Tirupathi Rao
బిగ్ బాస్ ఆట ఆఖరి అంఖానికి చేరుకుంటోంది. ఇప్పుడు అందరూ కూడా ఫైనలిస్ట్ అయ్యేందుకు పోటీ పడుతున్నారు. వారిలో ప్రియాంక టాప్ 5 అయ్యే కంటెస్టెంట్ అయ్యేలా కనిపిస్తోంది. ఒక్క ఎపిసోడ్ తో ప్రియాంక గ్రాఫ్ మారిపోయింది.
బిగ్ బాస్ ఆట ఆఖరి అంఖానికి చేరుకుంటోంది. ఇప్పుడు అందరూ కూడా ఫైనలిస్ట్ అయ్యేందుకు పోటీ పడుతున్నారు. వారిలో ప్రియాంక టాప్ 5 అయ్యే కంటెస్టెంట్ అయ్యేలా కనిపిస్తోంది. ఒక్క ఎపిసోడ్ తో ప్రియాంక గ్రాఫ్ మారిపోయింది.
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట మరింత ఉత్కఠగా సాగుతోంది. ఎప్పుడు ఎవరి గ్రాఫ్ పెరుగుతుందో? ఎవరి గ్రాఫ్ పాతాళానికి పడిపోతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక చిన్న టాస్కు చాలు.. కంటెస్టెంట్ ని ఆడియన్స్ లో హీరోని చేయడానికి అలాంటి ఒక టాస్కు ఇప్పుడు ప్రియాంకకు దక్కింది. దెబ్బకు ఆమెకు గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఇన్నాళ్లు టాప్ 5లో శోభా ఉంటుందని అంతా భావించారు. కానీ, ఇప్పుడు మాత్రం ప్రియాంక పేరు బాగా వినిపిస్తోంది. అసలు ఆ టాస్కు ఏంటి? ప్రియాంక గ్రాఫ్ అంతలా మారిపోవడానికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫినాలే అస్త్రా కోసం టాస్కులు నడుస్తున్నాయి. ఈసారి హౌస్ లో అందరికీ టాస్కులతో పాయింట్స్ వస్తాయి. ఎవరికైతే ఎక్కవ పాయింట్స్ వస్తాయో వారికి ఫినాలే అస్త్రా దొరుకుతుంది. అయితే అలా నేరుగా ఇచ్చేస్తారా అంటే? మళ్లీ టాప్ 3కి అలా టాస్కులు పెట్టే ఆస్కారం లేకపోలేదు. ప్రస్తుతం అయితే టాప్ లో అమర్ దీప్ కొనసాగుతున్నాడు. ఆ తర్వాత అర్జున్, యావర్, ప్రశాంత్, గౌతమ్, ప్రియాంకలు ఉన్నారు. శోభా, శివాజీ తక్కువ పాయింట్లు ఉండటం వల్ల రేసు నుంచి తప్పుకున్నారు. వాళ్లిద్దరు చెరో 90 పాయింట్స్ అమర్ దీప్ కి ఇచ్చారు. అందుకే అమర్ ఇప్పుడు మొత్తం 380 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు.
ఇలాగే ఆటను కంటిన్యూ చేస్తే అమర్ కు కచ్చితంగా ఫినాలే అస్త్ర దొరికే అవకాశం ఉంటుంది. అందుకోసం అమర్ ఎంతో కష్టపడి ఆడుతున్నాడు. మొదటిసారి ప్రియాంకను కాదని అమర్ ఆటాడాడు. ఇన్నాళ్లు ఫ్రెండ్స్ కోసం ఆడుతున్నారు అని వస్తున్న కామెంట్స్ కు అమర్ దీప్ అడ్డుకట్ట వేసినట్లు అయింది. విషయం ఏంటంటే… ఫినాలే అస్త్రా కోసం పెట్టిన బాల్ టాస్కులో అర్జున్ మొదట విజయం సాధించాడు. ఆ తర్వాత ప్రశాంత్, యావర్, గౌతమ్ గెలిచారు. ఈ టాస్కులో ఎవరైతే లాస్టులో వస్తారో వారికి ఎలాంటి పాయింట్స్ రావు. అందుకే అమర్ దీప్ తన లీడ్ ని కొనసాగించడానికి ప్రియాంక దగ్గర బాల్ ని లాక్కున్నాడు. కానీ, అంత తేలిగ్గా అయితే లాక్కోలేకపోయాడు. ప్రియాంక చాలా బాగా ఫైట్ చేసింది. తన గెలిచేందుకు ఎంతో పోరాడింది. అమర్ కూడా తన ఫ్రెండ్ అని చూడకుండా ఎంతో బాగా ఆడాడు.
ఈ ఎపిసోడ్ ఇద్దరికీ ఎంతో పాజిటివ్ అయ్యింది. ఎందుకంటే ప్రియాంకని అందరూ చాలా వీక్ అనుకున్నారు. కానీ, ఆమె మాత్రం ఎంతో స్ట్రాంగ్ అనే విషయాన్ని ఈ టాస్కుతో ప్రూవ్ చేసింది. అలాగే అమర్ కూడా ఫ్రెండ్స్ ని పక్కన పెట్టి గేమ్ ఆడుతున్నాడు అనే విషయం అందరికీ క్లారిటీ వచ్చింది. టాస్కు అయిపోయిన తర్వాత కూడా ప్రియాంక ఎంతో స్పోర్టివ్ గా తీసుకుంది. ఎవరికీ కూడా ఎలాంటి మాటలు అనలేదు. సంచాలకులు రూల్ పెట్టారు కాబట్టే అలాంటి ఆట ఆడారు అంటూ చెప్పుకొచ్చింది. ఇంక అమర్, ప్రశాంత్ ఇద్దరికీ ప్రియాంక ఏమీ అనలేదు. కానీ తాను ఫిజికల్ గా వీక్ గా ఉన్నాను అంటూ ఏడ్చేసింది. ఆమెకు ఇప్పుడు నెట్టింట మంచి సపోర్ట్ లభిస్తోంది. ప్రియాంక టాప్ 5కి చేరుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ప్రియాంక్ టాప్ 5కి వెళ్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.