లోకి వెళ్లాలి అంటే భయపడిపోతారు. కానీ, హౌస్ లోకి వెళ్లిన వారికి మాత్రం నేమ్, ఫేమ్ బాగానే వస్తాయి. వర్కౌట్ కాకపోతే నెగిటివిటీ కూడా అంతేలా వస్తుంది. అయితే అవకాశాలు మాత్రం దండిగా వస్తాయి. వాటిని వాడుకున్న తీరుని బట్టి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు శోభాశెట్టికి ఒక అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని వాడుకుని ఆమె మీద ఉన్న నెగిటివ్ ప్రచారాన్ని ఒక్కసారిగా పాజిటివ్ గా మార్చేసుకుంది.

18వ ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రేక్షకులు అంతా శోభాశెట్టి మీద గుర్రుగా ఉన్నారు. ఆమె రియల్ లైఫ్ లో కూడా మోనితాలా బిహేవ్ చేస్తోంది అంటున్నారు. నిజానికి మోనితా కంటే ఎక్కువ నెగిటివ్ గా కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. గౌతమ్ తో జరిగిన గొడవ శోభాశెట్టికి చాలా డ్యామేజే చేసింది. ఆమె బాధలో అర్థం ఉంది. హౌస్ మేట్ అయ్యే అవకాశాన్ని దూరం చేస్తున్నారు అంటే ఎవరికైనా కోపం వస్తుంది. కానీ.. బాధ, కోపాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాం అనేది ముఖ్యం. శోభశెట్టి తన బాధను తప్పుగా ప్రదర్శించింది. గౌతమ్ పై చిందులు తొక్కడం, అరే ఒరే అంటూ నానా మాటలు అనడం.. తనకే బ్యాక్ ఫైర్ అయింది. అవకాశం సంగతి పక్కన పెడితే.. అసలు పడే ఓట్లు కూడా దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు శోభాశెట్టికి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఇప్పటివరకు ఉన్న నెగిటివిటీని తుడిచిపెట్టేసే టాస్క్ వచ్చింది. శోభాశెట్టి డిజర్వింగ్ అని ప్రూవ్ చేసుకోవాలి అంటే.. అతి ఘాటైన చికెన్ తినాలి. ఎక్కువ చికెన్ పీసులు తిని.. ఆ ఘాటును తట్టుకోవాలి. శోభాశెట్టి చికెన్ తినడం ప్రారంభించింది. ఆ చికెన్ చాలా ఘాటైన చికెన్ కావడంతో ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. లైఫ్ లో ఇంత ఘాటు నేను ఎప్పుడూ తినలేదు అంటూ ఏడ్చేసింది. బిగ్ బాస్ కి వచ్చే ముందు తల్లికి ఏడవను అని మాటిచ్చింది అంట. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఏడవకుండా ఉండలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఘాటు తట్టుకోలేక టిష్యూ పేపర్ తీసుకుని నాలుక తుడుచుకుంది. ఇవ్వన్నీ చూసిన ప్రేక్షకులు ఎమోషనల్ అయిపోతారు. శోభాశెట్టికి కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ టాస్క్ పడిందనే చెప్పాలి.

తర్వాత శోభాశెట్టిని బీట్ చేయమని అదే టాస్కుని ప్రశాంత్, గౌతమ్, శుభశ్రీలకు కూడా ఇచ్చారు. వాళ్లు కూడా ఈ ఘాటైన చికెన్ తినేందుకు నానా తంటాలు పడ్డారు. ప్రశాంత్ అయితే ఒకానొక టైమ్ లో గెలుస్తాడు అనిపించింది. కానీ, 27 చికెన్ పీసులు తిన్న శోభాశెట్టినే ఈ టాస్కులో విజయం సాధించింది. దాంతో మూడో పవరాస్త్రం కోసం ప్రస్తుతానికి ప్రిన్స్ యావర్, శోభాశెట్టి రేసులోకి వచ్చారు. అయితే వస్తున్న లీకుల ప్రకారం మూడో కంటెండర్ గా ప్రియాంక జైన్ గెలుపొందినట్లు తెలుస్తోంది. ఆమె టాస్కు కోసం తన జుట్టు కట్ చేయించుకుందని తెలుస్తోంది. అమర్ దీప్ గుండు చేయించుకునేందుకు నిరాకరించడంతో.. ప్రియాంక తన జుట్టు కత్తిరించుకుని కంటెండర్ అయింది. ఇప్పుడు ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శోభాశెట్టి మూడో పవరాస్త్రం కోసం పోటీ పడనున్నారు. మరి.. ఈ టాస్కు శోభాశెట్టి పాజిటివ్ అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet