Tirupathi Rao
బిగ్ బాస్ హౌస్ లో సోమవారం అంటే ఆడియన్స్ కి ఎంటర్ టైన్మెంట్ పక్కా అని చెప్పాలి. ఎందుకంటే నామినేషన్స్ లో కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. మరి ఈ వారం ఎవరు నామినేషన్స్ లో ఉన్నారంటే?
బిగ్ బాస్ హౌస్ లో సోమవారం అంటే ఆడియన్స్ కి ఎంటర్ టైన్మెంట్ పక్కా అని చెప్పాలి. ఎందుకంటే నామినేషన్స్ లో కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. మరి ఈ వారం ఎవరు నామినేషన్స్ లో ఉన్నారంటే?
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో సోమవారం అనగానే ఆడియన్స్ కి ఫేవరెట్ అయిపోయింది. ఎందుకంటే ఏ సీజన్లో లేని విధంగా ఈ సీజన్ లో నామినేషన్స్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ వీక్ కూడా ఇద్దరు కలసి తలా ఒక పేరు చెప్పేలా నామినేషన్స్ ని ప్లాన్ చేశారు. ఇంట్లో ఉన్న నలుగురు అమ్మాయిలను రాజమాతలను చేశారు. వారికి ఎవరి పాయింట్స్ వాలిడ్ అనిపిస్తాయో ఏకాభిప్రాయంతో వారి నామినేషన్ ని స్వీకరించాలి. ఈ వారం మొత్తం ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వీక్ అమర్ దీప్ ఫ్యాన్స్ కి కాస్త రెస్ట్ దొరికింది. అయితే ఈ నామినేషన్స్ లో గొడవలు కూడా గట్టిగానే జరిగాయి. ముఖ్యంగా ప్రియాంక, శోభాలకు అశ్వినీ శ్రీతో గొడవ జరిగింది. ఆమె వీళ్ల కాళ్లు కూడా మొక్కింది.
నామినేషన్స్ లో రాజమాతలు చేయాల్సింది చెప్పే వాళ్ల పాయింట్స్ విని ఎవరిది వాలిడ్ అనేది బేరీజు వేసుకోవాలి. కానీ, ఇక్కడ రాజమాతలు వారికి నచ్చిన వారి స్టాండ్ తీసుకుంటున్నారు. కావాలంటే నామినేషన్ లో ఉన్నవారి తరఫున వీళ్లే వాదిస్తున్నారు. న్యాయమూర్తిగా కూర్చో బెడితే.. న్యాయవాదిగా ప్రవర్తించారు. నలుగురూ ఒకానొక టైమ్ లో తమకు నచ్చిన వారికోసం స్టాండ్ తీసుకున్నారు. అమర్ ఎన్నిసార్లు నామినేషన్ పాయింట్స్ తీసుకొచ్చినా కూడా రాజమాతలు యాక్సెప్ట్ చేయలేదు. అయితే వీళ్లు కావాలనే చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పాయింట్స్ ని బట్టే నిర్ణయం తీసుకున్నారు అనిపించింది.
యావర్ సెల్ఫ్ నామినేషన్ విషయంలో మాత్రం ప్రియాంక, శోభా నిర్ణయం కొన్ని అనుమానాలకు తావిచ్చినట్లు ఉంది. అయితే యావర్ వాంటెడ్ గా అమర్ ని చేయడానికి వచ్చాడు అని అందరికీ తెలుసు. కాబట్టి ఆ నిర్ణయం కూడా తప్పేంకాదని చెప్పాలి. ఇంక అశ్వినీతో ప్రియాంక- శోభాలకు పెద్ద గొడవే అయ్యింది. భోలే విషయంలో అశ్వినీ ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించింది. అందుకు ప్రియాంక కోపంతో ఊగిపోయింది. నేను భోలేతో మాట్లాడుతున్నాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యలో శోభా కూడా ఎంటర్ అయ్యింది. అప్పటి నుంచి చినికి చినికి గాలివాన అయినట్లైంది. ప్రతిసారి నీ మాట నెగ్గాలి, నువ్వు చెప్పింది జరగాలి అంటే అవ్వదు అశ్వినీ అంటూ శోభా కేకలు వేసింది. నిజానికి నిన్నటి నామినేషన్స్ ని ఏకాభిప్రాయం అన్నారు. కానీ, అక్కడ నిర్ణయాలు అన్నీ శోభా, ప్రియాంకనే తీసుకున్నారు. వాటిని రతికా, శోభా ఫాలో అవుతూ వచ్చారు.
చివరికి మాట మాత్రం అశ్వినీకి నచ్చిందే జరిగింది అంటూ కామెంట్ చేశారు. వీళ్ల గొడవ మొత్తం చూస్తే.. ఒకానొక సమయంలో ప్రియాంక- శోభా లైన్ క్రాస్ చేసి ప్రవర్తించారు అనే చెప్పాలి. ముఖ్యంగా ప్రియాంక చిన్న విషయానికి కూడా కన్నెర్ర చేయడం, కేకలు వేయడం చూస్తున్నారు. వీళ్లతో పోట్లాడలేక అశ్వినీ చేతులెత్తేసింది. మీ కాళ్లు మొక్కుతాను అంటూ కాళ్లు పట్టుకుంది. ఇది చూసి శోభా- ప్రియాంక చిందులు తొక్కారు. ఏం చేస్తున్నావ్ అంటూ కేకలు వేశారు. ఈ మొత్తం గొడవలో శోభా, ప్రియాంక వేసిన కేకలకు అశ్వినీనే కాదు.. రతికా అయినా కూడా తోక ముడవాల్సిందే. అలా ప్రవర్తించారు వాళ్లు. ప్రియాంక గేరు మార్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇంకా హౌస్ లో 4 వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. హౌస్ లో టాప్ 5కి చేరాలి అంటే ఈ మాత్రం అగ్రెషన్ లేకపోతే పనికాదు. అదే ఫార్ములాను ప్రియాంక అప్లయ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. మరి.. ప్రియాంక- శోభా ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.