iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: రతికా రోజ్ ఎలిమినేషన్! నాలుగోవారమే హౌస్ నుంచి బయటకు..

  • Published Sep 30, 2023 | 3:16 PM Updated Updated Sep 30, 2023 | 3:16 PM
  • Published Sep 30, 2023 | 3:16 PMUpdated Sep 30, 2023 | 3:16 PM
Bigg Boss 7 Telugu: రతికా రోజ్ ఎలిమినేషన్! నాలుగోవారమే హౌస్ నుంచి బయటకు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 బాగా ఉత్కంఠగా సాగుతోంది. పైగా వీకెండ్ కావడంతో ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు అనే ప్రశ్న బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ వీక్ ఎలిమినేషన్ కోసం ప్రేక్షకులు గట్టిగానే ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ వీక్ అనధికారిక ఓటింగ్ లో రతికా లీస్ట్ పొజిషన్ లో ఉంది. ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ కావాలి అని కోరుకునే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా శుక్రవారం ఎపిసోడ్ తర్వాత ఆమెపై నెగిటివిటీ మరింత పెరింగింది. పల్లవి ప్రశాంత్ పై చేసిన కామెంట్స్ ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. అందుకే శుక్రవారం రాత్రి ఓటింగ్ మొత్తం తారుమారు అయింది.

నిజానికి ఈ వీక్ హౌస్ నుంచి వెళ్లిపోవాల్సిన వ్యక్తి టేస్టీ తేజ. అన్ని పోలింగ్స్ లో టేస్టీ తేజ పేరు లీస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. అయితే రతికా రోజ్ చేసుకున్న స్వయంకృతాపరాధం వల్లే ఆమె ఇప్పుడు హౌస్ నుంచి బయటకు రావాల్సి వస్తోంది అంటున్నారు. రతికా ప్రవర్తన చూసిన తర్వాత ప్రశాంత్ అభిమానులు, న్యూట్రల్ గా ఉన్న ప్రేక్షకులు అంతా టేస్టీ తేజాకు ఓట్లు వేశారు. ఆ ఇంపాక్ట్ రతికాపై పడింది. వెంటనే తేజ లాస్ట్ నుంచి ఒక స్థానం పైకి వెళ్లాడు. దాంతో రతికా ఇప్పుడు ఎలిమినేట్ అయ్యే పరిస్థితిలోకి వచ్చింది. రతికా రోజ్ ని ఎలిమినేట్ చేయడానికి ఆమెపై బయట వచ్చిన నెగిటివిటీ కూడా కారణంగా చెప్పచ్చు.

ఇది కూడా చదవండి: ఫలించిన బిగ్ బాస్ ప్లాన్.. నాలుగో హౌస్ మేట్ గా ప్రశాంత్!

ఇది కూడా చదవండి: లివ్ ఇన్ రిలేషన్ పై సింగర్ ధామినీ ఆసక్తికర వ్యాఖ్యలు!

బిగ్ బాస్ హిస్టరీలో ఏ కంటెస్టెంట్ కి రాని నెగిటివ్ పబ్లిసిటీ రతికా రోజ్ కు కేవలం రెండు వారాల్లోనే వచ్చింది. పైగా ఈ రెండు వారాల్లో రతికా రోజ్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన కామెంట్స్ ఆమెకు మరింత నెగిటివిటీని మూటగట్టాయి. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ విషయంలో అస్సలు తన తప్పు లేదు అంటూ ఆమె చేసిన ప్రవర్తన బాగా బ్యాక్ ఫైర్ అయింది. ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వాలని ఇంతలా కోరుకోవడం, ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే సంబరాలు చేసుకుంటాం అనడం.. ఈ సీజన్ లో రతికా విషయంలోనే చూస్తున్నాం. ఎంత కంటెంట్ వచ్చినా బిగ్ బాస్ కూడా రతికాని ఎంకరేజ్ చేయదనే చెబుతున్నారు. నిజానికి రతికా రోజ్ ని ఎలిమినేట్ చేయడం ఆమెకు మంచి చేడమే అవుతుంది. ఇలాగే హౌస్ లో ఉంచితే ఆమె ఆడుతున్న తీరుకు మరింత నెగిటివ్ అవుతుంది.

ఆ ఇంపాక్ట్ ఆమె కెరీర్ మీద కూడా పడే అవకాశం ఉంది. మొదటి నుంచి ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. ప్రశాంత్ విషయంలో ప్లేట్ ఫిరాయించడం, తన తప్పులేదు అంటూ అందరిముందు పల్లవి ప్రశాంత్ మీద విరుచుకుపడటం, ప్రిన్స్ యావర్ తో క్లోజ్ గా ఉండి.. అతను డిసర్వింగ్ అని గొడవ చేసి.. తర్వాత అతడు అనర్హుడు అని చెప్పడం ఇలా హౌస్ లో రతికా తీసుకున్న నిర్ణయాలు చాలానే బ్యాక్ ఫైర్ అయ్యాయి. ఆమెపై ట్రోలింగ్ కూడా ఒక రేంజ్ లో జరిగింది. అయితే ఇది అధికారికంగా తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చే దాకా ఆగాల్సిందే. అనధికారిక పోల్స్, సోషల్ మీడియా లీకులు మాత్రం రతికా రోజ్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్లు చెబుతున్నారు. మరి.. రతికా రోజ్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by BB & MOVIES UPDATES❤️ (@biggboss_on_wheels)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet