Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వీకెండ్ అనగానే ఒకరు ఎలిమినేట్ అయి బయటకు రావాల్సిందే. అయితే బిగ్ బాస్ కుట్రకు రతికా రోజ్ బలైంది అంటున్నారు. అందుకు ఒక ఇంట్రస్టింగ్ ఫార్ములా చెబుతున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వీకెండ్ అనగానే ఒకరు ఎలిమినేట్ అయి బయటకు రావాల్సిందే. అయితే బిగ్ బాస్ కుట్రకు రతికా రోజ్ బలైంది అంటున్నారు. అందుకు ఒక ఇంట్రస్టింగ్ ఫార్ములా చెబుతున్నారు.
Tirupathi Rao
ఫ్యామిలీ వీకెండ్ దాదాపుగా ముగింపు దశలో ఉంది. ఈ వీక్ ఆడియన్స్ కూడా ఎమోషనల్ అవుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో ఎమోషనల్ విషయం కూడా ఉంది. అదేంటంటే వీకెండ్ అనగానే హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే ప్రశ్న కచ్చితంగా ఉంటుంది. అయితే అందుకు సమాధానంగా రతికా రోజ్ పేరు వినిపిస్తోంది. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అంచుల వరకు వెళ్లి తిరిగి వెనక్కు వచ్చింది. ఈ వారం మాత్రం తప్పించుకునేందుకు ఆస్కారం లేదని చెబుతున్నారు. ఒకవేళ రతికా ఈ వీక్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయితే దాని వెనుక బిగ్ బాస్ కుట్ర కచ్చితంగా ఉంటుంది అంటున్నారు. అందుకు ఒక ఫార్ములా కూడా చెబుతున్నారు.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీకెండ్ అనేది నడుస్తోంది. ఇందులో ఒక్కో కంటెస్టెంట్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్ లోకి వస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన ప్రోమోలు, ఎపిసోడ్లు ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ వీక్ హౌస్ లో మొత్తం ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ప్రేక్షకుల ఆదరణ పొంది ఓట్లు సంపాదించుకోవాలి అంటే హౌస్ లో టాస్కులు ఆడుతూ తమని తాము ప్రూవ్ చేసుకోవాలి. కానీ, ఈ వీక్ మాత్రం హౌస్ లో ఎలాంటి టాస్కులు లేవు. ఫ్యామిలీ వీకెండ్ ప్రోమోలు, ఎపిసోడ్లే హౌస్ మేట్స్ కు ప్లస్ అయ్యాయి. శుక్రవారం రాత్రితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతాయి. అంతకన్నా ముందు వారికి ఓట్లు పడాలి అంటే ప్రేక్షకులను వీళ్లు ఇంప్రెస్ చేయాలి. అందుకు రతికాకి అసలు అవకాశం లేకుండా పోయింది.
నామినేషన్స్ లో ఉన్న శివాజీ, భోలే షావలీ, గౌతమ్, రతికా రోజ్, యావర్ లలో బుధవారం నాటికి శివాజీ, భోలే, గౌతమ్ ఫ్యామిలీ హౌస్ లోకి వచ్చింది. గురువారం ఎపిసోడ్ కి యావర్ బ్రదర్ కూడా హౌస్ లోకి వచ్చాడు. కానీ, నామినేషన్స్ లో ఉన్న రతికా రోజ్ తండ్రి మాత్రం రాలేదు. ఆయన వచ్చిన ఎపిసోడ్ శుక్రవారం రాత్రి ప్రసారం కానుంది. ఆ ఎపిసోడ్ ప్లే అవ్వడం వల్ల రతికా రోజ్ ఓటింగ్ పై ఎలాంటి ప్రభావం చూపే ఆస్కారం ఉండదు. ఈ విషయంలోనే బిగ్ బాస్ రతికా రోజ్ ని లైట్ తీసుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పైగా ఈ వీక్ రతికానే ఎలిమినేట్ కూడా అవుతుందని బలంగా చెబుతున్నారు. ఈ అంచనాలు, వ్యూహాలు అన్నీ పక్కన పెడితే రతికా ఆట కూడా అంత ఆకట్టుకునే విధంగా లేదనే చెప్పాలి.
రెండోసారి దక్కిన అవకాశాన్ని రతికా రోజ్ ఉపయోగించుకోవడంలో మిస్ ఫైర్ అయ్యిందనే చెప్పాలి. ఫస్ట్ టైమ్ హౌస్ లో ఉన్నప్పుడు జరిగిన తప్పులను సరి చేసుకోవడానికి మాత్రమే ఈ అవకాశాన్ని వాడుకుంది. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ లకు సారీలు చెప్పడం తన తప్పు ఏం లేదు అని వాళ్లకి తెలిసేలా చేయాలి అనుకోవడంతోనే తన ఆట సరిపోయింది. మొదటివారం తాను అసలు ఏం ఆడలేదు అంటూ ఆమే స్వయంగా అంగీకరించింది. అలాగే రెండో వీక్ లో కూడా ఆమె ఆట ఏం లేదని హోస్ట్ నాగార్జున కూడా బాహాటంగానే చెప్పారు. ఇంకా ఆడాలి అంటూ హెచ్చరించారు కూడా. కానీ, రతికా రోజ్ మాత్రం అక్కడి ఉండిపోయింది. రెండోసారి వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని రతికా రోజ్ యూజ్ చేసుకోలేదు అనే చెప్పాలి. మరి.. రెండోసారి వచ్చిన అవకాశాన్ని రతికా రోజ్ ఉపయోగించుకుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.