iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: రైతు బిడ్డ ప్రశాంత్ మోసం చేసాడు అంటూ కధనాలు – నిజమెంత..?

  • Published Oct 05, 2023 | 5:59 PM Updated Updated Oct 05, 2023 | 5:59 PM
  • Published Oct 05, 2023 | 5:59 PMUpdated Oct 05, 2023 | 5:59 PM
Bigg Boss 7 Telugu: రైతు బిడ్డ ప్రశాంత్ మోసం చేసాడు అంటూ కధనాలు – నిజమెంత..?

పల్లవి ప్రశాంత్.. ఇలా అనేకంటే రైతుబిడ్డ అంటే ఈజీగా గుర్తుపడతారేమో. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం అయినప్పటి నుంచి ఈ పేరు బాగా వైరల్ అవుతోంది. నిజానికి అంతకంటే ముందు వైరల్ అవ్వడం వల్లే ప్రశాంత్ కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లోకి వచ్చాడు. వచ్చాక రైతుబిడ్డను అన్న అంటూ రతికా చుట్టూ తిరుగుతూ కంటెంట్ కోసం వీర ప్రయత్నాలు చేశాడు. ఆమె రివర్స్ అవ్వడంతో అక్క అంటూ కాళ్ల బేరానికి వచ్చాడు. అప్పుడు ప్రశాంత్ పై చాలానే ట్రోలింగ్ జరిగింది. నిజానికి హౌస్ లోకి వచ్చినప్పటి నుంచే విపరీతమైన ట్రోలింగ్ ఉంది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఈసారి కూడా అడ్డంగా బుక్ అయ్యాడు.

పల్లవి ప్రశాంత్ ఒక రైతుబిడ్డగా హౌస్ లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత అతని మాటలు, చేతలు చూసి అంతా కాస్త ఎక్కువ చేస్తున్నాడే అనే అభిప్రాయానికి వచ్చాడు. పైగా హౌస్ లోకి వచ్చిన తర్వాత రతికా రోజ్ వెనక తిరగడం మనోడికి బాగానే బ్యాడ్ అయ్యింది. రైతుపడే కష్టాలు చెబుతానని బిగ్ బాస్ హౌస్ కి వచ్చి.. అమ్మాయి వెనుక తిరుగుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పల్లవి ప్రశాంత్ కెమెరాలకు నీళ్లు తాగమని ఇవ్వడం, కిందపడిపోయిన ఎంగిలి మెతుకులు తినడం కూడా బాగానే నెగిటివ్ అయింది. హౌస్ లో ఎవరో తిని కింద పడేసిన మెతుకులు తిన్న ప్రశాంత్.. బయట మాత్రం రీల్స్ కోసం ప్లేట్ నిండా ఉన్న మటన్ పారేస్తూ కనిపించాడు. అలా మనోడు సింపథీ కోసం హౌస్ లో చేసిన చాలా విషయాలు బయట బ్యాక్ ఫయర్ అయ్యాయి.

సెకండ్ వీక్ నామినేషన్స్ సమయంలో బిగ్ బాస్ హౌస్ కి రావడానికి ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చాడు. నాకు బిగ్ బాస్ కి వెళ్లాలి అనే కోరిక తప్ప నేను బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా చూడలేదు అంటూ చెప్పాడు. అక్కడితో ఆగకుండా బిగ్ బాస్ కోసం అని వస్తే గేటు కూడా తాకనివ్వలేదు.. గేటు బయట కుక్కలా కూర్చున్నాను అంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశాడు. ఆ సమయంలో రతికా రోజ్ ఒక విషయాన్ని వెల్లడించింది. ప్రశాంత్ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఒక పిల్లాడు అన్న టీవీ ముందు కూర్చుని బిగ్ బాస్ చూసేవాడు అంటూ చెప్పిన విషయాన్ని రివీల్ చేసింది. అయినా ప్రశాంత్ ఆ విషయాన్ని అంగీకరించలేదు. అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సింపథీ గేమ్ కి ఒక పెద్ద వీడియో ప్రూఫ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అసలు బిగ్ బాస్ ఆటే నాకు తెలియదు అని చెప్పిన ప్రశాంత్.. ఏకంగా బిగ్ బాస్ ఎపిసోడ్ వీకెండ్ షూట్ లో పాల్గొన్నాడు. అందుకు సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింగర్ రేవంత్- ఇనయా సుల్తానా- రివ్యూవర్ ఆదిరెడ్డి డాన్స్ చేస్తున్న సమయంలో ఆడియన్స్ లో పల్లవి ప్రశాంత్ కూర్చుని ఉన్నాడు. ఈ క్లిప్ చూపించి అందరూ పల్లవి ప్రశాంత్ సింపథీ గేమర్, పల్లవి ప్రశాంత్ టూ ఫేస్ గేమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే హౌస్ లో జరుగుతున్న టాస్కుల్లో మాత్రం పల్లవి ప్రశాంత్ సత్తా చాటుతున్నాడు. నాలుగో హౌస్ మేట్ కూడా అయ్యాడు. గేమ్ పరంగా ఓకే అనిపించినా కూడా హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు మాస్క్ వేసుకుని ఆడాలి? అంటూ ప్రశ్నిస్తున్నారు.  మరి.. పల్లవి ప్రశాంత్ చెప్పిన మాటలు.. తెలుస్తున్న నిజాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Arey Thai (@areythai)

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş