iDreamPost
android-app
ios-app

శోభా- ప్రిన్స్ మధ్య వైరం ఇప్పటిది కాదు.. వైరల్ వీడియో!

శోభా- ప్రిన్స్ మధ్య వైరం ఇప్పటిది కాదు.. వైరల్ వీడియో!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఎపిసోడ్ 20 బాగా వైరల్ హైలెట్ అయింది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లోనే మూడో పవరాస్త్రం కోసం టాస్కు జరిగింది. ఎవరు మూడో హౌస్ మేట్ అవుతారు అనే అశంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అంతేకాకుండా ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఇంకో విషయం బాగా హైలెట్ అయింది. అదేంటంటే.. ప్రిన్స్ యావర్- శోభాశెట్టి మధ్య గొడవ జరిగింది. ఆమె ప్రిన్స్ ని స్ట్రాంగ్ అని చెప్పి టాస్కు నుంచి తప్పించింది. అంతే కాకుండా అదే పాయింట్ పై వాళ్లిద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే వీళ్ల మధ్య వైరం ఇప్పటిది కాదు. ఎన్నాళ్ల నుంచో కొనసాగుతున్న విషయాన్ని సోషల్ మీడియా వెల్లడించింది.

బిగ్ బాస్ హౌస్ లో మూడో పవరాస్త్రం కోసం ముగ్గురు కంటెండర్లు రాగా.. ఎవరు వీకో చెప్పండి అంటూ బిగ్ బాస్ మళ్లీ టాస్క్ ఇచ్చారు. మెజారిటీ ఓటు ఎవరికి పడితే వాళ్లు వీక్ అని చెప్పారు. ఇంకేముంది ప్రియాంక జైన్, శోభాశెట్టి ఇద్దరూ కలిసి ప్రిన్స్ యావర్ ని వీక్ కంటెస్టెంట్ కింద పక్కకు తోసేశారు. వాళ్లిద్దరూ రైడ్ ది బుల్ అనే టాస్కులో పోటీ పడ్డారు. టాస్కులో శోభాశెట్టి చాలా స్వల్ప తేడాతో విజయం సాధించింది అని కూడా చెబుతున్నారు. అయితే శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఈ సమయంలోనే ఇంకొక వీడియో కూడా నెట్టింట ప్రత్యక్షమయింది. ఆ వీడియో చూసిన తర్వాత ప్రిన్స్ యావర్– శోభాశెట్టి మధ్య వైరం ఇప్పటిది కాదు అని మీరు కూడా అంటారు. అసలు విషయం ఏంటంటే.. ప్రిన్స్ యావర్- శోభాశెట్టి కలిసి ఒక సీరియల్ లో నటించారు. ఆ సీరియల్ లో సీన్ ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. అందులో ప్రిన్స్ యావర్ పెళ్లికొడుకు గెటప్ లో ఉన్నాడు. శోభాశెట్టి చాలా సీరియస్ గా డైలాగ్ చెబుతోంది. ఈ సీన్ చూసిన తర్వాత వీళ్లకు ముందే పరిచయం ఉంటే ఎందుకు ముక్కూ మొఖం తెలియని వాళ్లలా ఓవరాక్షన్ చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా ఉప్పు, నిప్పులా ప్రిన్స్ యావర్- శోభాశెట్టి ప్రవర్తన ఉంది. సీరియల్స్ బ్యాచ్ పేరుతో అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన్ బాగానే కలిసి ఆడుతున్నారు.

మరి.. సీరియల్స్ లో కలిసి నటించిన శోభాశెట్టి- యావర్ మాత్రం ఎందుకు శత్రువుల్లా ఉంటున్నారు అనే విషయం మాత్రం అర్థం కావడంలేదు. మొత్తానికి యావర్, శోభా కలిసి నటించారనే విషయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. అలాగే ప్రిన్స్ యావర్ ని టార్గెట్ చేస్తున్నారు అనే విషయం కూడా బాగా వైరల్ అవుతోంది. హౌస్ లో యావర్ కు సపోర్ట్ లేకపోయినా.. ప్రేక్షకుల్లో మాత్రం అది బాగా కనిపిస్తోంది. అందరూ ప్రిన్స్ యావర్ తోపు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ప్రిన్స్ యావర్- శోభాశెట్టి మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by gajala trolls (@gajala_biggboss_trolls)

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş