iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ నుండి ప్రియాంక జైన్ ఎలిమినేట్!

  • Published Dec 17, 2023 | 10:32 PM Updated Updated Dec 17, 2023 | 10:32 PM

అందరూ ఊహించిన విధంగానే బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయ్యింది. మాస్ మహారాజ రవితేజ ఈ ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు.

అందరూ ఊహించిన విధంగానే బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయ్యింది. మాస్ మహారాజ రవితేజ ఈ ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు.

  • Published Dec 17, 2023 | 10:32 PMUpdated Dec 17, 2023 | 10:32 PM
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ నుండి ప్రియాంక జైన్ ఎలిమినేట్!

105 రోజులుగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. డిసెంబర్ 17న అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ను మేకర్స్ అద్భుతంగా తీర్చిదిద్దారు. టాప్ 6 కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. అందులో భాగంగా ఫస్ట్ ఎలిమినేషన్ జరిగిన విషయం తెసిందే. టాప్ 6 నుంచి అంబటి అర్జున్ ఎలిమినేట్ అయిన సంగతి విదితమే. యాంకర్ సుమ హౌస్ లోకి అడుగుపెట్టి అర్జున్ ను తన వెంట తీసుకెళ్లింది. ఇక నెక్ట్స్ ఎలిమినేషన్ అందరూ అనుకున్నట్లుగానే జరిగింది. అందరూ ఊహించిన విధంగానే ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయ్యింది. మాస్ మహారాజ రవితేజ ఈ ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు.

ఇక ప్రియాంక జైన్ సంగతి చెప్పనక్కర్లేదు. చాలా స్ట్రాంగ్ గా ఆడి.. ఫైనల్ వరకు చేరింది. ప్రతి విషయంలోనూ చాలా మెచ్యూర్డ్ లెవల్స్ మెయిన్ టైన్ చేసింది. అందుకే లేడీ కంటెస్టెంట్లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యింది. ఫైనలిస్టుల్లో ఉన్న ఒకే ఒక్క లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ తాజాగా ఎలిమినేట్ అయింది. 5వ స్థానంలో ఆమె హౌస్ నుంచి తప్పుకుంది. దీంతో యావర్, ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్‌లు హౌస్‌లో మిగిలారు. ఇక ఎలిమినేట్ తర్వాత సంతోషంగా మాట్లాడింది ప్రియాంక. “నేను ఇంతవరకూ వస్తానని అసలు ఊహించలేదు.. నేను ఇంత స్ట్రాంగ్ అని అనుకోలేదు.. నేను చాలా హ్యాపీ..” అంటూ చెప్పింది. ఇక తన కూతురు గేమ్‌ గురించి చెబుతూ ప్రియాంక తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. “నా కూతురు గేమ్ ఫస్ట్ క్లాస్.. అందుకే ఇక్కడి వరకు వచ్చింది” అని ఆమె తండ్రి చెప్పారు. మరి, బిగ్ బాస్ సీజన్ 7 లో అర్జున్, ప్రియాంక ఎలిమినేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom