P Krishna
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ పల్ల ప్రశాంత్ విన్నర్ గా నిలిచారు. ఇక రన్నరప్ గా అమర్ దీప్ నిలిచారు. వీరిద్దరూ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి రాగానే.. ఫ్యాన్స్ మద్య రచ్చ రచ్చ అయ్యింది.
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ పల్ల ప్రశాంత్ విన్నర్ గా నిలిచారు. ఇక రన్నరప్ గా అమర్ దీప్ నిలిచారు. వీరిద్దరూ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి రాగానే.. ఫ్యాన్స్ మద్య రచ్చ రచ్చ అయ్యింది.
P Krishna
ఈ మద్య కొంతమంది సెలబ్రెటీల అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించడం.. దాని వల్ల ప్రభుత్వ ఆస్తులు నష్టం వాటిల్లడం చూస్తూనే ఉన్నాం. అభిమానులు చేస్తున్న పనులు వల్ల సెలబట్రెటీలు సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు. బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటితో ముగిసింది. ఈ సీజన్ బిగ్ బాస్ 7 విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా గెలిచాడు. రన్నరప్ గా అమర్ దీప్ నిలిచాడు. ఆడియన్స్, ఎక్స్ కంటెంస్టెంట్స్ సభ్యుల మధ్య బిగ్ బాస్ హూస్ట్ నాగార్జున రిజల్ట్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంతో గ్రాండ్ గా ముగిసింది. అయితే పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ బయటికి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ చేసిన రచ్చ తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
టెలివిజన్ రంగంలో బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో వస్తుంది. నిన్న ఆదివారం ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈసారి బిగ్ బాస్ లో తొలిసారిగా కామన్ మెన్ కేటగిరిలో విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచి బిగ్ బాస్ ట్రోఫీని కింగ్ నాగార్జున చేతుల మీదుగా అందుకున్నారు. ఇక రన్నరప్ గా అమర్ దీప్ నిలిచారు. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోకి పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఫ్యాన్ పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ బయటికి రాగానే సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలై చిలికి చిలికి గాలివానగా మారింది. ఒకరినొకరు తోసుకుంటూ, కొట్టుకున్నానరు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొండాపూర్- సికిద్రాబాద్ ఆర్టీసీ బస్ పై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపులోకి తీసుకు వచ్చి ప్రశాంత్, అమర్ దీప్ ని వారి ఇంటికి పంపించారు.
ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రశాంత్ అభిమానులు బిగ్ బాస్ కంటెస్టెంట్, యాంకర్ గీతూ రాయల్ కారు అద్దాలు ధ్వంసం చేసి ఆమెను తాకే ప్రయత్నం చేశారని ఆ సమయంలో తన తమ్ముడు భయపడిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమర్ దీప్ ఫ్యామిలీ ప్రయాణిస్తున్న కారుపై దాడి చేయడం పై కూడా సిరియస్ అయ్యింది. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అశ్విని కి సంబంధించిన కారు ఫ్రంట్, బ్యాక్ అద్దాలు పగులగొట్టేశారు అగంతకులు. ఇది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పనే అంటూ వారి ప్రవర్తనపై సీరియస్ అయ్యాంది. గీతూ రాయల్ అయితే.. నా కారు ధ్వంసం చేసిన ఇద్దరిని పట్టి ఇస్తే.. రూ.10 వేల రివార్డు ఇస్తానని ఆఫర్ చేసింది. తమ కార్లు ధ్వంసం చేశారని అశ్విని, గీతూ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆర్టీసీ బస్సు పై దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాస్త అతిగా ప్రవర్తించారని.. మీడియాలో వాళ్లవైపు వేలెత్తి చూపిస్తున్నాయి. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కోసం వెతుకులాట మొదలు పెట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.