iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: లివ్ ఇన్ రిలేషన్ పై సింగర్ ధామినీ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Published Sep 30, 2023 | 2:09 PM Updated Updated Sep 30, 2023 | 2:09 PM
  • Published Sep 30, 2023 | 2:09 PMUpdated Sep 30, 2023 | 2:09 PM
Bigg Boss 7 Telugu: లివ్ ఇన్ రిలేషన్ పై సింగర్ ధామినీ ఆసక్తికర వ్యాఖ్యలు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టాగా ఎంతో ఆసక్తిగా సాగుతోంది. హౌస్ లో ఉన్న వాళ్ల గురించి ఎంతగా మాట్లాడుకుంటారో.. హౌస్ నుంచి వచ్చిన వాళ్ల గురించి కూడా అంతకన్నా ఎక్కువే మాట్లాడుకుంటారు. ముఖ్యంగా వారు ఇంటర్య్వూలలో చెప్పే విషయాలు బాగా హైలెట్ అవుతూ ఉంటాయి. మూడో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయి వచ్చిన సింగర్ ధామినీ గురించి సోషల్ మీడియాలో బాగానే చర్చ జరుగుతోంది. ఆమె ఆట మొదలు పెట్టిన సమయానికి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా లివ్ ఇన్ రిలేషన్ గురించి ధామినీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సింగర్ ధామినీ అలియాస్ వంటలక్క. బిగ్ బాస్ హౌస్ లో ధామినీ ఎంతో చక్కగా వంట చేసింది. అందరికీ ప్రేమగా వండి పెట్టింది. కానీ, అదే ఆమెకు పెద్ద మైనస్ అయింది. వంటలక్క అనే ముద్ర పడటంతోపాటుగా.. ఎలిమినేట్ అయ్యేలా కూడా చేసింది. గేమ్ పరంగా ధామినీ అసలు కనిపించలేదు.. కేవలం కిచెన్ లోనే ఉంది.. టాస్కుల్లో పర్ఫార్మెన్స్ లేదు అంటూ హౌస్ లో, బయట కామెంట్స్ చేశారు. అయితే ధామినీ తప్పు తెలుసుకుని ఆట మొదలు పెట్టే సమయానికి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. కానీ, ధామినీ ఎక్కడా ఫీలవలేదు. హౌస్ లో ఉండే వారికి చక్కగా సజీషన్స్ కూడా ఇచ్చి వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధామినీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వాటిలో సహజీవనానికి సంబధించిన కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లో ధామినీని చూసిన తర్వాత ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఉంది. ఆమె ఏదున్నా కూడా ముఖం మీద చెప్పేస్తుంది అని. అలాగే లివ్ ఇన్ రిలేషన్ గురించి కామెంట్ చేయగానే.. తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పేసింది. “నాకు వ్యక్తిగతంగా లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం. ప్రేమ వివాహాన్నే నమ్ముతాను. అయితే నాకు నచ్చిన వ్యక్తి ఇంకా తారసపడలేదు. ఈ రోజుల్లో సహజీవనం అనేది తప్పేంకాదు. సహజీవనం చేయడం కూడా ఇష్టం. నాకు నచ్చిన వ్యక్తి దొరికి.. అలాంటి పరిస్థితి వస్తే మాత్రం తప్పకుండా సహజీవనం చేస్తాను. అయితే తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకునే సహజీవనం చేస్తాను. మా అమ్మానాన్న నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరు. అందుకే నాకు ఇంకా పెళ్లి కాలేదు” అంటూ ప్రేమ, లివ్ ఇన్ రిలేషన్, లవ్ మ్యారేజ్ గురించి తన మనసులో ఉన్న విషయాలను ధామినీ బయటపెట్టేసింది.

 

View this post on Instagram

 

A post shared by Rahul Sipligunj (@sipligunjrahul)

అంతేకాకుండా తనకు వంటలక్క అనే పేరు కారణం శివాజీ అని చెప్పుకొచ్చింది. ఆయనే తనకు వంటలక్క అనే పేరు పెట్టారు అని చెప్పింది. మరోవైపు సింగర్ ధామినీ మరోసారి హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. బిగ్ బాస్ సెకండ్ లాంఛ్ ఈవెంట్ ఉందని.. ఆసమయంలో దాదాపు ఆరుగురు సభ్యులను హౌస్ లోకి పంపుతారనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. వారిలో ధామినీ కూడా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. మరి.. సింగర్ ధామినీ మరోసారి హౌస్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Damini Bhatla (@daminibhatlach)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet